New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
డార్క్🖤రొమాన్స్ -1 – 2

డార్క్🖤రొమాన్స్ -1 – 2

చుట్టూ ఉన్న భయానక వాతావరణం, ఆ చీకటి గదిని చూసి కీర్తిలో భయం మరింత పెరిగింది. ఆమె గుండె వేగంగా  కొట్టుకుంటోంది………..
తన చుట్టూ ఏదో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని, తనకు ఏదో కీడు జరగబోతోందన్న చెడు భావన ఆమెను భయపెడుతోంది……….
ఆ భయంతోనే కీర్తి తనలో  తానే మాట్లాడుకుంటూ. అసలు నేను ఇంటర్వ్యూ  కోసం  సరైన చోటకే వచ్చానా లేదా అనే సందేహంతో, చాలా బలహీనంగా, భయంతో వణుకుతున్న గొంతుతో ఆమె మనసులో అనుకుంటుంది…………..
అక్కడ గాలి లేకపోయినా, ఎవరి ప్రమేయం లేకపోయినా… అక్కడ ఉన్న అదృశ్యమైన శక్తి కారణంగా కొవ్వొత్తుల మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి…………..
అలా మంటలు చెలరేగే సరికి  కీర్తి భయంతో వణికిపోతు తనను తాను రక్షించుకోవడానికి, తన దగ్గర ఉన్న భద్రత  కోసం తన బ్యాగ్ నుండి తన స్కెచ్ బుక్‌ను బయటకు తీసి గట్టిగా పట్టుకుంటుంది……….
ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఎవరో నడుస్తున్న చప్పుడు మెల్లగా వినిపిస్తుంది. ఆమెకి  ఆ అడుగులు  చప్పుడు  పెద్దగా శబ్దం వినిపించకుండా సైలెంట్‌గా వస్తున్నాయి……..
ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అని భయంతో కీర్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. సరిగ్గా ఆమె వెనకే ఒక మనిషి  నిలబడి ఉంటాడు…………
అతని రూపం చాలా ఆకర్షణీయంగా మరియు ఎత్తుగా ఉంది. అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు. అతని చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఒక భయానకమైన చీకటిని ఆవరించినట్లుగా అతడు కనిపిస్తున్నాడు………….
అతని తల వెంట్రుకలు చెల్లా చెదురుగా  ఉన్నాయి. అతని ముఖ కవళికలు పదునైన కోణాలతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి…………..
అతని రూపం భయపెట్టేలా ఉన్నప్పటికీ, అతని కళ్ళు మాత్రం చాలా అందంగా  నీలం, రంగులో  కలిగి ఉన్నాయి…………
అయితే ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతని మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఏదో పెద్ద విషాదం, తీరని నిస్సహాయత అతని లో స్పష్టంగా కనిపిస్తున్నాయి…………
కీర్తి ఎప్పుడైతే అతని కళ్లలోకి నేరుగా చూసిందో, అతను పడుతున్న ఆ అంతర్గత వేదన మరియు బాధ కీర్తికి తన  మనసును తాకినట్లుగా అనిపించింది. అలా అనిపించిన ఆమె కి అతని పట్ల ఒక వింతైన అనుభూతి కలిగింది………….
ఇంతకీ అతను పేరు చెప్పలేదు కదా………
ఆ  భయంకరమైన బ్లాక్  రోజ్ ఎస్టేట్ యజమాని. ఆయనే ​రుద్రాక్ష్  అథర్వ………..
అప్పుడు అతను కూడా ఆమె వైపు చూస్తూ.నువ్వు పెయింటర్‌వి కదా? అని ఆమెను ప్రశ్నిస్తాడు………
అయితే అతను చూడటానికి భయంకరంగా కనిపించిన అతని గొంతు   మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది……….
అతను మాట్లాడిన మాటలకు, అతని మ్యాజిక్ లాంటి చూపులకు, ఆ గంభీరమైన ప్రశ్నకు కీర్తి ఒక్క క్షణం నివ్వెరపోతుంది………..
తరువాత కొంత సమయానికి ఆమె తేరుకుని భయంతోనే వణుకుతూ, అతి కష్టం మీద “అవును” అని అతనికి సమాధానం ఇస్తుంది………….
