New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ జతే నే కోరుకున్న – 1

నీ జతే నే కోరుకున్న – 1

ఎం అయింది అక్క… ఎందుకు అంత డల్ గా ఉన్నావు…..నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అక్క అని బాధ గా అడుగుతుంది మీనా తన అక్క తో.

 

 

 

ఆలా ఎం లేదు మీనా… కానీ ఎందుకో చాలా భయంగా ఉంది… నాన్న ని నిన్ను వదిలి వెళ్ళాలి…. తెలియని వాళ్లతో ఈ రోజు నుంచి జీవితం పంచుకోవాలి అంత కూడా కొత్తగా ఉంది మీనా నాకు…. భయంగా ఉంది…. నాకు ఎక్కడకు వెళ్ళాలి అని లేదు…. నీతో నాన్న తో కలిసి… ఇక్కడే ఉండాలి అని ఉంది మీనా అని అంటూ తన చెల్లి అయినా మీన్ ని గట్టిగ హత్తుకొని…. వెక్కి వెక్కి ఏడుస్తూ తన బాధ ను చెప్పుకుంటుంది….20 ఏళ్ల అమ్మాయి… పెళ్లి కూతురి గా రెడీ ఐ ఉంది.

 

 

అక్క ఎం బాధ పడకు అక్క…. అయినా ఇన్ని రోజులు గా పడిన బాధ ను…. పెళ్లి ఐయ్యాక అయినా తీరుతుందేమో అక్క…. బాధ పడకు…. నాన్న అన్ని చూసి ఈ పెళ్లి కుదిరించాడు….

 

అయినా బావ ది మంచి జాబ్ అంట…. మంచి శాలరీ అంట… ఇంకా చెప్పాలి అంటే…. చాలా అందగాడు కూడా… నువ్వేమో బావ గారిని కనీసం ఫోటో కూడా చూడకుండా నాన్న చెప్పాడు అని పెళ్లి కి రెడీ ఐయ్యావు అని బుంగ మూతి పెట్టింది మీనా.

 

 

మీనా ఆలా అల్లరి చేస్తుంటే… ఒక్క సారిగా నవ్వు వస్తుంది తనకి.

 

 

హ్మ్… ఇలా నవ్వుతు ఉండాలి…. ఇంకో గంట లో పెళ్లి… కనీసం… తాళి కట్టడానికి ముందు అయినా… నీ సిగ్గు భయం పక్కన పెట్టి… బావ గారిని కొంచెం తల ఎత్తి చూడు…. అక్క అని చిన్న సలహా ఇస్తుంది మీనా.

 

 

అయ్యో… నేనా…. నా వాళ్ళ కాదు…. నాకు భయం…. నేను చూడను అని కంగారుగా చేతులు నలుపుకుంటూ చీర కొంగు ని నలిపేస్తుంది ఆ అమ్మాయి.

 

 

ఇలా. అయితే ఎలా అక్క…. అయినా మరి ఇంతలా బయపడకూడదు…. కొంచెం ధైర్యం గా ఉండాలి….అని మీనా నవ్వుతు అంటుంటే….

 

 

 

ఇలా ఉండాలి… ఇలానా అని నడుము మీద చేతులు పెట్టుకొని…. తల ని కొంచెం పైకి ఎత్తి కోపం నటిస్తూ అంటుంది ఆ అమ్మాయి.

 

 

 

మీనా ఆ అమ్మాయిని చూసి నవ్వుతు…. హ… ఇలానే అని నవ్వుతుంటే… ఆ అమ్మాయి కూడా మీనా కి జత కలిపి అందంగా నవ్వుతు ఉంది.

 

 

 

అప్పుడే రూమ్ లో కి ఎంట్రీ ఇస్తుంది మీనా తల్లి…. ఆ అమ్మాయి కి కూడా తల్లి…. కానీ సవతి తల్లి.

 

 

ఏయ్… ఏంటే ఆ నవ్వులు….పెళ్లి చేసుకుంటున్నావు అని బాగా బలిసి కొట్టుకుంటున్నావా…. నరికేస్తా అని ఆ అమ్మాయిని కోపంగా అంటుంది సవతి తల్లి అయినా రాజ్యలక్ష్మి.

 

 

 

ఆ అమ్మాయి రాజ్యం (రాజ్యలక్ష్మి )ని చూడగానే… మీనా వెనక్కు వెళ్లి మీనా ని గట్టిగ పట్టుకొని వణికిపోతుంది….. కళ్ళు మూసుకొని.

 

 

అమ్మ… ఎందుకు అక్క ని ఉరికే ఆలా బయపెడుతావు…. ఇప్పుడు అక్క ఎం అన్నది అని…. తను ఎం చేయలేదు కదా…. తిట్టడానికి… ముందు నువ్వు ఇక్కడ నుంచి వేళ్ళు అని కోపంగా అరుస్తుంది మీనా తన తల్లి తో.

