నీతో నా పయనం – 3
క్రిష్ బాల్కనీలోకి వెళ్లి పూజ కి కాల్ చేస్తాడు.
పూజ మొబైల్ రింగ్ కి లేచి క్రిష్ ఏంటి వీడు ఈ టైం లో కాల్ చేసాడు అనుకోని లిఫ్ట్ చేస్తుంది.
క్రిష్ గుడ్ మార్నింగ్ పూజ డిస్టర్బ్ చేసానా అంటాడు.
పూజ గుడ్ మార్నింగ్ క్రిష్ డిస్టర్బ్ చెయ్యలేదు కానీ ఇంత మార్నింగ్ కాల్ చేసావ్ ఏంటి అని అడుగుతుంది.
పూజ నాకు నీ అప్పోయింట్మెంట్ కావాలి అంటాడు.
రేయ్ నేను ఎవరో తెలుసా నా అపాయింట్మెంట్ నీకు ఎందుకు క్రిష్ అంటు షాక్ అవుతుంది.
హేయ్ మెంటల్ నాకు కాదు లే నాకు తెలిసిన అమ్మాయి కి హెల్త్య్ ప్రాబ్లెమ్ నేను వచ్చాక కంప్లీట్ గా ఎక్సప్లైన్ చేస్తా అని చెప్తాడు క్రిష్.
క్రిష్ అమ్మాయి అనగానే మళ్ళీ షాక్ పూజ.
రేయ్ క్రిష్ నీకు బాగానే ఉందా హెల్త్య్ చెప్పు అంటుంది పూజ.
క్రిష్ నాకు ఏమైంది నేను బాగానే ఉన్న అంటాడు.
మళ్ళీ ఇది ఏంటి అమ్మాయి అంటున్నవ్ అపాయింట్మెంట్ అంటున్నవ్ నాకు ఎం అర్థం కాలేదు అంటుంది పూజ.
క్రిష్ నవ్వుతూ నేను అక్కడికి వచ్చాక క్లారిటీ ఇస్తా షార్ప్ 11 కి వస్తా అని చెప్తాడు క్రిష్.
డాక్టర్ నేను రా నువ్వే టైం చేప్పి నువ్వే అపాయింట్మెంట్ ఫిక్స్ చూసుకున్నావా అంటుంది.
క్రిష్ నవ్వుతూ బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు.
క్రిష్ కాల్ cut చేసాక సత్య గురించి ఆలోచిస్తాడు అసలు ఇలాంటి ప్రాబ్లెమ్ తనకి రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూ బెడ్ రూమ్ కి వస్తాడు.
సత్య గోళ్లు కొరుక్కుంటూ ఉంటుంది.మార్నింగ్ తినాల్సింది బ్రేక్ ఫాస్ట్ గోళ్లు కాదు అంటాడు.
సత్య క్రిష్ గారు నన్ను ఎప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తారు అంటుంది.
క్రిష్ సత్య ని చూస్తూ నిన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్తా అంటాడు.
ఎక్కడికి అంటుంది. నువ్వే చూస్తావ్ గా అంటూ ఉండగానే కాలింగ్ బెల్ వినిపిస్తుంది.
క్రిష్ 5 మినిట్స్ అని అక్కడికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకుని డోర్ లాక్ చేస్తాడు..
క్రిష్ సత్య దగ్గరికి వచ్చి నీకు నచ్చినది వేసుకుని రెడీ అవ్వు అంటాడు.
నాకు సెలక్షన్ తెలీదు అంటుంది.
మరి సూసైడ్ చేసుకోవడం వచ్చాఅని వెటకారం గా అంటాడు క్రిష్.
సత్య ఉక్రోషం గా క్రిష్ ని చూస్తూ పింక్ కలర్ 3 పీస్ సెట్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్తుంది.
క్రిష్ సత్య వేషాలు చూసి నవ్వుకుంటాడు.
సత్య 20 మినిట్స్ కి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది.
క్రిష్ డ్రెసింగ్ రూమ్ ఉంది కదా అక్కడే ఎందుకు వేసుకున్నావ్ అంటాడు.
సత్య నాకు అలాంటివి తెలీదు క్రిష్ గారు అని చెప్తుంది.
క్రిష్ సత్య చెయ్యి పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ కి తీసుకెళ్లి అక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాడు.
సత్య అక్కడ చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది. ఏంటి అర్థం అయ్యిందా అంతే హ అంటుంది పద అని బెడ్ రూమ్ కి వచ్చి నువ్వు ఇక్కడే ఉండు నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్తాడు క్రిష్.
క్రిష్ వెళ్ళగానే సత్య బాడీ ఎర్రగా అయిపోతుంది కళ్ళు రెడ్ గా అయిపోతాయి సత్య కి మళ్ళీ టెన్షన్ ఎక్కువ అయ్యి కిచెన్ కి వెళ్లి షాక్ తీసుకుని అరచేతిలో పెట్టుకుని గట్టిగా పట్టుకుంటుంది.
క్రిష్ కి మనసులో అలజడిగా అనిపించి ఫాస్ట్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి చుస్తే అక్కడ సత్య ఉండదు.
సత్య ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఫాస్ట్ గా రెడీ అయ్యి కిచెన్ కి వస్తే అక్కడ షాక్ చేతిలో పట్టుకుని ఉంటుంది.
క్రిష్ కోపం గా అక్కడికి వెళ్లి లాగి ఒక్కటి పీకుతాడు.
సత్య క్రిష్ ని చూస్తూ నేను చచ్చిపోవాలి నన్ను వదిలెయ్యండి అంటుంది మళ్ళీ క్రిష్ పిచ్చ నీకు పద అని బెడ్ రూమ్ కి లాక్కుని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి పద అని బయటికి తీసుకుని వస్తాడు.
క్రిష్ కి అప్పటికే సత్య బాడీ లో చేంజ్ కనిపించి లేట్ చెయ్యకుండా పూజ హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యి పూజ కి మెసేజ్ చేస్తాడు ఎమర్జెన్సీ ఫాస్ట్ గా రా అని.
పూజ మెసేజ్ చూసి ఫాస్ట్ గా రెడీ అయ్యి తన కార్ లో స్టార్ట్ అవుతుంది.
క్రిష్ కన్నా ముందు పూజ హాస్పిటల్ కి వచ్చి తన కేబిన్ లో వెయిట్ చేస్తుంది.
క్రిష్ 30 మినిట్స్ లో రీచ్ అయ్యి సత్య ని లాక్కుని పూజ కాబిన్ కి వెళ్లి సత్య ని చూయించి తినే నేను చెప్పిన అమ్మాయి ఒక సారి తనకి ఫుల్ బాడీ చెక్ అప్ చెయ్ అని చెప్తాడు….
కంటిన్యూ….
మీకు నా స్టోరీ నచ్చితే కామెంట్ చేసి follow చెయ్యండి
Swipe left/right or tap the sides to turn pages