అప్పుడు అతను,  నువ్వు ఒక ఉద్యోగిని గా కాకుండా. నా జీవితంలో ఉన్న చీకటిని, నిరాశను పోగొట్టి నా మనసుకు సంతోషాన్ని, ప్రశాంతతను  తెచ్చే ప్రత్యేకమైన వ్యక్తి గా నువ్ ఇక్కడ పని చేయాలి. మరి ఆ పని నువ్ చేయగలవా? అని ఆమెను సూటిగా ప్రశ్నిస్తాడు……………
అతను మాట్లాడిన తీరు చాలా విచిత్రంగా, ఒక పొడుపు కథలా ఉండటంతో కీర్తికి ఏం మాట్లాడాలో అర్థం కాక …………
అయోమయంగా తల ఊపుతూ కేవలం “ప్రయత్నిస్తాను” అని అతి కష్టంగా సమాధానం ఇస్తుంది…………
ప్రయత్నించడం సరిపోదు. ఇక్కడ ఉండటం ప్రమాదకరం. ఇక్కడికి చాలా మంది వచ్చారు, కానీ ఎవరూ ఇక్కడ ఉండలేక , భయంతో పారిపోయారు…………….
ఒక్క నిమిషం, అని ​అతను ఒక మూలలో ఉన్న కొన్ని పాత, విరిగిపోయిన పెయింటింగ్స్ తీసుకు వచ్చి ఇవి మునుపటి అసిస్టెంట్లు గీసినవి…………
అంటూ అతను  అవి చూపిస్తూనే మాటలతో చెప్పడమే కాకుండా, ఇంకా గదిలో ఒక మూలన పడి ఉన్న పాత,  పెయింటింగ్స్ వైపు ఆమెకి అతని వేలితో చూపిస్తూ . అవి గతంలో అక్కడ  మరి కొంతమంది పనిచేసే అసిస్టెంట్లు గీసిన చిత్రాలు…………
అయితే వాటన్నింటికీ ఒకే ప్రత్యేకత ఉంది. ఆ చిత్రాలలో ఉన్న వ్యక్తులు నిశ్శబ్దంగా అరుస్తున్నట్లు ఉన్నాయి. ఇంకా వారి  ఆ కళ్ళల్లో చెప్పలేనంత భయం  దాగి ఉంది………..
అసలు ఆ పెయింటింగ్స్‌లో ఏముందంటే… అందులో ఉన్న మనుషుల ముఖాలు స్పష్టంగా లేకపోయినా, వాళ్ళు నోరు తెరిచి నిశ్శబ్దంగా కేకలు వేస్తున్నట్లుగా, వారి కళ్లలో ఎవరికీ చెప్పుకోలేని తీవ్రమైన భయం, హడలిపోయిన భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి…………..
ఆ చిత్రాలు ఆ ఎస్టేట్ సృష్టించిన మానసిక క్షోభను ప్రతిబింబిస్తాయి…………..
రుద్రాక్ష్  చూపించిన ఆ భయానక పెయింటింగ్స్‌ను చూడగానే కీర్తి ఒళ్లు గగుర్పొడిచింది. ఆ చిత్రాలలో ఉన్న నిశ్శబ్ద అరుపులు ఆమెను మానసికంగా తీవ్రంగా భయపెట్టాయి……………
గతంలో తన కలల్లో ఎప్పుడూ కనిపిస్తూ తనను భయపెట్టే ఆ వింత ఆకారాలు, భయానక కేకలు వేరే ఎక్కడివో కావు……….
సరిగ్గా ఈ ‘బ్లాక్ రోజ్ ఎస్టేట్’ లోని అతీంద్రియ శక్తుల నుంచే తనను చేరుకుంటున్నాయని కీర్తి  మనసులో అనుమానం వస్తుంది………..
@@@@@@@@@@@
కీర్తిని భయపెడుతున్న ఆ ఎస్టేట్ రహస్యాలు అసలు ఏంటో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే……..
ఈ చీకటి ఎస్టేట్‌లో కీర్తి అడుగుపెట్టడం ఆమె ప్రాణాలకే ముప్పు తెస్తుందా? లేక రుద్రాక్ష్  గతం వెనుక ఉన్న నిజం వేరే ఉందా?
ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా  రేటింగ్స్  అండ్ కామెంట్స్  ఇవ్వడం 
మర్చిపోకండి………..
అలాగే తదుపరి ఎపిసోడ్ కోసం వెంటనే మన పేజీని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్.  నా స్టోరీ ని రీడ్ చేసేవాళ్ళకి. అలాగే చేయబోయేవాళ్ళ అందరికీ నా హృదయపూర్వక❤️ ధన్యవాదములు. తెలుపుకుంటూ..🙏ప్రేమతో 🫶
మీ…భార్గవి…✍️