New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 12
స్వయంసిద్ధ Premium 7 min read

స్వయంసిద్ధ – 12

స్వయంసిద్ధ – 12వ భాగం

ప్రజావాణి డిజిటల్ కార్యాలయం లో తన డెస్క్‌ పై సౌమ్యకు సంబంధించిన పాత వార్తల ప్రింట్‌ అవుట్‌ లను వరుసగా పెట్టింది జాహ్నవి.

ప్రతి వార్త పక్కన ప్రచురించిన తేదీని, అందులో పేర్కొన్న సమాచారాన్ని రాసుకుంది.

ఆమెకు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసు! సౌమ్య మరణం గురించి ఏదో ఒక కథను తయారు చేయడం తన పని కాదు. ఆమె జీవితంలో నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవడం తన బాధ్యత.

ఆమె మొదట సౌమ్య అదృశ్యమైనట్లు ప్రచురించిన వార్తను తీసుకుంది. అందులో ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలని, చివరిసారిగా కనిపించిన తేదీని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సంప్రదించాలని సూచించే ఒక ఫోన్ నంబర్ కూడా ఉంది. కానీ ఆమె ఎక్కడికి వెళ్లింది, ఎవరితో చివరి సారిగా మాట్లాడింది, ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాలు లేవు.

రెండో వార్తలో సౌమ్య మృతదేహం లభించినట్లు ప్రస్తావన ఉంది. అయితే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు అందులో లేవు. మూడో వార్తలో మాత్రం ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందనే విషయం ప్రధానంగా కనిపించింది.

జాహ్నవి ఆ మూడు వార్తలను పక్కపక్కన పెట్టి చూసింది.

ఒకే యువతి గురించి వచ్చిన వార్తల్లో, ఆమె జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు పక్కన పెట్టి, నిర్ధారణ కాని ఆరోపణ మాత్రం ప్రధానంగా మార్చారు.

అప్పుడే ఆమె కూర్చున్న డెస్క్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు అరవింద్!

“జాహ్నవి! ఎనీ అప్డేట్?” అంటూ అడిగిన అరవింద్ ని చూసింది జాహ్నవి!

“సర్! సౌమ్యకు సంబంధించిన ఓల్డ్ ఆర్టికల్స్ ని కంపేర్ చేసి చూసాను! ఒక న్యూస్ లో కనిపించకుండా పోయంది! రెండవ దాంట్లో ఆమె చనిపోయింది! మూడవ దాంట్లో ప్రేమ వ్యవహారాన్ని రాసారు!”

“సరే! ముందుగా ఆమె కుటుంబాన్ని సంప్రదించు. వాళ్లకు మాట్లాడటానికి ఇష్టం ఉంటేనే కలువు. నీ దగ్గర ఉన్న వార్తలను చూపించి, వాటిలోని వివరాలను నిర్ధారించమని అడుగు. వాళ్లు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఇతర ఆధారాలతో పోల్చి చూడు.”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue