New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 3

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 💕 – 3

పల్లవి ఇప్పుడు నిన్ను కూడా రిస్క్ లో పెట్టాను కదా నన్ను క్షమించు పల్లవి….

అలా అనకు వర్ష….ప్లీజ్….నువ్వు నా ఫ్రెండ్ వి రా…నీ కోసం ఏదైనా చేస్తాను….
జయలక్ష్మి గారికి స్పృహ వచ్చి ఏడుస్తూ ఉంటారు…..
పల్లవి జయలక్ష్మి గారి దగ్గరకి వచ్చి ప్లీజ్ ఆంటీ మీరు ఇలా ఉంటే వర్ష కి ఎవరు ధైర్యం చెప్తారు చెప్పండి….
అంతలో అక్కడికి విహాన్ వస్తాడు….మీరు ఇలా ఉంటే కష్టం వర్ష….మా ఇంటికి వెళ్లిపోదాం పద…..
వొద్దు బావ మేము ఎవరికి భారం కావడం నాకు ఇష్టం లేదు….
అని వర్ష అక్కడి నుండి వెళ్ళిపోతుంది…..
ఎంటిరా పల్లవి తను అలా మాట్లాడుతుంది….
మీరేమీ కంగారు పడకండి అన్నయ్య….నేను తనతో మాట్లాడతాను…
అని వర్ష దగ్గర కు వెళ్తుంది…..
వర్ష తన గది కిటికీ నుండి నిలబడి బయటికి చూస్తుంది…..
ఏంటి వర్ష అన్నయ్య తో ఇలాగేనా మాట్లాడేది…..
అని తన భుజం పట్టుకుని తన వైపు కి తిప్పుకుంటుంది….
వర్ష ఎందుకు ఏడుస్తున్నావే….
ఏం చెయ్యమంటావు….నాకు ఏడుపు మాత్రమే మిగిలింది…
నాన్న చనిపోయాక తెలిసింది నాకు అసలు మనుషులు ఎలా ఉన్నారు అన్నది….
నాన్న పార్టనర్స్ చూడు ఏం చేశారో….రేపు వచ్చి మీ ఆస్తిని  మొత్తం లాగేసుకుంటారు….అయిన నాకు బాధ లేదు నాకు మా నాన్న చదువు చెప్పించారు… అది చాలు…
నా కళ్ళ మీద నేను నిలబడగలను…..
అది సరే అన్నయ్య తో ఎందుకు అలా మాట్లాడావు….
నీకు తెలియదు పల్లవి మా అత్తయ్య మావయ్య గురించి వాళ్ళు డబ్బు మనుషులు….మాకు డబ్బు ఉంది అనే నన్ను మా బావ కి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నారు….
రేపు మా ఆస్తులన్నీ వాళ్ళకి అప్పగించాలి అప్పుడు కచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు….అందుకే మా బావ పై ప్రేమ ఉన్న దానిని చంపుకుని మరి అలా మాట్లాడాను…
పిచ్చిగా మాట్లాడకు……అన్నయ్య ఎప్పుడు నిన్ను డబ్బు కోసం ప్రేమించలేదు కదా….
లేదు పల్లవి మా బావ నిజంగానే నన్ను ప్రేమించాడు…. వాళ్ళ అమ్మ నాన్న నీ నా కోసం ఎదిరిస్తాడు కూడా….
కానీ వాళ్ళని విడదీసిన పాపం నాకు వొద్దు….అని ఏడుస్తూ ఉంటుంది….
పల్లవి వర్ష నీ హాగ్ చేసుకుని పరిస్థితి లు అన్ని చక్కబడతాయి….అని ధైర్యం చెప్తుంది కానీ వర్ష పరిస్థితి తలుచుకుంటే తనకి చాలా బాధ గా ఉంది….
💧💧💧💧💧💧💧💧💧💧
విహాన్ ఏం చేస్తున్నావు నాన్న…..అని వస్తారు వాళ్ళ అమ్మగారు అయిన స్వర్ణ….
ఏం లేదమ్మ ఇక్కడ ఏమి కావాలో అందిస్తున్నాను….
