నెక్స్ట్ డే…..
మీనాక్షి వంటగదిలో పిల్లలకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తోంది. లక్ష్ మాత్రం హాల్లో కూర్చుని ల్యాప్‌టాప్‌లో తన ఆఫీస్ పనులు చూసుకుంటున్నాడు.
ఇంతలో మీనాక్షి ఫోన్‌కి ఒక కాల్ వచ్చింది.
“హలో… మీనాక్షి గారేనా మాట్లాడేది?” అవతలి వైపు నుంచి ఒక మహిళ గొంతు వినిపించింది.
“అవును చెప్పండి…” అంది మీనాక్షి.
“నేను స్మితను. మీ రేడియో కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. మా సంస్థ తరఫున ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళల విజయగాథలను అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాం. అందులో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం.”