కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 1
వజ్రాల వేటలో బలి అయిన జీవితం…
మోసం వలన విరిగిపోయిన మనసు….
ఆ మనసు కోసం తపిస్తున్న శ్రీ వాత్సావ్….
సీబీఐ ఆఫీసర్ గా గెలిచిన కారుణ్య ఒక భర్త గా గెలుస్తాడా….
మరి వాళ్ళిద్దరిని కృష్ణమ్మ కలుపుతుందా……
ఒక పాతికేళ్లు అమ్మాయి తన ఫ్రెండ్ అయిన వర్ష నీ ఓదారుస్తూ ఉంటుంది…..
ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బాధ అలుముకొని ఉంది….
వర్ష అమ్మగారు అయిన జయలక్ష్మి గారు చనిపోయిన తన భర్త కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు….
వర్ష ఊరుకోవే…..నా మాట విను….ఏడవకు అని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది… పల్లవి….
వర్ష ,పల్లవి ఇద్దరు ప్రాణ స్నేహితులు…..
పక్క పక్క ఇళ్లల్లో ఉంటారు….వర్ష వాళ్లు ధనవంతుల కుటుంబం…..పల్లవి ది మధ్యతరగతి కుటుంబం….
కానీ వారి స్నేహానికి స్థాయి అడ్డుగా రాలేదు….. ఎప్పుడు వల్ల బంధం బలహీన పడలేదు….
ఆరోజు వాకింగ్ కి అని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి ప్రాణాలతో రాలేదు వర్ష తండ్రి గౌరీ నాథ్……
అతనికి వర్ష అంటే చాలా ఇష్టం….తన కోసమే తప్పుడు వ్యాపారాలు కూడా ఎంచుకున్నారు అతను….
అప్పుడే అక్కడికి గౌరీ నాథ్ పార్టనర్స్ అయిన రవీంద్ర….గంగాధర్ అక్కడికి వస్తారు….
చనిపోయిన గౌరీ నాథ్ బాడీ పై పూల దండ వేసి దండ వేసే వంక తో గౌరీ నాథ్ మెడ లో తడుముతారు….కానీ వాళ్ళకి ఏమి కనిపించదు….దణ్ణం పెట్టుకుని వెన్నక్కి వస్తారు…..
ఎవరు చూడకుండా అమ్మ వర్ష ఒక్కసారి నాతో వస్తావా….
ఏంటి అంకుల్…..అని భారంగా అడుగుతుంది…..
ఒక్కసారి ఇలా రా తల్లి….
సరే అంకుల్ అని వెళ్తుంది….
కానీ వాళ్ళకి తెలియని విషయం వాళ్ల వెనకాలే పల్లవి కూడా వెళ్తుంది….
ఏమయ్యింది అంకుల్….
ఏమి లేదు వర్ష….మీ నాన్న మెడలో ఒక చైన్ ఉంటుంది చూసావా….
చూసాను అంకుల్ నిన్ననే వేసుకున్నారు….
ఏమిటి డాడీ క్లాత్ లా ఉంది అంటే కొత్త ఫ్యాషన్ అని నవ్వుకున్నారు….అని బాధ గా చెప్తుంది…..
మరి ఆ చైన్ లేదెంటి….
ఏమో అంకుల్ నాకు తెలియదు…..
వాళ్ళకు కోపం పెరిగిపోతుంది…. రవీంద్ర కోపంగా వర్ష జట్టు పట్టుకుని….
ఏంటే తెలియదు అంటే ఊరుకుంటామా….
అవి 100 కోట్లు విలువ చేసే వజ్రాలు…..తెలుసా నీకు….అని కోపంగా అంటాడు….
వర్ష ఒక్కసారిగా భయపడుతుంది…..నొప్పి కి ఏడుస్తూ నిజంగా నాకు తెలియదు అంకుల్…. ప్లీస్ నన్ను వదిలేయండి…..
నిన్న వదిలేస్తే ఎలా చెప్పు….మా వజ్రాలు ఎలా వస్తాయి మాకు…..
నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఆ చైన్ మాకు కావాలి…..లేదు అంటే మీ అమ్మ ప్రాణాలతో ఉండదు….
నువ్వు కూడా మా చేతిలో చస్తావు….అని కిరాతకంగా అంటారు….
ప్లీజ్ అంకుల్ నిజంగా నాకు తెలియదు మా అమ్మ నీ నన్ను ఏమి చెయ్యకండి…..అని ఏడుస్తూ అడుగుతుంది….
మరి ఆ చైన్ ఏమైనట్టు…..అని వర్ష చెంప పై కొడతారు….
వర్ష కింద పడిపోతుంది….
చెప్తావా లేదా….అని కొట్టడానికి రావడం తో వర్ష భయపడిపోయి….ఆగండి అంకుల్ మా నాన్న పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళారు అక్కడ పడిపోయిందేమో….నిజంగా నాకు తెలియదు అంకుల్ ప్లీజ్ అని ప్రాధేయపడుతూ అడుగుతుంది….
వర్ష నీ ఒకసారి చూసి గంగాధర్ రవీంద్ర వైపు చూసి సైగ చేసి….అవునా అయితే తెచ్చి ఇవ్వు….లేకపోతే ఎవరినైనా తీసుకుని రమ్మను….
నేనా….నేను ఎలా బయటికి వెళ్లగలను….
బయట మా నాన్న శవం పెట్టుకుని అని ఏడుస్తూ….ఒక్కసారిగా ఆపేసి నా ఫ్రెండ్…. నా ఫ్రెండ్ నీ వెళ్ళమంటాను….
తనకి నిజం చెప్పావు అంటే నీతో పాటు అధి కూడా చస్తుంది….చూసుకో….
లేదు చెప్పను….అని తన కన్నీళ్లు తుడుచుకుని బయటినికి వస్తుంది….
అప్పటివరకు నోటికి చేతిని అడ్డు పెట్టుకుని కన్నీళ్ళతో అదంతా చూస్తున్న పల్లవి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది….
వర్ష తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మొహం మొత్తం తన చున్ని తో తుడుచుకుని పల్లవి కోసం వెళ్తుంది….
పల్లవి కిచెన్ లో వాటర్ తాగుతూ కనిపిస్తుంది….
వర్ష వెళ్ళి కిచెన్ తలుపు వేసి పల్లవి వైపు చూస్తుంది….
ఏమయ్యింది వర్ష …
పల్లవి నాకు ఒక సహాయం చేస్తావా…..అని కంగారు అడుగుతుంది….
ఏంటి వర్ష….
అది మా నాన్న మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళారు….ఆ పార్క్ దగ్గర మా నాన్న చైన్ పడిపోయింది…. అధి చాలా విలువైనది….
అది తీసుకురావా నేను ఎవరిని నమ్మలేను…ప్లీజ్ పల్లవి…
పల్లవి సరే నేను తీసుకువస్తాను…. నువ్వు కంగారుపడకు….
థాంక్స్ పల్లవి….
పల్లవి చిరుకోపంగా నాకు థాంక్స్ చెప్తావా….అని వర్ష నీ హాగ్ చేసుకుని…నీకు మంచి జరుగుతుంది అంటే నేను ఏమి చేయడానికైనా సిద్ధమే….
వర్ష తిరిగి గట్టిగా హాగ్ చేసుకుంటుంది…. ఇప్పుడు తన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనిది….
పల్లవి మాటలతో కొంచెం బాధ తీరింది అని చెప్పవచ్చు….
పల్లవి మనసులో నిన్ను ఈ రాక్షసుల నుండి కచ్చితంగా కాపాడుతాను వర్ష….నా ప్రాణం అడ్డు వేసి అయిన సరే… అని అనుకుని చైన్ కోసం వెళ్తుంది…..
మరి పల్లవి కి ఆ చైన్ కనిపిస్తుందా….. ?
చైన్ వారి జీవితం లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది…..?
తెలుసుకోవాలి అనుకుంటే నన్ను ఫాలో చెయ్యండి..
Swipe left/right or tap the sides to turn pages