అది కాదురా క్రిష్! అది ఎలా తింటుంది చూశావా??? నలుగురు తినే కేక్ ని ఒక్కతే తినేస్తుంది అన్నాడు మరోసారి మయూక్…
ఆ మాటకి మనసు నొచ్చుకున్న కృతిక కేక్ ని పక్కన పెట్టి హ్యాండ్ వాష్ కి వెళ్లి వచ్చి బాయ్ శాన్వి అని తన బ్యాగ్ తెచ్చుకుని వెళ్దామా అని అడిగింది క్రిషవ్.. మయూక్ ల ముందుకు వెళ్లి…
ముందే బిల్ పే చేశావా? అని అడిగాడు మయూక్…
ఊహు అని అడ్డంగా తల ఊపిన కృతికని చూసి చెల్లి హర్ట్ అయిందని అర్థం చేసుకున్న క్రిషవ్ మయూ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది బేబీ ని నువ్వు తీసుకు వెళ్ళు అన్నాడు..