 

 

ఏంటే దానికి సపోర్ట్ చేస్తున్నావు….. అయినా నా కన్నా నీకు అదే ఎక్కువ కదా…. ఏ మందు పెట్టిందో ఏంటో…. నా కన్నా బిడ్డ ని దాని వైపు లాక్కుంది దరిద్రపు ది అని మీనా వెనుక ఉన్న అమ్మాయిని కోపంగా చూస్తూ తిడుతుంది రాజ్యం.

 

 

 

అవును నీ కన్నా… నాకు అక్క నే ఎక్కువ…. చిన్నప్పటి నుంచి అక్క ని టార్చెర్ చేసి…. హింసించింది చాలదా… ఇప్పుడు….. నీ టార్చెర్ భరించలేక… నాన్న అక్క కి పెళ్లి చేస్తున్నాడు… ఇప్పుడు అయినా అక్క ని టార్చెర్ చేయకుండా పెళ్లి పనులు చూసుకో…. అక్క విషయం లో కి రాకు అని కోపంగా చెప్పి…. వణికిపోతున్న ఆ అమ్మాయిని గట్టిగ పట్టుకొని హత్తుకుంటుంది మీనా.

 

 

 

ఆ అమ్మాయిని… మీనా ని కోపంగా చూస్తూ… నా కన్నా బిడ్డ నాకే శేత్రువు గా చేసింది… దానిని ఉరికే వదలను అని కోపంగా అనుకుంటూ బయటకు వెళ్ళిపోయింది రత్నం.

 

 

 

ఏంటి అక్క…. చిన్న పిల్లల ఈ ఏడుపు…. ఊరుకో… అయినా అమ్మ గురించి తెలిసిందేగా…. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నిన్ను ఆనంది ఊరుకోదుగా…. ఎం కాదు లే… ఏడవకు అని….ఆ అమ్మాయిని ఊరుకోబేడుతుంది మీనా.

 

 

 

అమ్మ… సీత… సీత రెడీ ఐయ్యవా తల్లి…. మగ పెళ్లి వాళ్ళు బయలుదేరారు తల్లి…. అని రూమ్ లో కి వచ్చి చూసాడు సత్యనారాణగారు…. మీనా కి సీత కి సొంత తండ్రి.

 

 

సత్యనారాయణ గారి మాటలు వినపడగానే… సీత వెంటనే మీనా ని వదిలి వెనక్కు తిరిగి… తన కన్నీళ్లను తుడుచుకుంటుంది కంగారుగా.

 

 

ఎం అయింది తల్లి…. అని సీత దగ్గరకు వచ్చి… ఎం అయింది రా…. ఎందుకు ఈ కన్నీళ్లు…. మళ్ళీ ఎం అయినా అన్నారా నిన్ను అని కంగారుగా అడుగుతాడు సతనారాయణ….. తన పెద్ద కూతురు అయినా సీత మహాలష్మి ని.

 

 

అవునండి… మన హీరోయిన్ నేమ్ సీతామహాలష్మి.

అందం.. అమాయకత్వం.. మంచి మనసు… ఎవరికీ ఎదురు చెప్పలేని గుణం.. తండ్రి మాట ని జమాదటని మంచి గుణం ఉన్న ఒక అమ్మాయి.

 

చిన్న తనం లో నే…. పూరీట్లో నే తన తల్లి ని పోగొట్టుకొని…. కేవలం తన తండ్రి చేతుల్లో పెరిగిన అమ్మాయి…. సీత తల్లి చనిపోయిన…. కొన్ని నెలలకే… సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకో అని నలుగురు పోరు పెట్టడం తో…. తప్పక… రాజ్యం ని పెళ్లి చేసుకున్నాడు…. అప్పటికి సీత కి 6 నెలలు అంతే.

 

 

కానీ రాజ్యం ని పెళ్లి చేసుకొని సీత కి అమ్మ ని తెచ్చాడు అనుకున్నాడు కానీ…. సవతి తల్లి అని సీత ని చూసుకునే విధానం లో నే తెలియడం తో…. సతనారాయణ గారు సీత ని తానే చూసుకునే వాడు.

 

 

రాజ్యం కి సీత ని ఆలా ఎక్కువ ప్రాణం గా చూసుకోవడం అస్సలు నచ్చేది కాదు… కానీ ఎం చేయగలదు…. ఎప్పుడు సీత ని వెంట పెట్టుకునే తిరిగేవాడు సత్యం.

 

 

ఎప్పుడు కూడా రాజ్యం ని నమ్మి సీత ని తనకి ఒప్పాజెప్పలేదు.

 

 

ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ పడితే…. సీత ని… తన అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళేవాడు.

 

ఆలా సీత కి సంవత్సరం వచ్చే లోగ రాజ్యం కి ఒక ఆడపిల్ల పుట్టింది.

