“మనలో ఎక్స్ ఎక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఒక ఎక్స్ వస్తుంది. బిడ్డకి తండ్రి దగ్గర నుంచి ఎక్స్ వై కాబట్టి అందులో నుంచి అయితే ఎక్స్ వస్తుంది లేదా వై వస్తుంది.
ఎక్స్ వస్తే అది ఆడపిల్ల, వై వస్తే అది మగపిల్లాడు అని అర్థం” అంది వైదేహి.
“అమ్మో! ఇంత ఉందా? అయ్యో రామా! మరి మా అత్తగారు, వాళ్ల అత్తగారు టైంలో ఆడపిల్లలు పుడితే మనల్ని అనేవారు. కానీ అసలు తప్పంతా వాళ్ల దగ్గర ఉంది” అన్నారు ఊర్మిళ గారు.
“అవునత్తయ్య” అంది వైదేహి నవ్వుతూ.
“మరి ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు?” అడిగారు ఊర్మిళ గారు ఆత్రుతగా.