జ్వాల, హర్ష ఇద్దరూ ప్రతాప్ వర్మ ఇంటి దగ్గరికి అడుగుపెడతారు.
ఆ ఇంటిని చూడగానే జ్వాల ఒక్క క్షణం ఆగిపోతుంది. ఎంతో విశాలంగా, రాజభవనంలా కనిపిస్తున్న ఆ ఇంటిని చూస్తూ లోపల ఏదో తెలియని అలజడికి గురవుతుంది.
తనకు తెలియని ఏదో బంధం తనను ఆ ఇంటి వైపు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది.
జ్వాల ముందుకు వెళ్లి తలుపు తడుతుంది.
వెనకాలే హర్ష కూడా వస్తాడు.
కాసేపటికి తలుపు తెరుచుకుంటుంది.