శాడిస్ట్ లవ్ 💕 – 4
లైఫ్ లో ఫస్ట్ టైం రూప కి ఆర్య నీ చూసి భయం మొదలు అయ్యింది…
రూప ఇప్పుడు చదువుతుంది కూడా హర్ష వర్ధన్ కాలేజ్ లోనే…
హర్ష వర్ధన్ అనే పేరు ఆర్య గారి తాత గారి పేరు..ఆయన ఆర్య వాళ్ళ అమ్మ గారి కడుపులో వుండగానే చనిపోయారు…
ఆయన గుర్తుగా ఆర్య వాళ్ళ నాన్నమ్మ గారు ఆర్య కి ఆర్య హర్ష వర్ధన్ రాయ్ అని పేరు పెట్టారు.
రూప ఆర్య వాళ్ళ కాలేజ్ లోనే చదువుకుంది కాబట్టి తనకి ఆర్య గురించి కొంత వరకు తెలుసు…
అతను ఏదైనా కావాలి అని అనుకుంటే ఏం చేసి అయిన సరే దాన్ని దక్కించుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ … ఇంకా ముక్కోపి అని …
అతని మాటకి కానీ అతని దారికి కానీ ఎవరు అయిన అడ్డు చెప్పిన , అడ్డు రావాలి అని చూసిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేసే రాక్షసుడు అని…ఇలా చాలా విన్నది ఆర్య గురించి.
బట్ ఎప్పుడు ఆర్య నీ డైరెక్ట్ గా చూసింది లేదు…అందుకే ఆర్య పెళ్లిని ఆపింది.
పెళ్లి కూతురు రాజీ రూప కి బెస్ట్ ఫ్రెండ్….ఇద్దరు ఇంటర్ నుంచి క్లాస్ మెట్స్ … అప్పటికి అప్పుడు రాజీ పిన్ని తన పెళ్లి ఆర్య తో డిసైడ్ చేసింది అని తెలిసి ఆవిడని చాలా రిక్వెస్ట్ చేసింది కానీ ఆవిడ వినిపించుకోలేదు.
అందుకే తనకి ఉన్న చివరి ఆప్షన్ రూప అని తనకు కాల్ చేసి విషయం చెప్పి … ఎలా అయిన పెళ్లి ఆపమని రిక్వెస్ట్ చేసింది రాజీ.
దాంతో రూప ముందు వెనుక ఆలోచించకుండా తన ఫ్రెండ్ నీ ఆ పెళ్లి నుంచి సేవ్ చెయ్యాలి అని పెళ్లి కొడుకు ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళ్లి పెళ్లి ఆపేసింది.
కానీ అప్పుడు తనకి తెలియదు కదా తను తన ఫ్రెండ్ లైఫ్ సేవ్ చెయ్యబోయే తనే ఆ పెళ్లి అనే నరకంలోకి వెళ్లి … ఆర్య చేతిలో బలి అవ్వబోతుంది అని.
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అన్నీ ఒక్క రీల్ వేసుకొని బాధతో ఏడుస్తూ అలాగే బాత్ టబ్ లో జార బడి పోయింది రూప.
సరిగ్గా అప్పుడే వాష్ రూం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన ఆర్య … బాత్ టబ్ నీళ్ళల్లో ఊపిరి బిగబట్టి ఉన్న రూప నీ విసురుగా పైకి లేపి …
భుజాన వేసుకొని బయట బెడ్ రూం లోకి తీసుకొని వెళ్లి … అక్కడ విసురుగా బెడ్ మీదకి తొసి … అమాంతం రూప మిద పడిపోయి …
రూప బుగ్గలు రెండు ఒక్క చేతితో నొక్కి పట్టుకుని… కోపంగా ఎర్రటి జీరలు కనిపిస్తున్న కళ్ళతో రూప నీ చూస్తూ ….
” ఎంటి బేబీ ..! నా నుంచి తప్పించుకోడానికి చావలి అని అనుకుంటున్నావా…? అంటూ ఇంకా ఇంకా రూప బుగ్గల మిద అతని పట్టు పెంచుతూ …
నీకు ముందే చెప్పాను కదా…? ఇక నుంచి నీ లైఫ్ లో నా పర్మిషన్ లేకుండా ఏది జరగదు అని … ఆఖరికి నువ్వు పీల్చే గాలి కూడా నా పర్మిషన్ తోనే పీల్చుకోవాలి..
అలాంటిది నిన్ను అంతా ఈజీ గా ఎలా చావనిస్తాను అనుకున్నావ్…? నీతో నాకు చాలా పని ఉంది బేబీ….! నీ వల్ల నేను చాలా నష్టపోయాను మరి ఆ నష్టాన్ని నువ్వే భర్తీ చెయ్యాలి కదా..? అంటూ సూటిగా రూప కళ్ళల్లోకే చూస్తూ ….
