స్వయంసిద్ధ – 24వ భాగం
“సౌమ్య చనిపోయిన రోజు నేను ఆమెను కలవలేదు. కానీ ఆమె చివరిగా ఎవరిని కలవాలనుకుందో నాకు తెలుసు.” అంటూ రాకేష్ చెప్పిన ఆ మాటలు జాహ్నవి మనసులో పదే పదే వినిపిస్తున్నాయి.
ఆ మాటలను గుర్తు చేసుకుంటూ వెంటనే అరవింద్ కి ఫోన్ చేసింది జాహ్నవి!
“హా జాహ్నవి!”
“సర్! రాకేష్ తో ఇందాకే మాట్లాడాను. సౌమ్య చివరిగా ఎవరిని కలవబోతోందో తనకు తెలుసని చెప్పాడు. కానీ పూర్తి విషయం చెప్పకుండానే కాల్ కట్ అయింది. తిరిగి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది!”
“ఒకవేళ కలవాల్సి వస్తే నువ్వు ఒంటరిగా అతన్ని కలవకు. అతనికి నిజంగా ఏదైనా ఆధారం ఉంటే పోలీసుల సమక్షంలోనే మాట్లాడదాం.”
“అలాగే సర్.” అంటూ ఆలోచనలలో పడిపోయింది!
మరుసటి రోజు తన ఆఫీస్ లో ఉన్న జాహ్నవి దగ్గరకు వచ్చాడు అరవింద్!
“జాహ్నవి!”
“చెప్పండి సర్!”
“రాకేష్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడట! మేఘనా రెడ్డి మేడం మనల్ని రమ్మని చెప్పారు!” అంటూ అరవింద్ చెప్పగానే హుషారుగా లేచింది జాహ్నవి!