New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ నవ్వు కోసం 💞 – 3

నీ నవ్వు కోసం 💞 – 3

అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి… కొన్ని రోజుల తర్వాత మీనాక్షి పుట్టినరోజు వస్తుంది…. అదేరోజు ఆఫీస్‌లో ఫ్రెషర్స్ జాయిన్ అవ్వడంతో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి.

కానీ మీనాక్షి డోర్ తీసి లోపలికి రాగానే… అలంకరించిన హాల్ మధ్యలో లక్ష్ కనిపిస్తాడు. అప్పటివరకు ఏం జరుగుతుందో అర్థం కాక మీనాక్షి అలాగే చూస్తూ ఉండిపోతుంది…
లక్ష్ తన దగ్గరికి వచ్చి… “నా లైఫ్‌లో నిన్ను మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు మీనా… నువ్వు, నేను వేరు కాదు… ఇద్దరం ఒకటే…” అని చెబుతూ మోకాళ్లపై కూర్చొని ఆమె చేతిని పట్టుకుంటాడు.
తర్వాత తన చేతిలో ఉన్న రింగ్‌ని ఆమె వేలికి తొడిగి… ఆమె చేతిని ప్రేమగా పట్టుకుంటాడు.
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే… ఇది రెండోసారి లక్ష్ మీనాక్షికి రింగ్ తొడగడం…. మొదటిసారి కాఫీ షాప్‌లో తన ప్రేమను తెలియజేస్తూ రింగ్ తొడిగాడు… ఇప్పుడు అందరి ముందు మరోసారి రింగ్ తొడిగి… మీనాక్షి తన జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేస్తాడు.
మీనాక్షి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది… ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఆఫీస్ స్టాఫ్ అందరూ చప్పట్లతో వాళ్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.
అలా ఆ రోజంతా స్టాఫ్ అందరి మధ్య మీనాక్షి పుట్టినరోజును చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు…. లక్ష్ ఇలాంటి సప్రైజ్ ఇస్తాడని మీనాక్షి అసలు ఊహించుకోదు.
అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు…. పెద్దవాళ్లు ఎవరూ దగ్గర లేకపోవడంతో ఫ్రెండ్స్ అందరి సమక్షంలో, ఆఫీస్ స్టాఫ్ మధ్యలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు.
పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఉండే అపార్ట్మెంట్‌లోనే తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్ అందరూ ఆరోజు వాళ్లతో సరదాగా గడిపి… వాళ్ల కోసం ఇంటిని అందంగా అలంకరించి, వాళ్లకు బెస్ట్ విషెస్ చెప్పి ఒక్కొక్కరుగా వెళ్లిపోతారు.
ఈవెనింగ్‌కి ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రమే ఉండి… మిగతా వాళ్లంతా వెళ్లిపోతారు. నలుగురూ కలిసి భోజనం చేసిన తర్వాత… మీనాక్షిని తన ఫ్రెండ్ దగ్గరుండి వైట్ శారీలో రెడీ చేస్తుంది.
సింపుల్‌గా జ్యువెలరీ పెట్టి, జుట్టులో మల్లెపూలు పెట్టి రెడీ చేస్తుంది. అలా తెల్ల చీరలో మల్లెపూలతో మీనాక్షి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
తనని అలా రెడీ చేసిన ఫ్రెండ్ కూడా… “అమ్మో… నేను ఇలా రెడీ చేస్తుంటేనే ఫ్లాట్ అయిపోతున్నా… ఇంకా లక్ష్ సంగతి ఏంటో!” అంటూ మీనాక్షిని ఆటపట్టిస్తూ ఉంటుంది.
