నా నోట్లో పెట్టుకోబోతున్న వేళ్ళు సడన్ గా ఆగిపోయింది చూస్తే వాడు నా చెయ్యి పట్టుకున్నాడు. ఏంటా అని తలెత్తి చూస్తే రెండు కళ్ళు చిన్నవి చేసి అదోలా చూస్తున్నాడు నన్ను..
ఏంటి రా బాబు ఆ చూపు, ఎక్స్ప్రెషన్ అర్థమయ్యే చావడం లేదు. అనుకుంటూ అయోమయంగా చూస్తూ..
నా చెయ్యి వదులు. అంటూ నెమ్మదిగా చేతిని వెనక్కి లాగుతున్నాను
ఉహూ వదల్లేదు. టిష్యూ తో నా చెయ్యి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి, ఇంకో టిష్యూ మిగిలిన ఆ లెగ్ పీసె కి నీట్ గా చుట్టి నా చేతిలో పెట్టాడు..
కావలసినన్ని తిను కావాలంటే ఇంకా తెప్పిస్తా. చిరాగ్గా ఫింగర్స్ లిక్ చేయకు. నా ఫీలింగ్ మారిపోతుంది, ఆ తరువాత ఏం చేస్తానో నాకే తెలీదు… అంటూ అదోరకంగా చెప్పి మళ్ళీ తన గడ్డి తింటున్నాడు.