అలా ఒకరి కౌగిట్లో ఒకరు పడుకొని నిద్రపోయిన ఆర్య , రూప సాయంత్రం వరకు లేవలేదు.
దేవి గారు వెళ్లి వాళ్ళ బెడ్ రూం డోర్ కొట్టేసరికి ఆ సౌండ్ కి నిద్ర లేచిన రూప తను ఆర్య మిద ఉండడం చూసి టక్కున అతని మిద నుంచి బెడ్ మీదకు దొర్లాలి అని చూసింది కానీ ఆర్య అసలు వదిలితే కదా పాప నీ.
ఉడుం పట్టు పట్టినట్టు పట్టుకున్నాడు… ” ఏం తింటావ్ రా బాబు మరి ఇలా ఊపిరి కూడా ఆడకుండా ఇంత గట్టిగా పట్టుకున్నవ్ ” అని మనసులో ఆర్య నీ తిట్టుకుంటూ గించుకుంట ఉంది రూప.
” నా నుంచి తప్పించుకోవాలి అని ట్రై చెయ్యకు అని చెప్పనా..? చెప్పిన మాట వినలేదు అంటే నాలో ఉన్న శాడిస్ట్ బయటికి వస్తాడు ….వాడిని నువ్వు బేర్ చెయ్యలేవు ..! సో డూ ఫాలో మై వార్డ్స్ బేబీ కార్న్ ” అని రూప ముంగురులు చెవి వెనుక పెట్టీ …