మీనాక్షి సిగ్గుపడుతూ… “అబ్బా… ఊరుకోనే…” అని అంటుంది.
ఇక లక్ష్ ఫ్రెండ్ కూడా లక్ష్‌ని రెడీ చేసి… కొన్ని సరదా టిప్స్ చెప్పి బయటకు వచ్చేస్తాడు.
మీనాక్షి చేతిలో పాల గ్లాస్ పెట్టి… “ఇక నువ్వు వెళ్లి లక్ష్‌ని కలువు… మేం బయట ఉంటాం…” అంటూ ఫ్రెండ్ ఆమెను రూమ్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోతుంది.
రూమ్ దగ్గరికి వచ్చిన మీనాక్షికి లోపలికి వెళ్లాలంటే ఒక్కసారిగా చాలా టెన్షన్‌గా అనిపిస్తుంది. సిగ్గుతో తల కిందకి వాల్చుకుని అక్కడే నిలబడిపోతుంది.
లోపల లక్ష్ దాదాపు పావుగంట వెయిట్ చేసినా మీనాక్షి రాకపోవడంతో… “ఏమైందో?” అనుకుంటూ తనే బయటకు వచ్చి చూస్తాడు.
రూమ్ డోర్ దగ్గర మీనాక్షి కనిపించడంతో… “ఏమైంది మీనా… ఇక్కడే వెయిట్ చేస్తున్నావ్?” అని అడుగుతాడు.
“ఏం లేదు…” అని మీనాక్షి సిగ్గుపడుతూ చెబుతుంది.
ఆమె సిగ్గుపడుతున్న తీరు చూసిన లక్ష్‌కి విషయం అర్థమవుతుంది. వెంటనే ఆమె భుజాలపై చేయి వేసి… “రా…” అంటూ నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్తాడు.
ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్‌ని టేబుల్‌పై పెట్టి… మీనాక్షిని బెడ్‌పై కూర్చోబెడతాడు.
“నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా మీనా?” అని ప్రేమగా అడుగుతాడు.
“కొంచెం టెన్షన్‌గా ఉంది…” అని మీనాక్షి మెల్లగా చెబుతుంది.
“నీకు ఏమైనా ఇష్టం లేకపోతే నాకు చెప్పు… నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను…” అని లక్ష్ అంటాడు.
“అలాంటిదేం లేదు… కొంచెం టెన్షన్ అంతే…” అని మీనాక్షి సిగ్గుపడుతూ చెబుతుంది.
“సరే…” అని లక్ష్ నవ్వుతూ టేబుల్ మీదున్న పాల గ్లాస్ తీసుకొస్తాడు.
“ఇద్దరం కలిసి షేర్ చేసుకుని తాగుదాం…” అని చెబుతాడు.
“అలాగే…” అని మీనాక్షి కూడా నవ్వుతుంది.
ఇద్దరూ ఒకరికొకరు చూస్తూ… నవ్వుకుంటూ ఆ పాలను షేర్ చేసుకుని తాగుతారు. అలా ఆ క్షణంలో ఉన్న టెన్షన్ కాస్త తగ్గిపోతుంది.
“ఇప్పుడు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా మీనా?” అని లక్ష్ అడుగుతాడు.
“ఏం లేదు…” అని మీనాక్షి చిన్నగా నవ్వుతుంది.
లక్ష్ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని… ఆమెతో కాసేపు మాట్లాడుతుంటాడు. ఇద్దరూ తమ కొత్త జీవితం గురించి, రేపటి రోజులు ఎలా ఉండబోతున్నాయో మాట్లాడుకుంటూ ఉంటారు.
మీనాక్షి మాత్రం సిగ్గుతో తల కిందకి వాల్చుకుంటూ ఉంటుంది. లక్ష్ ఆమెని ఆటపట్టిస్తూ నవ్విస్తాడు.
ఆ రాత్రి వాళ్లిద్దరూ తమ మధ్య ఉన్న ప్రేమను, నమ్మకాన్ని మరింత దగ్గర చేసుకుంటూ… కొత్త జీవితాన్ని అందమైన జ్ఞాపకంగా మొదలుపెడతారు.
అలా వాళ్ల ప్రేమకథ… ఒకరికొకరు తోడుగా ఉంటూ, జీవితాంతం కలిసి నడవాలనే మాటతో కొత్త మలుపు తిరుగుతుంది….
చదివి వెళ్లిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్….
మీ Chinni ❤️