కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 2
హలో మిస్టర్. *****కూర్చోండి….
అతను సెల్యూట్ చేసి తన పై అధికారి ముందు కూర్చుంటాడు….
మీ బ్యాక్గ్రౌండ్ చూసాను….మీ సక్సెస్ రేట్ 99 పర్సెంట్ ఉంది…అందుకే ఈ కేస్ మీకు ఇస్తున్నాము…
కచ్చితంగా నా 100 పర్సెంట్ నేను ఇస్తాను సార్….
మీపై నాకు నమ్మకం ఉంది….
ప్రభుత్వానికి సంబంధిన ప్రాపర్టీ ఎవరు దోచుకోలేరు…వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నవి ప్రభుత్వానికి అందచేస్తాను….
అని అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు….
💧💧💧💧💧💧💧💧💧💧💧💧
ఒరేయ్ ఆ పిల్లని వెతికి తీసుకురమ్మన్నావు….మనమే వెతికించేవాళ్ళం కదా….
రేయ్ రవి….అవి గవర్నమెంట్ కి సంభందించిన వజ్రాలు…అవి కానీ మనం వెతికాము అంటే మనమే తీసినట్టు తెలిసిపోతుంది….
అదే వీళ్ళు అనుకో డబ్బుకు విలువ ఎవ్వరు ప్రాణాలకు విలువ ఇస్తారు…. వాళ్ళ ప్రాణాలు కోసం అయిన వెతికి తీసుకొచ్చి ఇస్తారు….
మరి వర్ష ఫ్రెండ్ తీసుకుని ఇస్తుంది అని గ్యారెంటీ ఏంటి….
ఒరేయ్ నేను మరి పిచోడిని కాదు…ఆ పిల్ల వెనుక మన మనిషిని పంపించాను….అన్ని కనిపెట్టమని చెప్పాను….
అవునా మంచి పని చేశావు….సరే పద బయట వాళ్ళకి అనుమానం రాకుండా ఆ శవం పక్కన కూర్చుందాం…
అని బయటికి వెళ్ళిపోతారు….
💧💧💧💧💧💧💧💧💧💧
పల్లవి పార్క్ దగ్గర కు వెళ్తుంది….మొత్తం ఆ పార్క్ అంత జల్లెడ పడుతుంది….
తనని ఒక మనిషి ఫాలో అవుతున్నట్టు కనిపెడుతుంది….
కానీ ఏమి తెలియనట్టు వెతుకుతూనే ఉంటుంది….
💧💧💧💧💧💧💧💧💧💧💧💧
వర్ష బయటికి వచ్చిన వాళ్ళని చూసి భయపడుతుంది….
అప్పుడే వర్ష బావ అయిన విహాన్ అక్కడికి వచ్చి వర్ష నీ చూస్తాడు….
వర్ష కి ఎవరు స్లిబింగ్ లేరు…. విహాన్ అన్ని తనే చూసుకుంటున్నాడు….
గౌరీ నాథ్ గారిని తీసుకువెళ్ళడానికి టైమ్ అవుతుండటం తో వర్ష నీ చూసిన పట్టించుకోడు….
వర్ష వాళ్ళ అమ్మ ఇంకా బిగ్గరగా ఏడుస్తారు…..
వర్ష ఉలిక్కిపడి వాళ్ళు అమ్మ జయలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళి….
అమ్మ ప్లీజ్ ఏడవకు… అని తను కూడా ఏడుస్తుంది….
వర్ష మీ నాన్న నీ తీసుకువెళ్ళిపోతున్నారు వర్ష….నువ్వంటే ఆయనకి ప్రాణం కదా లేగమని చెప్పు….నాతో మాట్లాడమని చెప్పు వర్ష…
అమ్మ నాన్న ఇంకా తిరిగి రారు అమ్మ….ఇంక మనతో మాట్లాడరు…అని వర్ష ఏడుస్తూ అంటుంది ..
జయలక్ష్మి గారు బాధ ఎక్కువయ్యి స్పృహ తప్పి పడిపోతారు…
అమ్మ అని గట్టిగా అరుస్తుంది వర్ష….
విహాన్ పెరిగెట్టుకుంటూ వెళ్ళి….అత్త…అత్త….అని పిలుస్తూ ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తాడు….
