మధ్యాహ్నం రోజా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి తన కోసమే ఎదురు చూస్తూ సురేష్ ఉన్నాడు.
సంతోషంగా సురేష్ దగ్గరకి వెళ్లి..”నేను చాలా బాగా ఎగ్జామ్ రాసాను మామయ్య.” అని అంది రోజా తన ఆనందానికి అవధులు లేవు అన్నట్టుగా సంబరపడిపోతూ.
“నాకు తెలుసు అమ్మ నువ్వు ఎగ్జామ్ రాయడం మొదలు పెడితే చాలు ఆ ఎగ్జామ్ పేపర్ దిద్దే వాళ్ళకి పండగ.” అని అన్నాడు కోడల్ని బండి మీద ఎక్కించుకొని అంబారీ ఎక్కినట్టుగా సంబరపడిపోతూ సురేష్.
“ఇక పిజీ ఒక్కటి చేసేస్తే నీ కోరిక నెరవేరినట్టే మావయ్య.” అని అంది రోజా.