శృతి కన్నీళ్ళకి బాధగా మనసంతా మెలిపెట్టినట్టుగా అనిపించింది పదా! నేను మాట్లాడతాను అన్నాడు…
వద్దు! సర్!! మీరు ఈ రోజు ఏదైనా అనేసి వెళ్ళిపోతే ఆ తర్వాత నన్ను అతడు ఫిసికల్ గా ఇబ్బంది పెడతాడు అని భయపడింది…
మీ అక్కకి ఉన్న ధైర్యంలో నీకు వన్ పర్సన్ట్ కూడా లేదు అన్నాడు..
మా ఇంటి పరిస్థితులకి నాకు రోజు రోజుకి భయం పెరిగిపోతుంది సర్.. కాని ఈ విషయాన్నీ ఎవరికీ చెప్పుకోలేను అని గుక్క పెట్టి ఏడ్చింది…