New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ నవ్వు కోసం 💞 – 1

నీ నవ్వు కోసం 💞 – 1

హైదరాబాదులో ఒక చిన్న డిజైనర్ కంపెనీలో వర్క్ చేస్తున్న మన హీరో లక్ష్… సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా సింపుల్‌గా సైలెంట్‌గా ఉండే వ్యక్తి…. అతని జీవితంలో పెద్దగా ఎవరు ఉండరు. కాలేజీ తర్వాత ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు. ఫ్యామిలీ మొత్తం ఫారిన్‌లో ఉంటుంది.. రోజు ఆఫీస్‌కి వెళ్లడం, తన పని తాను చేసుకోవడం, మళ్లీ ఇంటికి రావడం ఇదే లక్ష్ జీవితం….

అలాంటి లక్ష్ జీవితంలోకి ఒకరోజు ఆఫీసులో కొత్తగా ఒక డిజైనర్ జాయిన్ అవుతుంది. తనే మన హీరోయిన్ మీనాక్షి… ఆమె నవ్వు చూస్తేనే ఎంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయో తెలియదు కానీ, ఆ నవ్వుకి పడిపోని వాళ్లు మాత్రం ఉండరు….
మీనాక్షిలో అందరికంటే స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటి అంటే ఆమె చిరునవ్వు… ఆమె నవ్వితే చాలు ఎదుటివాళ్లకి తెలియకుండానే వాళ్ల ముఖాల్లో కూడా చిరునవ్వు వచ్చేస్తుంది….
మీనాక్షి ఆఫీస్‌లోకి వచ్చిన తర్వాత లక్ష్ జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి… ఇంతకుముందు ఆఫీస్‌కి వెళ్లడం అంటే తన పని కోసం మాత్రమే వెళ్లేవాడు… కానీ ఇప్పుడు మాత్రం మీనాక్షిని చూడడం కోసమే రోజూ ఆఫీస్‌కి వెళ్లేవాడు….
మీనాక్షి తన వర్క్ చేసుకుంటూ లక్ష్ దగ్గరికి వచ్చిన ప్రతిసారీ బయటకి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉంటాడు కానీ, లోపల మాత్రం చిన్నగా నవ్వుకుంటూ ఉండేవాడు…. తనతో చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశాడు… కానీ అతనికి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే అలవాటు లేకపోవడంతో ఫాస్ట్‌గా మూవ్ అవ్వలేకపోయాడు….
ఒకరోజు మీనాక్షి లక్ష్ దగ్గరికి వచ్చి, “లక్ష్ గారు… ఈ బటన్ వర్క్ చేయడం లేదు. మీరు ఒకసారి చెక్ చేస్తారా?” అని అడుగుతుంది…. పేపర్ మీద ఏదో రాస్తున్న లక్ష్ ఆమె వైపు చూసి, “నేను చూస్తానండి…” అని అంటాడు….
అంతే… మీనాక్షి అతని మొహం వైపు చూడాలని అనిపించినా ఎందుకో సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంటుంది…. అలా ఇద్దరి మధ్య మాటలు తక్కువగానే ఉన్నా చూపులు మాత్రం రోజురోజుకీ ఎక్కువవుతూ ఉంటాయి….
ఒకరోజు రాత్రి అందరూ వెళ్లిపోయాక మీనాక్షి మాత్రం తన ప్రెజెంటేషన్ కంప్లీట్ చేయాల్సి ఉండటంతో అక్కడే ఉండిపోతుంది…. లక్ష్‌కి కూడా వర్క్ కంప్లీట్ కాకపోవడంతో అక్కడే ఉంటాడు….
మీనాక్షిని చూసిన లక్ష్, “ఇంకా మీరు వెళ్లలేదా?” అని అడుగుతాడు…. “లేదు లక్ష్ గారు… ప్రెజెంటేషన్ కంప్లీట్ చేయలేదు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాను…” అని చెబుతుంది….
తర్వాత మీనాక్షి అతని వైపు చూస్తూ, “మరి మీరు ఇంకా వెళ్లలేదు ఏంటి?” అని అడుగుతుంది…. లక్ష్ కొన్ని క్షణాలు ఆమె వైపు చూసి, చిన్నగా నవ్వుతూ, “నువ్వు ఒంటరిగా ఉంటే నాకు వెళ్లాలనిపించడం లేదు… అందుకే…” అని అంటాడు….
