“కావ్య ఎంత బాగుంది పేరు..” అని అంది చెమ్మగిల్లిన కళ్ళతో సురేష్ ని చూస్తూ రోజా..
సురేష్ మాటలని బట్టి తనకి ఒకటి అర్థమైంది.. నన్ను అమ్మ నాన్న ప్రేమతోటే కన్నరు,ఒకవేళ బ్రతికి ఉంటే నన్ను ఎంత బాగా చూసుకునే వాళ్ళో అని.
“పేరు మాత్రమే కాదు మీ అమ్మ కూడా చాలా బాగుండేది.. సగం వరకు నీకు మీ అమ్మ పోలికలే వచ్చాయి,మిగిలిన సగం మీ నాన్నవి.
నీ లాగానే తనకి కూడా నాట్యం అంటే చాలా ఇష్టం.. అది గ్రహించిన మా నాన్న అదే మీ తాతయ్య తనని చిన్నప్పటినుంచి నాట్యం వైపు ప్రోత్సహించారు.” అని అన్నాడు చెల్లిని గుర్తు తెచ్చుకుంటూ సురేష్.
“మా నాన్న పేరు ఏంటి మావయ్య.” అని అడిగింది రోజా ఆశగా.