New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 20
స్వయంసిద్ధ Premium 7 min read

స్వయంసిద్ధ – 20

స్వయంసిద్ధ – 20వ భాగం

 

మధ్యాన్నం మూడు గంటల సమయంలో సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ ని కలవడానికి వాళ్ళ ఇంటికి చేరుకుంది జాహ్నవి.

ఆమెను చూసిన వెంటనే సౌమ్య తల్లి బయటకు వచ్చింది.

“రా అమ్మా.”

“నమస్కారం ఆంటీ.”

“రా! లోపల కూర్చో.”

జాహ్నవి కూర్చున్న తరువాత సౌమ్య తండ్రి కూడా వచ్చి ఎదురుగా కూర్చున్నాడు.

“ఏమమ్మా! కేసు గురించి ఏమైనా తెలిసిందా?” అని అడిగాడు.

“కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను అంకుల్. కానీ ఇంకా కొన్ని నిజాలు తెలియాలి!”

“మా అమ్మాయికి ఏం జరిగిందో తెలిస్తే చాలు తల్లీ. ఇన్నాళ్లుగా ఆ ఒక్క ప్రశ్నతోనే బతుకుతున్నాం.” ఆయన గొంతులోని బాధ జాహ్నవికి స్పష్టంగా వినిపించింది.

“అంకుల్, సౌమ్య ఉపయోగించిన ఫోన్ మీ దగ్గర ఉందా?”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue