ఆ టైం లో కూడా శాన్వి లో హమ్మయ్య క్లాస్ ఓవర్ అన్న రిలాక్స్ ఫీల్ రాలేదు… క్లాస్ చెప్తున్నంత సేపు శ్రద్దగా వినిందో లేదో కానీ అశ్రద్దగా లేదు…
క్రిషవ్ వెళ్తూ వెళ్తూ కూడా మరోసారి వెనక్కి తిరిగి చూసాడు.. అందులో ముఖ్యంగా శాన్విక వైపు…
వెళ్ళడానికి డయాస్ దిగగానే మళ్ళీ నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టింది శాన్వి…
ఎందుకో శాన్వి రియాక్షన్ బాధగా అనిపించింది గిల్టీ ఫీల్ అయ్యాడు… తొందరపడి నోరు జారేసానే అనే బాధ చిరాకు కోపంగా మారి క్రిషవ్ మనసుని ఎక్కడా నిలవనివ్వట్లేదు…
స్టాఫ్ రూమ్ కి కాకుండా చైర్మన్ ఛాంబర్ కి వెళ్లి శాన్వి తన క్లాస్ అయిపోయాక అయినా ఫ్రీ అవుతుందా లేక తన మాటలే మైండ్ లో మెదిలి బాధ పడుతుందా అని అబ్సర్వ్ చేశాడు సీసీ క్యామ్స్ ని