ఈ రోజు నుంచి నీ లైఫ్ లో ఒక్కొక్క సెకండ్ ఒక్కో టైప్ నరకంలా ఉంటుంది…నాతో ఎందుకు పెట్టుకున్నాను అని నువ్వు ఫీల్ అయ్యేలా చెయ్యకపోతే నేను ఆర్య హర్ష వర్ధన్ రాయ్ నీ కాదు”
అని చెప్పి …
రూప బుగ్గలు వదిలి పైకి లేచి ….తడి బట్టల్లో ఉన్న రూప నీ అసహనంగా చూస్తూ … ” త్వరగా డ్రెస్ చేంజ్ చేస్కొని రెడీ అయ్యి రా…నిన్ను ఇంటికి తీసుకొని రమ్మని గ్రాని చెప్పింది…నికు కరెక్ట్ గా ట్వంటీ మినిట్స్ టైం ఇస్తున్న..
ఈ లోపు ఇదిగో ఈ శారీ లో ట్రెడిషనల్ గా కొత్త పెళ్లి కూతురిలా రెడీ అయ్యి రావాలి లేదు అంటే నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ ఉంటాను.. ” అని చెప్పి బయటకి వెళ్ళిపోయాడు ఆర్య.
ఆర్య నాన్న , అమ్మ ఇద్దరు బిజినెస్ పర్సన్స్…ఆర్య నాన్న గారు వాసు దేవ్ రాయ్ గారు వాళ్ళ కంపెనీ బిజినెస్ అవి చూసుకుంటూ ఉంటే …. వాళ్ళ అమ్మ దేవి గారు వాళ్ళకి ఉన్న హాస్పిటల్స్ , కాలేజ్ , చారిటీస్ వ్యవహారాలు అవి చూసుకుంటూ ఉంటారు.
ఆర్య వాళ్ళ అమ్మ , నాన్న బిజినెస్ పనుల్లో బిజీ గా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నమ్మ జానకమ్మ గారి దగ్గర పెరిగాడు.
ఆర్య ప్రపంచంలో ఎవరు మాట అయిన వింటాడు అంటే అది జానకమ్మ గారి ఒక్కరి మాట మాత్రమే…వాళ్ళ అమ్మ నాన్న మాట కూడా వినడు కొన్ని కొన్ని విషయాల్లో.
సడెన్గా నైట్ కి నైట్ రాజీ తో పెళ్ళి కి ఏర్పాట్లు చెయ్యమని చెప్పే సరికి వాసు గారు నైట్ కి నైట్ పెళ్లికి ఏర్పాట్లు చేశారు కానీ పెళ్ళిలో రూప చేసిన గొడవ వల్ల అంతా తారుమారు అయ్యింది.
రాజీ నీ పెళ్లి చేసుకోవాల్సిన ఆర్య కోపంతో రూప నీ పెళ్లి చేసుకొని వాళ్ళ ఫాం హౌస్ కి తీసుకొని వెళ్లడంతో … కొత్త కోడలిని ఇంటికి తీసుకొని రమ్మని దేవి గారు ఎన్నిసార్లు కాల్ చేసి ఆర్య లిఫ్ట్ చెయ్యలేదు.
ఇంకా జానకమ్మ గారితో కాల్ చేయించి రూప నీ ఇంటికి తీసుకొని రమ్మని చెప్పించారు.
జానకమ్మ గారు చెప్తే ఆర్య కాదు అనలేదు కాబట్టి రూప నీ ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఒప్పుకుంటాడు…
జానకమ్మ గారికి అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే నచ్చుతారు అందుకే ఆవిడకు నచ్చేలా రూప నీ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి రమ్మని చెప్పాడు.
రూప ట్రెడిషనల్ గానే ఉంటుంది కానీ ఇప్పుడు పెళ్లి అయ్యింది కాబట్టి కొత్త పెళ్లి కూతురు లాగ తీసుకొని రమ్మని మరి మరి చెప్పారు జానకమ్మ గారు అందుకే ఆవిడకి నచ్చేలా రూప నీ రెడీ అవ్వమని చెప్పాడు.
ఆర్య వాళ్ళ ఇంట్లో రూప ముందు ముందు ఎలా ఉండబోతుందో చూద్దాం…
అసలు ఆర్య రాజీ నీ ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు…? దానికి ఏం అయిన కారణం ఉంది అంటారా..?
@@@@
మీ కామెంట్స్ అండ్ ఎంకరేజ్ నీ బట్టి రోజుకి ఒకటి లేదా రెండు అప్డేట్స్ ఇస్తాను.
ప్లీస్ ఈ స్టోరీ నీ కూడా కొంచం మిగిలిన స్టోరీస్ లాగ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చెయ్యండి..
@@@@@@
ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ….
స్టోరీ చదివి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ 💖💖💖
కామెంట్స్ ముఖ్యం బిగిలు 🔥🔥
To be continued….
Swipe left/right or tap the sides to turn pages