మరుసటి రోజు ఉదయం…
లక్ష్ ఆఫీస్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. మీనాక్షి మాత్రం పిల్లలకు టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంది.
“మీనూ… నేను బయలుదేరుతున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి.”
“సరే లక్ష్… నువ్వు కూడా టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మర్చిపోకు.”
“అలాగే మేడమ్…” అంటూ నవ్వి ఆమె నుదుటిపై ముద్దుపెట్టి బయటకు వెళ్లిపోయాడు.
లక్ష్ వెళ్లిపోయిన తర్వాత పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గరకు వచ్చారు.