 

 

తానే మీనా.

 

 

ఆలా రోజులు గడుస్తున్నా రాజాం లో సీత మీద పగ పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు…. సతనారాయణ గారు…. పొలం పనులకు వెళ్ళిపోతే…. సీత ని తిట్టడం కొట్టడం…. పనులు చేపించడం చేసేది.

 

 

సత్యం ఉంటే…. సీత ని మంచిగా చూసుకోవడం చేసేది.

 

 

కానీ సత్యం కి కూడా తెలుసు… సీత ని ఏ విధంగా చూసుకుంటుందో అని…. కానీ ఎం చేయగలడు…. ఆ విషయం మీద రత్నం ని ఇదిరించిన కూడా…. తను లేని టైం లో సీత ని ఎం అయినా చేయగలదు అని… బయం తో సైలెంట్ గా చూస్తాజ్ పోతున్నాడు సత్యం.

 

 

మీనా సీత కి సొంత అక్కాచెల్లెలా ల కలిసిమెలిసి ఉంటారు.

 

 

ఒకరికి ఒకరు అంటే ప్రాణం…. ఇంకా చెప్పాలి అంటే…. ఒకరు లేనిదీ మరొకరు ఉండలేరు… అంత ఇష్టం వాళ్ళు అంటే.

 

 

ఇద్దరికి సంవత్సరం మె తేడా కావడం తో…. ఒకే స్కూల్ ఒకే కాలేజీ లో నే చదువుకున్నారు ఇద్దరు.

 

 

ఊరు ధాటి బయటకు వెళ్ళింది లేదు ఇద్దరు.

 

 

చివరకు డిగ్రీ కంప్లీట్ చేసారు సీత.

 

తన పిన్ని పెట్టె టార్చెర్ ని తట్టుకుంటూనే…. తన నాన్న చెల్లి తో సంతోషంగా సాగిపోతుంది సీత జీవితం.

 

డిగ్రీ అయిపోగానే…. సీత ఇంట్లో నే ఉండటం తో… రత్నం తనని ఇంకా ఎక్కువ టార్చెర్ చేసేది…. ఎప్పుడు టైం దొరుకుతుందా…. తనని ఎలా బాధ పెట్టాలా అని చూస్తది రత్నం.

 

 

మీనా కి ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవ్వడం తో…. కాలేజీ కి వెళ్ళేది…. మీనా ఉంటే అయినా… రత్నం నుంచి కొంచెం ఏదిరించి అయినా కాపాడేది.

 

సీత ఇంట్లో పనులు అన్ని చేస్తూ…. వాళ్ళ నాన్న తో పొలానికి కూడా వెళ్ళేది…. తనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న తో పొలానికి వెళ్లి… వాళ్ళ నాన్న కి సహాయం గా ఉండేది సీత.

 

 

ఆలా సీత జీవితం సాగిపోతు ఉండగా…. ఎవరో సీత ని ఒక పెళ్లి లో చూసారు అని ఒక సంబంధం వచ్చింది…. ఆ సంబంధం చూసి అబ్బాయి కూడా మంచి గా జాబ్ చేస్తూ మంచిగా ఉండటం తో… సత్యం కి సంబంధం నచ్చి… సీత కి పెళ్లి చేయాలి అని ఫిక్స్ ఐయ్యడు.

 

 

ప్రెసెంట్….

 

ఆలా సీత ని ఇప్పుడు పెళ్లి కూతురిగా చూసి.. సత్యం కి గుండె బరువు ఎక్కి…. కళ్ళలో నీళ్లు తిరిగాయి.

 

అమ్మ… సీత అప్పుడే నువ్వు ఇంత పెద్ద దానివి అయిపోయావ్ తల్లి….. ఈ నాన్న ని వదిలేసి వెళ్ళిపోతావా తల్లి అని కళ్ళలో నీళ్లను దస్తూ అంటాడు సత్యం.

 

 

నాన్న… అని సత్యం గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత.

 

 

నాన్న…. నువ్వే కదా ఈ పెళ్లి చేసుకో.. నీ జీవితం బాగుంటుంది అని అన్నావు… అందుకే నీ మాట విని ఈ పెళ్లి చేసుకుంటున్న న్నా నా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది సీత.

 

 

నా బంగారు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఈ నాన్న మాట ని జమాదట్టదు… ఇన్ని రోజులు పడిన నరకం చాలు తల్లి…. ఇంకా అయినా నువ్వు సంతోషం గా ఉండాలి అని ఈ నాన్న నీకు ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నాడు అని కళ్ళలో నీళ్లతో అంటాడు సత్యం.

 

 

 

ఎలా ఉంది స్టోరీ నన్ను సపోర్ట్ చేసి ఫాలో చేయండి గయ్స్ 🥰

 

 

మీ స్వాతి….