ఇక్కడ నీకు పనేంట్ర….వెళ్ళి వర్ష బాధ లో ఉంది….వెళ్ళి తనతో ఉండు…..అని కసురుతారు కొడుకుని….
తన దగ్గర పల్లవి ఉందమ్మా…
ఎప్పుడు చూడు ఆ పల్లవి ఏ ఉంటుంది దగ్గర ఈ టైమ్ లో మచ్చిక చేసుకుని ఆస్తి నీ లాగేసుకోవడానికి చూస్తుందేమో….ఆ పల్లవి….
అమ్మ ఏం మాట్లాడుతున్నావు….పల్లవి అటువంటి పిల్ల కాదు….
నువ్వు చూసావా…..ఎవరు ఇలాంటివాళ్లో చెప్పలేం ఈ రోజుల్లో….
అప్పుడే అక్కడకు వచ్చి స్వర్ణ మాటలు అన్ని విని కోపంగా ఒక వ్యక్తి లోపలికి వెళ్తాడు…..అతనే పల్లవి తండ్రి 
అశోక్ గారు….
పల్లవి…..పల్లవి…..అని గట్టిగా అరుస్తారు….
ఏమయ్యిందండి….అని అడుగుతూ వస్తారు 
పార్వతి గారు…
ముందు అమ్మాయిని పిలువు…..
పల్లవి అని గట్టి గట్టిగా పిలుస్తారు….
అప్పుడే ఆ అరుపులు విని వస్తారు పల్లవి , వర్ష….
ఏమయ్యింది డాడీ….
పల్లవి పద మన ఇంటికి వెళ్లిపోదాం …
ఏమయ్యింది డాడీ అసలు ….ఈ టైమ్ లో వర్ష నీ వదిలేసి రమ్మంటున్నారు….
అప్పుడే అక్కడికి విహాన్ తన తల్లి స్వర్ణ వస్తారు…
అశోక్ గారు స్వర్ణ నీ చూపించి ఈవిడ ఏమి మాట్లాడుతుంది తెలుసా నీకు….
అని స్వర్ణ నీ కోపంగా చూసి….నువ్వు వర్ష దగ్గర డబ్బు కోసం ఉంటున్నవంట….ఈ పరిస్థితి నీ అనుకూలంగా మార్చుకుని ఆస్తి రాయించుకుంటావంట…..
స్వర్ణ కంగారు పడుతుంది….అయిన కప్పిపుచ్చుకుని ఏంటండీ నేను ఆనందాంట్లో తప్పేముంది….
డబ్బు ఉంది కాబట్టే వర్ష తో ఫ్రెండ్షిప్ చేస్తుంది…
అమ్మ ఇంక ఆపుతావా….
వర్ష కి స్వర్ణ పై కోపం వస్తుంది….కానీ కొన్ని క్షణాలు ఆలోచించి అవును అత్త నువ్వు చెప్పింది నిజమే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టే పల్లవి నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది….
అందరూ ఆశ్చర్యంగా చూస్తారు వర్ష వైపు…..
పల్లవి నిర్ఘాంతపోయి వర్ష…..అని నమ్మలేనట్టు పిలుస్తుంది….
పార్వతి గారు చాలు వర్ష అది నీ చుట్టూ తిరిగేది నీ పై ఉన్న ప్రేమతో అభిమానం తో కానీ నీ వెనుక ఉన్న డబ్బు తో కాదు….చాలా మంచి గుణపాఠం చెప్పావు తల్లి….అని బాధపడుతూ అంటారు….
వర్ష గట్టిగా కళ్ళుమూసుకుంటుంది……
ఇంకా ఇక్కడ అవసరమా పల్లవి…..
పల్లవి సూటిగా వర్ష వైపు చూస్తుంది….
వర్ష కళ్ళ లో నీళ్ళు అవి కనిపించకుండా మొహం పక్కకి తిప్పేసింది….
నా అడ్డు కూడా తొలగించుకుంటున్నావా వర్ష…. నన్ను కూడా నీ జీవితం నుండి తీసేస్తున్నావా….
మరి పల్లవి వర్ష విడిపోతారా…..?
వర్ష అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోనుందా….?
విహాన్ ఏం చేస్తాడు మరి….?