నాన్న… ఏంటి మీరు…. ఇంత పెద్ద ఫ్యామిలిలో తను ఎందుకు హ్యాపీ గా ఉండదు… మిరే ఆలా అడగడం బాగోలేదు…. ఆలా అడగకూడదు…. తెలుసా అని పెద్దదానిలా నీతులు చెప్తుంది మీనా వాళ్ళ నాన్న కి.
మీన మాట్లాడిన దానికి అందరికి నవ్వు వచ్చింది…. లాస్ట్ కి సీత కి కూడా… ఒక బ్రైట్ స్మైల్ వచ్చింది సీత కి.
ఆ నవ్వు చూడగానే… రామ్ కి ఆటోమాటిక్ గా నవ్వు వచ్చేసింది…. ఆ నవ్వు చూడగానే …. ఆటోమాటిక్ గా సీత కి పడిపోయాడు బాబు.
అది ఈ రోజు తెలిసింది రామ్ కి… తనకి తానే అనిపిస్తుంది… సీత కి పడిపోయా అని.
ఏంటి సీత మీ నాన్న… మీ చెల్లి అంత దూరం నుంచి వస్తే….ఇలా నిలబెట్టించి మాట్లాడతావా…. అని మహాలక్ష్మి గారు అనగానే…. సీత నవ్వుతు… వాళ్ళ నాన్న ని సోఫా లో కూర్చోబెట్టి…. మీనా దగ్గరకు వచ్చి… మీనా ని గట్టిగ హత్తుకొని… ఎలా ఉన్నావు మీనా అని ఎంతో ఆప్యాంగా అడుగుతుంది సీత.