వర్ష కూడ విహాన్ వెనకాలే వెళ్తుంది….
తనకి ఒక పక్క నాన్న చనిపోయారు అనే బాధ….అమ్మ కి ఏమవుతుంది అనే ఆందోళన…ఆ చైన్ దొరకకపోతే ఆ రాక్షసులు ఏం చేస్తారు అనే భయం…స్నేహితురాలు ఎక్కడ తన వల్ల ప్రమాదం లో పడింది అనే గిల్టీ ఫీలింగ్ తనని పట్టుకుని ఏడిపిస్తున్నాయి….
💧💧💧💧💧💧💧💧💧💧💧
గౌరీ నాథ్ నీ తీసుకువెళతారు…తండ్రి నీ చివరి చూపు చూసుకుని అతనితో ఉన్న జ్ఞాపకాలను మనసులో పదిలంగా భద్రపరుచుకుంటుంది వర్ష….
అందరూ బాధ తో అతని వెనకాలే వెళ్తే….తల్లి దగ్గర వర్ష ఉండిపోతుంది….
గంగాధర్,రవీంద్ర వెళ్లినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు….
వాళ్ళని చూసి భయంగా నా ఫ్రెండ్ వెళ్ళింది అంకుల్….ప్లీజ్ తను. వచ్చేస్తుంది….
అని అంటున్న వర్ష కి వర్ష అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తుంది…
అక్కడ తన చేతులపై రక్తం తో కనిపిస్తుంది పల్లవి….
పల్లవి ఏమయ్యింది….అని కంగారుగా పల్లవి దగ్గర కి వెళ్తుంది….
వర్ష నేను అక్కడకు వెళ్ళనా…అక్కడ నాకు మీ నాన్న చైన్ కనిపించింది….కానీ ఒక దొంగ దానిని తీసుకుని పారిపోయాడు….నేను అప్పటికి ఇవ్వలేదు వాడు నా చేతులు గాయం చేసి వెళ్ళిపోయాడు…
రవీంద్ర కోపంగా ముందుకు వస్తాడు….నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు కలిపి….
గంగాధర్ పల్లవిని ఫాలో చెయ్యమన్న వ్యక్తికి ఫోన్ చేస్తాడు….
ఆ వ్యక్తి విన్న గంగాధర్…రవీంద్ర దగ్గరకు వచ్చి ఆ పిల్ల చెప్పింది నిజమే వదిలేయ్….ఆ దొంగ నీ పట్టుకోవాలి…మనం…
చ…వీళ్ళని ఊరికే వదిలిపెట్టను…మనకి చాలా నష్టం వస్తుంది…. గంగా….
అవును ఆ నష్టాన్ని వాల్లే భర్తీ చేస్తారు …
అర్థం కానట్టు చూస్తారు…
గంగాధర్ నవ్వుతూ మన పార్టనర్ పోయాడు కదా రవి….
వాడి ప్రాపర్టీ మొత్తం మనం రాయించుకుందాం….
రవీంద్ర నవ్వుతూ చూస్తాడు…..
పల్లవి ఏంటండీ ఎలా చేస్తారు అలా …వాళ్ళకి బ్రతకడానికి లేకుండా….అని అంటుంది….
ఏయ్ పిల్ల నీరు అదుపులో పెట్టుకో అసలే నీది మధ్యతరగతి కుటుంబం…చిన్న మచ్చ వచ్చిన నీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది….
వర్ష భయపడి వద్దు అంకుల్ తనని ఏమి చెయ్యకండి నేను మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడే పెడతాను….
ఈ విషయం ఎక్కడైనా వాగారు అంటే మీ ప్రాణాలు మీ వెనకాల ఉన్న వాళ్ళ ప్రాణాలు మిగలవు….
మేము మళ్ళీ వస్తాము అప్పుడు పేపర్స్ తో వస్తాము సంతకం పెట్టడానికి రెడీ గా ఉండండి….అని చెప్పి వెళ్ళిపోతారు….
స్మశానానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తుండటం తో…
ఇంకా ఉంది…..
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…..
ఆ చైన్ ఏమయ్యింది……?
మిస్టరీ ఎలా వీడనుంది…..?
పల్లవి నిజమే చెప్తుందా…..?
తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అయిపోండి మన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ…
Swipe left/right or tap the sides to turn pages