ఆ మాటలు వినగానే మీనాక్షి కళ్లల్లో మెరుపు వచ్చి చేరుతుంది…. అతని వైపు చూస్తూ, “ఏమైనా కాఫీ తాగుతారా?” అని అడుగుతుంది…. “మీరు చేసిస్తే తాగుతాను…” అని లక్ష్ నవ్వుతూ సమాధానం చెబుతాడు….
ఇద్దరూ అక్కడే ఉన్న కిచెన్‌లోకి వెళ్లి కాఫీ ప్రిపేర్ చేసుకుని తీసుకుని వచ్చి కూర్చుంటారు…. కాఫీ తాగుతూ విండో దగ్గర నిలబడతారు…. బయట రోడ్డుమీద వెళ్తున్న వెహికల్స్, రోడ్డు లైట్లు, పచ్చని చెట్లు చూస్తూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తారు….
ఇంతలో మీనాక్షి లక్ష్ వైపు చూస్తూ, “లక్ష్ గారు… మీరు చాలా సైలెంట్ కదా… మీకు ఎవరైనా స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నారా?” అని అడుగుతుంది…. లక్ష్ చిన్నగా నవ్వుతూ, “ఉన్నారు…” అంటాడు….
“ఎవరూ?” అని మీనాక్షి ఆశ్చర్యంగా అడుగుతుంది…. “ఉన్నారుగానీ చెప్పలేకపోతున్నా…” అని జోక్‌గా అంటాడు లక్ష్…. “ఎవరు?” అని మళ్లీ అడగడంతో, లక్ష్ మెల్లగా ఆమె వైపు తిరిగి, “మీకు తెలుసుకోవాలనిపిస్తే మీరు తెలుసుకోవచ్చు…” అని అంటాడు….
ఆ మాటకి మీనాక్షి మౌనంగా నవ్వుకుంటూ, “అంటే నేను వెయిట్ చేయాలా?” అని అడుగుతుంది…. కాసేపు లక్ష్ వైపు చూస్తూ, “నేను వెయిట్ చేయొచ్చా?” అని అడుగుతుంది…. లక్ష్ చిన్నగా నవ్వుతూ, “ఓకే…” అని అంటాడు….
అలా ఆరోజు నుండి ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి…. మధ్యమధ్యలో దొరికిన టైమ్‌లో మాట్లాడుకోవడం, సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, కలిసి కాఫీ తాగడం చేస్తూ ఉంటారు….
ఇద్దరూ కలిసి కాఫీ తాగడం, సరదాగా షాపింగ్‌కి వెళ్లడం, ఒకరికొకరు ఎదురుచూసుకోవడం రోజూ జరుగుతూనే ఉంటుంది…. ఒకరోజు వర్షంలో ఇద్దరూ తడుస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తారు…. అలా వాళ్ల ప్రేమ కూడా మెల్లమెల్లగా ఇద్దరి మనసుల్లోకి చేరిపోతుంది….
ఒకరోజు లక్ష్ మీనాక్షికి ఫోన్ చేసి, “మీన… దగ్గరలో ఉన్న కాఫీ షాప్‌కి రాగలవా?” అని అడుగుతాడు…. “ఎందుకు రమ్మన్నారు లక్ష్ గారు?” అని మీనాక్షి అడగగా, “నీతో మాట్లాడాలి మీన…” అని చెబుతాడు….
మీనాక్షి పావుగంటలో కేఫ్ దగ్గరికి వచ్చేస్తుంది…. లక్ష్ ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వి, తన దగ్గర ఉన్న చిన్న రింగ్‌ని తీసి ఆమె చేతికి తొడుగుతాడు….
ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుండగా, “నన్ను నువ్వు ఎప్పటికీ మిస్ అవ్వకూడదు…” అని అంటాడు లక్ష్…. ఆ మాటకి మీనాక్షి కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది….
“లక్ష్ గారు… నాకు వంట అసలు రాదు. ఒక కాఫీ చేయడం మాత్రమే నేర్చుకున్నాను…” అని మీనాక్షి చెబుతుంది…. అది విన్న లక్ష్ నవ్వుతూ, “సరే పర్లేదులే… ఇద్దరం కలిసి నేర్చుకుందాం. డైలీ కలిసి వంట చేసుకుందాం…” అని అంటాడు….
ఆ మాటకి మీనాక్షి కూడా నవ్వుతూ అతని వైపు చూస్తుంది…. అలా ఎవరూ ఊహించని విధంగా మొదలైన లక్ష్, మీనాక్షిల పరిచయం… ఒక అందమైన ప్రేమగా మారుతుంది…. ❤️
మీ చిన్ని ❤️