New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 45

ఏమ్ మాయ చేసావే..!! – 45

ఆడపిల్లల పై చెయ్యి చేసుకోకూడదు అనే తల్లి మాట గుర్తుకు వచ్చి గాలిలోనే ఆ చేతిని ఆపేసి  కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ భస్మం చేసేలా చూస్తూ… ప్రతి మగాడు ఆడదానికి అందానికి.. ఆమె మాట్లాడే మాటలకి చొంగ కారుస్తూ రోడ్డు మీద మీద తిరిగే కుక్కలు అనుకుంటున్నావా??? నువ్వు బెట్ కట్టి పడేయడానికి?? అని టేబుల్ పై గట్టిగా కొట్టేసాడు…

 

 

అది గ్లాస్ టేబుల్ అవ్వడంతో భల్లుణ శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలు అయ్యి పడి పోతుంటే.. ఇలా ఎంత మందితో బెట్ కట్టావ్.. ఎంత మందినని పడేసావ్ ఆ పడేసే పడేసే ప్రాసెస్ లో ఎంత మందికి దగ్గరయ్యావ్? అని ఆవేశంలో నోరు జారేసాడు అడిగాడు…

 

 

ఆ ఒక్క మాట చెంప దెబ్బ కంటే గట్టిగా తగిలింది శాన్వికకి…

 

 

ఎంత మందికి దగ్గరయ్యానా? అంటే నీ ఉద్దేశ్యం అని ఒక్కొక్కడుగు వెనక్కి వేస్తూ ఏడుస్తూ వెళ్లిపోయింది…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue