YOU ARE MINE…(DEVIL LOVE 😈) – 5
కోర్టులో…
”మై లార్డ్! మై క్లయింట్ వాళ్ల హస్బెండ్ అయిన వ్యక్తి.. పెళ్లైనప్పటి నుంచి ఆమెను ఫిజికల్ గానూ, మెంటల్ గానూ టార్చర్ చేస్తున్నారు. అయినా తను భరిస్తూ వచ్చింది. కానీ అతను సదరు తేదీన ఇంకో పెళ్లి చేసుకుని వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోస్ & వీడియోస్ మీకు సబ్‌మిట్ చేశాను. వాటిని పరిగణనలోకి తీసుకుని విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్!”
జడ్జి గారు: “సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట.. వాళ్లకు విడాకులు మంజూరు చేయడం జరిగింది. అలాగే భర్త తన ఆస్తిలో సగం భాగం భార్యకు అలిమొనీ (జీవనభృతి)గా ఇవ్వాలి. మరియు భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్నందుకు ఐపీసీ సెక్షన్ కింద 2 సంవత్సరాల జైలు శిక్ష మంజూరు చేయడం జరిగింది.”
కొంత సమయం తర్వాత…
”విజయ్ సార్! థాంక్స్ సార్.. మీరే లేకపోయుంటే ఈ కేస్ గెలిచేదాననే కాదు సార్! అంతా మీ వల్లే.. ఒన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ సార్!”
”హేయ్.. ఓకే! నువ్వు నా చెల్లెలి లాంటిదానివి, ఇలా చెప్పకు. ఇప్పటినుంచైనా హ్యాపీ లైఫ్ లీడ్ చేయి.. బై!” అని బయటకి నడిచాడు విజయ్.
”హాయ్ లాయర్ సాబ్! ఈసారి కూడా మీరే కేస్ గెలిచినట్లున్నారు?”
”హేయ్.. ఎవరా? పోలీస్ మేడమ్ గారా?”
”రేయ్! నిన్ను…” అని విజయ్ పీక పట్టుకుంది ఆ అమ్మాయి.
”నవ్వుతూ.. స్టాప్ రిధ్వీ! ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్” అని విడిపించుకుని..
“నువ్వేంటే ఇక్కడ?” అని అడిగాడు.
”ఏం లాయర్‌కేనా కోర్టులో పని ఉండేది, పోలీసులకి ఉండదా సార్?”
”ఉండదని నేను అనలేదు తల్లి! నీకు ఈరోజు ఇక్కడ ఏం పని అని అడుగుతున్నా?”
”నథింగ్ రా! నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఇక్కడికి వచ్చేసా.”
”ఒసేయ్! నీకు డ్యూటీ లేదా ఏంటి?”
”ఉంది రా! కాకపోతే ఈరోజు లీవ్ తీసుకోవాలనిపించింది.. తీసుకుని వచ్చేసా!”
”చాలా మంచి పని చేశావులే! ఇప్పుడు ఏంటి ప్లాన్స్?”
”నథింగ్ రా! నువ్వు వండే ‘చికెన్ కర్రీ విత్ జీరా రైస్’ మిస్ అవుతున్నా. సో ఫ్లాట్‌కి వెళ్లి కుక్ చేసి పెడితే తృప్తిగా తింటాను.. ఏమంటావ్?”
”హ్మ్మ్… సరే పద, నాకు వర్క్ ఏం లేదు” అని ఇద్దరూ ఫ్లాట్‌కి బయలుదేరారు.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
”బావా!” అని హర్షిత్‌ని హగ్ చేసుకుని.. “యూ నో వన్ థింగ్? మేము చేసిన ఈవెంట్ రణ్‌వీర్ సార్‌కి బాగా నచ్చిందంట! సో….. గెస్ వాట్?” అని అడిగింది హైమావతి.
”సో….. హ్మ్ 🤔 మనీ ఎక్కువ ఆఫర్ చేశారా?”
”కాదు బావా! నెక్స్ట్ మంత్‌కి సార్ వాళ్లు స్టార్ట్ చేసిన బిజినెస్ 50వ యానివర్సరీ అంట. సో ఆ ఈవెంట్ కూడా మాకే ఇచ్చారు!”
”హో.. ఇంకేం! పార్టీ చేసుకోవాల్సిన విషయం చెప్పావు.”
”ఇది మరీ బాగుంది! ఈవెంట్ ఇచ్చారు అంతే, అది సక్సెస్ చేయాలి.. అప్పుడే పార్టీ! ఓకేనా?”
”ఓకే! కానీ అలా థింక్ చేయకు, బి పాజిటివ్ మా” అని నుదిటి మీద ముద్దు పెట్టాడు హర్షిత్.
”ఉప్చ్.. బావా! మనం ఎక్కడ ఉన్నామో మర్చిపోయావా ఏంటి? ఈ పిచ్చి పని చేశావు?”
”హో.. ఐతే రూమ్‌లో ఇస్తే ప్రాబ్లమ్ లేదు అనమాట! నేను ఇంకా కిస్ చేసినందుకు ఫీల్ అవుతున్నావేమో అనుకున్నానే?”
”బావా 😤 పోయి కొలాబ్ సంగతి చూడు, నేను వెయిట్ చేస్తుంటాను.”
😈😈😈😈😈😈😈😈😈😈😈
వీళ్లిద్దరినీ మోనిటర్‌లో నుంచి చూస్తున్న రణ్‌వీర్ కళ్లు రుధిర వర్ణంలోకి (ఎర్రగా) మారాయి. దవడ కండరాలు బిగించి, చేతి పిడికిలి బిగించాడు. చేతిపై పచ్చని నరాలు పైకి తేలి కనిపించాయి. అతన్ని చూస్తేనే చెప్పొచ్చు ఎంత కోపంగా ఉన్నాడో! ఇప్పుడు అతనికి ఎవరైనా ఎదురువెళ్తే.. వాడు డైరెక్ట్‌గా యముడి దగ్గరకు టికెట్ తీసుకున్నట్లే!
కళ్లు మూసుకుని టేబుల్ మీద వేళ్లతో టాప్ చేస్తూ.. సడన్‌గా కళ్లు తెరిచాడు. రిషికి ఇంటర్‌కామ్‌లో హర్షిత్‌ని లోపలికి పంపమని ఆర్డర్ వేసి, మోనిటర్‌లో తన కేబిన్‌కి వస్తున్న హర్షిత్‌ని చూస్తూ ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు.
”ఎక్స్‌క్యూజ్ మీ సార్!”
”యెస్, కమ్ ఇన్!” అని బేస్ వాయిస్‌తో చెప్పాడు రణ్‌వీర్.
చైర్ ఆఫర్ చేయడంతో కూర్చుంటూ.. “ఐ యామ్ సో ఎక్సైటెడ్ సార్ మీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు!” అన్నాడు హర్షిత్.
”ఐ యామ్ ఆల్సో ఎక్సైటెడ్ మిస్టర్ హర్షిత్ వర్ధన్! ఐ మీన్.. అందుకే కదా వాళ్లు మన రెండింటినీ సేమ్ టెండర్ కోడ్‌తో కొలాబ్ చేశారు.”
”హో! ఓకే సార్, థాంక్స్.”
”ఓకే!” అని రణ్‌వీర్ రిషి వైపు చూడటంతో, కొలాబ్ డాక్యుమెంట్స్ రణ్‌వీర్ ముందు పెట్టాడు రిషి. రణ్‌వీర్ సైన్ చేసి హర్షిత్ ముందు పెట్టి..
“రీడ్ ఇట్ ఆల్ ఒన్స్ అండ్ సైన్ ఇట్!” అని చెప్పాడు.
చదివి “ఆల్ ఓకే సార్” అని సైన్ చేసి, షేక్ హ్యాండ్ ఇస్తూ.. “షల్ ఐ గో సార్?” అని అడిగాడు.
హర్షిత్‌తో హ్యాండ్ కలుపుతూ.. పట్టు పెంచి ఎముకలు విరిగిపోతాయా అనే టైమ్‌లో “యా షూర్!” అని సైడ్ స్మైల్ ఇచ్చాడు రణ్‌వీర్.
’ఏం పట్టురా బాబు! ఇంకా కొంచెం సేపు పట్టుకుంటే నా హ్యాండ్ పనిచేయకుండా పోయేది. ఇకపై ఎప్పుడూ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు’ అని మనసులో అనుకుని ఫేక్ స్మైల్ ఇచ్చి బయటకి వెళ్లాడు హర్షిత్.
వెళ్తున్న హర్షిత్‌ని చూస్తూ.. ‘యెస్! నాకు ఎవరైనా హ్యాండ్ ఇవ్వడమే కాదు, నాదాని వైపు చిన్న వేలు ఎత్తి చూసినా.. హ్యాండే కాదు ప్రాణాలే తీసేస్తాను! నువ్వు సేఫ్ అయ్యావు.. జస్ట్ బికాజ్ ఆఫ్ మై బేబీ !’ అని ఒక శాడిస్టిక్ స్మైల్ ఇచ్చాడు రణ్‌వీర్.
TO BE CONTINUED…
ప్లీజ్ లైక్ & కామెంట్స్ చేయండి!
ఇగ్నోర్ ది మిస్టేక్స్…
సపోర్ట్ చేయండి! 🫶
Swipe left/right or tap the sides to turn pages