నీ జతే నే కోరుకున్న – 2
నాన్న నీకు ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం నాన్న… నేను ఎప్పుడు కూడా నీ మాట కథనను నాన్న అని కన్నీళ్లతో అంటుంది సీత.
నా బంగారు తల్లి అని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటాడు సత్యం.
సరే తల్లి…. బయట చాలా పనులు ఉన్నాయ్… నువ్వు తొందహ్రెగా రెడీ అవ్వు అని బయటకు వెళ్ళిపోయాడు సత్యం.
సీత చైర్ లో కూర్చొని…. సైలెంట్ గా బాధ పడుతూ ఉంది… పక్కనే మీనా కూడా.
##############################
రాజస్థాన్…. జైపూర్..
ఉదయం…8గంటలకు
శ్రీరామ చంద్ర… నా విను నాన్న… మనం పెళ్లి కి వెళ్లడం చాలా ఇంపార్టెంట్ నాన్న…. ఇంకా చెప్పాలి అంటే…. మీ నాన్న నే ఈ పెళ్లి కి వెళ్ళాలి… కానీ…. మీ నాన్న ఇంపార్టెంట్ వర్క్ ఉండటం తో ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
కనీసం మనం అయినా పెళ్లి కి వెళ్ళాలి నాన్న…. అని బతిమతున్నారు రాజారామ్ గారు.
తాతయ్య… మీకు ఎన్ని టైం చెప్పాలి…. నన్ను ఆలా పిలవదు అని… జస్ట్ రామ్ అని పిలవండి…. లేదంటే… నా కోపం మీకు తెలుసు అనుకుంట అని కోపంగా బేస్ వాయిస్ లో అంటాడు… ఆరడుగుల అజనుబహుడు… ముట్టుకుంటే మసిపోయే రంగు… సిల్కీ హెయిర్.. చిరుత లాంటి చూపు… పింక్ కలర్ లిప్స్.. షార్ప్ నోస్… మగసిరి ఉట్టిపడే మీసాకట్టు… కండలు తిరిగిన ఎయిట్ ప్యాక్ బాడీ…. ఎవరైనా చూస్తే…. తట్టుకోవడం కష్టమే… అంత హాట్ అండ్ క్యూట్ గా ఉంటాడు శ్రీరామ చంద్ర… సోరి సోరి రామ్.
తెలుసురా మనవడా…. కానీ… నాకు ఇప్పుడు ఫాషన్ గా మార్చుకునంత మాత్రాన నీ పేరు నీది కాకుండా పోతుందా…. నేను ఎం వినను….నేను నిన్ను శ్రీ రామ చంద్ర అని మాత్రమే పిలుస్త…. లేదంటే నా కోపం నీకు తెలుసు కదా…. నేను ని తాతయ్య ని…. నా రక్తం నువ్వు… నీకె అంత ఉంటే… మరి నాకు ఎంత ఉంటది రా అని లోపల నవ్వును దస్తూ మీసం మేలేస్తూ అంటాడు రాజారామ్ గారు.
తాతయ్య… థిస్ ఇస్ టూ మచ్…. అయినా నేను పెళ్లి కి రాను…. నాకు ఢిల్లీ లో మీటింగ్ ఉంది…. నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు కోపంగా రామ్.
ఏంటి మహా వీడు…. అసలు ఎవ్వరి మాట లెక్క చేయడు…. అసలు నా మాట కూడా పట్టించుకోడు…. వీడికి ఉన్న పొగరుకి వచ్చే వాడి పెళ్ళాం ఎలా తట్టుకుంటుందో ఏంటో అని తన పక్కన ఉన్న తన భార్య మని అని మహాలష్మి గారి తో అంటాడు రాజారామ్.
ఎటండి మీరు ఆలా అంటారు….. వాడు మన మనవడు….అయినా మీకు ఉండే బుద్దులేగా వాడికి వచ్చాయి…మీరు మన మనవడి ఏజ్ లో ఉన్నపుడు… ఎలా ఉండేవారు…. అసలు ఎవరిని అయినా పట్టించుకునే వర….. కోపం ఆటిట్యూడ్ అన్ని మీ పోలికలే….. మళ్ళీ నా మనవడిని అంటారే అని మొకం పక్కకు తిప్పుకొని అంటారు మహాలక్ష్మి గారు.
అబ్బో మనవడిని అనగానే పౌరుషం మూడుచుకు వచ్చింది మహాలక్ష్మి గారికి…. కానీ ముందు వాడిని ఒప్పించు.. పెళ్లి కి వెళ్ళడానికి…. అని బయటకు వెళ్ళిపోతాడు రాజారామ్ గారు.
హ్మ్… తాత మనవడు ఇద్దరు ఇద్దరే…. నా కొడుకు అయినా నయం…. చెప్పిన మాట వింటాడు అని నిట్టూర్చి…. రామ్ రూమ్ లో కి వెళ్తుంది మహాలక్ష్మి గారు.
వాళ్ళ రూమ్ నుంచి బయటకు వచ్చి… లిఫ్ట్ లో…. రామ్ ఉన్న రూమ్ కి వెళ్లి…. రామ అని చిన్నగా పిలుస్తూ రూమ్ మొత్తం చూస్తుంది మహాలక్ష్మి.
కానీ రామ్ ఎక్కడ కనిపించాడు….
రామ… ఎక్కడ ఉన్నావు కన్నా… అని బాల్కనీ లో కి వెళ్లి చూడగా…. అక్కడ రామ్ సీరియస్ గా సిగరేట్ కలుస్తు…. కోపంగా ఉన్నాడు అనడానికి అతడి పిడికిలి తో గోడకు చిన్నగా పంచెస్ ఇస్తున్నాడు.
రామ… ఎందుకు నాన్న కోపం…. కొంచెం కోపం తగ్గించుకో కన్నా అని రామ్ చేతులు పట్టుకొని చిన్నగా పిడికిలిని తీస్తు అంటారు మహాలక్ష్మి గారు.
అయినా కూడా రామ్ లో కోపం తగ్గక అలానే సిగరేట్ తాగుతూ ఉంటే…. ఆ సిగరెట్ ని తీసి పక్కన పడేస్తుంది మహాలక్ష్మి గారు.
చిర్రన కోపంగా చూసాడు మహాలక్ష్మి గారిని…. వెంటనే కోపం తగ్గించుకోవడానికి గట్టిగ ఉపిరి పీల్చుకొని వదిలి…. ఏంటి గ్రాని నువ్వు నాకు కోపం తెపించే పనులు చేస్తావు ఎందుకు అని కొంచెం కూల్ గా నే అంటాడు రామ్.
ఏంటి రా కోపం…. ఆలా సిగరేట్ తాగితే హెల్త్ పడవదా…. అయినా ఎందుకు ఇలా సిగరేట్ తాగడం…. నిన్ను కాదు.. మె తాతయ్య ని అనాలి…. ఆయనే కదా నీకు సిగరెట్ అలవాటు నేర్పించింది అని కోపంగా అంటుంది మహాలక్ష్మి గారు.
తనని కాకుండా తాతయ్య ని తిడుతుంటే….. ఏంటి గ్రాని నువ్వు…. ఈ విషయం లో కూడా నువ్వు తాతయ్య నే తిడుతున్నావు… నన్ను తిటయొచ్చు కదా…. నాకు కూడా నన్ను తిడితే ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది… ఒక సరి తిట్టావా గ్రాని అని మహాలక్ష్మి గారిని రూమ్ లో కి తీసుకు వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి…. తన ముందు కింద కూర్చొని…. ఆవిడా వడిలో తలను పెట్టి…. తలకు మసాజ్ చేపించుకుంటూ అంటాడు రామ్.
ఆమ్మో అది అయ్యే పనేనా రామ…. నువ్వు నా ముద్దుల మనవాడివి…. ఈ రాజస్థాన్ కి నువ్వు ఒక యువరాజు వి…. నిన్ను నేను ఎలా అనగలను రామ అని నవ్వుతు అంటారు ఆవిడా.
మాటల్లో నిన్ను ఎవరు గెలవలేరు కానీ….. ఏంటి మ్యాటర్…. నిన్ను తాతయ్య పంపించారా రాయబారానికి…. నువ్వు ఆయాస పడుతూ నా రూమ్ కి వచ్చావా అని చిరు కోపంగా అంటాడు రామ్.
ఆలా ఎం కాదు కన్నా…. అయినా నేను ఎం ఆయాసపడుతూ ఎం రాలేదు… లిఫ్ట్ లో వచ్చాను… అని చిన్న పిల్లల్లా అంటుంది ఆవిడా.
అవునా… నాకే పంచ్ ఆహ్… తమరు 17 కాదు 70 ఏజ్ అది తమరికి గుర్తుకు ఉందా అని లోపల నవ్వును దస్తూ అంటాడు రామ్.
హ్మ్… నాకు తెలుసులే…. నువ్వు ఎం నాకు చెప్పవలసిన అవసరం లేదు లే బుంగ మూతి పెట్టుకుంటుంది మహాలక్ష్మి.
అయ్యో గ్రాని… ఈ వయసులో కూడా ఎంత ముద్దుగా ఉన్నవో తెలుసా…. అసలు నాకు తాతయ్య అడ్డు లేకుండా ఉంటే నేను నిన్నే పెళ్లి చేసుకునే వాడిని అని మహాలక్ష్మి గారి బుగ్గలు గిచుతూ అంటాడు రామ్.
చాలే సంబరం…. ముందు వదులు కన్నా…. నొప్పెడుతున్నాయి అని అనగానే…. వదిలి…. బెడ్ మీద కూర్చొని…. మహాలక్ష్మి గారి వడిలో తల పెట్టుకొని…. పడుకుంటాడు రామ్.
ఇంత ఏజ్ వచ్చిన…. ఈ చిన్న పిల్లాడి చేస్తాలు పోలేదు నీకు అని మురిపెంగ అంటూ రామ్ తల నిమురుతారు ఆవిడా.
నేను జస్ట్ 27 గ్రాని… నేను ఇంకా చిన్న పిల్లాడిని అని ఏమైకంగా పేస్ పెట్టి అంటాడు రామ్.
అవును అవును…. ఇప్పటికి పెళ్లి చేస్తే… ఈ పాటికి నా మానవళ్ళతో మానవరాళ్లతో ఆదుకునే దాన్ని…. అలాంటిది నువ్వు చిన్న పిల్లాడివా అని వెటకారంగా అంటుంది ఆవిడా
పో… గ్రాని… చిన్న పిల్లాడిని చేసుకొని… నాతో ఆడుకుంటున్నావు కదా…. అని అమాయకంగా పేస్ పెట్టి అంటాడు రామ్.
రామ్ చేసే డ్రామా ని చూస్తూ…. నవ్వుతు రామ్ తల నిమురుతాడు ఆవిడా.
కన్నా…. ఒక్క సరి నా మాట విను నాన్న….. పెళ్లి కి రావొచ్చు కదా నాన్న… ప్లీజ్ అని ఆవిడా అనగానే…
అప్పటి వరకు సరదాగా ఉన్న రామ్… ఒక్క సరి గా కోపం తో…. గ్రాని…. నేను ఢిల్లీ వెళ్తున్న… నన్ను విసిగించకు అని తన డ్రెస్ ప్యాక్ చేసుకోవడం లో పడిపోయాడు కోపంగా.
సర్లే నా మాట ఎందుకు వింటావు లే…. నేను వెళ్తున్న…. మళ్ళీ నేను నీతో మాట్లాడాను అని ఎమోషనల్ బ్లక్ మెయిల్ చేస్తారు ఆవిడా.
హుష్….. అని అంటూ…. ఓకే గ్రాని…. ఎక్కడ పెళ్లి… అని అసహనంగా అంటాడు రామ్.
రామాపురం కన్నా…. అని ఆవిడా అనగానే.
వాట్ పల్లెటూరు ఆహ్…. నో నెవెర్… నేను ఆ పెళ్లెటూరి కి రాలేను…. నాకు ఈ పల్లెటూరులు అంటే నే నచ్చథ్…. అలాంటిది.. ఇప్పుడు పెళ్లి కి రావాలి అంటే ఎలా.. నేను అస్సలు రాను తెగేసి చెప్పాడు రామ్.
మహా లక్ష్మి గారు మొకం చిన్నబుచుకునే సరికి….ఓకే ఓకే గ్రాని… పేస్ ఆలా డల్ గా పెట్టకు నేను చూడలేను…. ఇంకో విషయం…. నేను జస్ట్ పెళ్లి కి అటెండ్ ఐ… వెంటనే రిటర్న్ అవుత…. కాదని మళ్ళీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే….. మళ్ళీ నేను అమెరికా కి షిఫ్ట్ అవుత అని రామ్ బ్లాక్ మెయిల్ చేసాడు.
వద్దు వద్దు కన్నా….. ఇన్ని సంవత్సరం నుండి చదువు అని బిజినెస్ అని మాకు దూరంగా ఉన్నావు… ఇంకా ఈ ముసలి ప్రాణం భరించలేదు…. నువ్వు చెప్పినట్టే చెయ్ అని నవ్వుతు అంటారు ఆవిడా.
థాట్స్ మై గ్రాని అని ఆవిడా బుగ్గలు లాగుతాడు రామ్.
ఆవిడా నవ్వుతు బయటకు వెళ్తూ…. తొందరగా రెడీ అవ్వు కన్నా…. ఇంకో గంటలో నువ్వు నేను తాతయ్య మీ అమ్మ మన నలుగురం వెళ్ళాలి అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్లిపోయారు ఆవిడా.
హ్మ్… ఇప్పుడు పెళ్లి కి రెడీ అవ్వాలా…. పెళ్లెటూరి కి వెళ్ళాలి అంటే….. ఎం చేదాం… గ్రాని కి మాట ఇచ్చగా… తప్పుతుందా…. వెళ్ళాలి అని…. టవల్ తీసుకొని వాష్ రూమ్ కి వెళ్ళాడు రామ్.
ప్లీజ్ ఫాలో మీ గయ్స్ 🥰
Swipe left/right or tap the sides to turn pages