ఇంద్రజిత్-7
“లోపలికి వెళ్ళండి మేడం, ఈసారి సార్ వచ్చారంటే ఏం చేస్తారో ఏంటో” అనే నరేష్ అంటుంటే,
“నువ్వు ఆపవయ్య బాబు వాడు చేసేది ఏమో కానీ నీ మాటలకే నేను చచ్చేటట్టు ఉన్నాను” అని లోపలికి తొంగి చూస్తూ “స్టోర్ రూమ్ అంటున్నావ్ లోపల ఎలుకలు పాములు లాంటివి ఉండవు కదా” అని కళ్ళు చిన్నవి చేసి వింత ఎక్స్ప్రెషన్ పెట్టి అడిగింది కీర్తి.
నరేష్ అసహనంగా తల కొట్టుకుంటూ “మేడమ్ అది జస్ట్ స్టోర్ రూమే, అంతకుమించి అందులో పాములు ఎలకలు లాంటిది మేము పెంచము. స్టోర్ రూమ్ అయినా క్లీన్ గానే ఉంటుంది, వెళ్ళండి మేడం త్వరగా” అని చిరాగ్గా అన్నాడు.
“ఎందుకయ్యా అంత చిరాకు. అయినా నీ తప్పేమీ లేదులే మీ బాస్ నిప్పులు కొలిమి మీద కూర్చున్నట్లుగా మాట్లాడుతున్నాడు, ఇక నువ్వెంత” అని గట్టిగా అరిచి మనసులో భయం భయంగా ఉన్నా ఇక్కడి నుంచి బయటపడే మార్గం దొరికేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా తప్పదు భరించాలి,
అందరికీ తెలియక ముందే నువ్వు కీర్తిశేషులు అయిపోతావ్ ఏమోనే అని అనుకుంటూనే చిన్నగా స్టోర్ రూమ్ లోపల అడుగు పెట్టింది కీర్తి.
ఆ మరుక్షణం నరేష్ ఆమెను లోపలికి తోసి డోర్ క్లోజ్ చేసేసాడు.