స్వయంసిద్ధ – 23వ భాగం
ప్రజావాణి ఆఫీస్ లో సందడి ఎక్కువగా ఉంది! ఆ ఆఫీస్ మొదలుపెట్టి ఇరవై అయిదు సంవత్సరాలు పూర్తి కావడానికి ఇంకా వారం రోజులే ఉంది!
ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యాలని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు కొందరు!
జాహ్నవి మాత్రం తన క్యాబిన్ లో కూర్చొని ఆలోచిస్తుంది! ఆమె మదిలో తిరిగే ఒకే ఒక్క పేరు రాకేశ్!
ఆ పేరు జాహ్నవి మనసులో తిరుగుతూనే ఉంది. సౌమ్యతో సంబంధం ఉన్న వ్యక్తుల జాబితాలో ఇప్పటివరకు ఆ పేరు ఎక్కడా వినిపించలేదు.
కానీ ఇప్పుడు ఒక తెలియని మెయిల్ ద్వారా అతని ఫొటో తన ముందుకొచ్చింది.
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సౌమ్య మరణించిన రోజు నుంచి అతను కనిపించడం లేదని ఆ మెయిల్ లో ఉంది!
అది నిజమా? అతను నిజంగానే అదృశ్యమయ్యాడా? లేక ఎవరో కావాలనే అతని గురించి తప్పుడు సమాచారం పంపిస్తున్నారా?
తనకు వచ్చిన ఆ మెసేజ్ గురించి ఎవరికీ చెప్పలేదు జాహ్నవి! తన ముందు ఉన్న కంప్యుటర్ లో కాలేజీ ఫెస్ట్ గురించి ఉన్న ఫోటోలు వెతుకుతూ ఉంది జాహ్నవి!
చివరకు ఒక కాలేజీ ఫెస్ట్ కి సంబంధించిన ఫొటో కనిపించింది. ఆ ఫోటో లో సౌమ్య తో పాటుగా రాకేష్ ఉన్నాడు! ఇద్దరూ స్నేహితుల్లా నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఆ ఫొటో కింద ఒక కామెంట్ కనిపించింది.
“మా గ్రూప్ లో అందరికి కావాల్సిన వ్యక్తి రాకేష్!” అంటూ రాహుల్ అనే వ్యక్తి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు!