అభి కి ఫోన్ చేస్తారు జానకి గారు. “హలో అభి, ఏం చేస్తున్నావు. భోజనం పంపించాను తిన్నావ ” అని అడుగుతారు……
“హ, తిన్నాను అమ్మ నువ్వే పంపించావ ” అని అడిగిన అభి తో “నేను కాక ఎవరు పంపిస్తారు రా, కొత్తగా అడుగుతున్నావు ఏంటి. ఉదయం నువ్వు నేను వచ్చేలోపు వెళ్లి పోయావు అందుకే ఇంక ఆకాష్ తో పంపాను ” అని అంటారు…….
“సరే మా ఉంటాను ” అని కాల్ కట్ చేసి “ఈ పిల్లకి ఎంత పొగరు కనీసం భర్త తిన్నాడో లేదో కూడా అవసరం లేదు ” అని అనుకుంటూ “ఆయన నాకు ఆ పిల్లకి ఏంటి సంబంధం నేను ఆలోచించను తన గురించి, నా గురించి ఏమైన ఆలోచిస్తుందా ” అని అనుకుంటాడు మళ్లీ వెంటనే తన ముఖమే కళ్లముందు మెదులుతుంది…….
“ఛ! ఈ పిల్ల నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు నాకు ప్రతిసారీ తన ముఖమే గుర్తు వస్తుంది “అని ఎంత అనుకున్న తన మైండ్ డైవర్ట్ అవకపోవడంతో మనోజ్ కి కాల్ చేసి తన క్యాబిన్ కి రమ్మని చెపుతాడు……