పరవశం – 23
మేఘ చెప్పిన మాటలకి విక్రమ్ షాక్ అవుతాడు.. కానీ మేఘ అవేమీ పట్టించుకోకుండా తన ప్రేమ గురించి చెప్తూనే ఉంటుంది..
“తెలుసా ఆ రోజు.. అదే యాక్సిడెంట్ అయిన రోజు, అసలు నేను అక్కడ ఆంటీని చూసి షాక్ అయిపోయాను.. హైదరాబాద్‌లో ఉండాల్సింది ఇక్కడ ఎలా ఉందా అని ఆ షాక్‌లోనే ఉన్నాను..
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఆంటీ నీ వైపు చూపించడంతో పక్కకి చూశాను.. నిన్ను చూడగానే నాకు మరింత షాక్ అనిపించింది..
ఫస్ట్ నువ్వు ఎవరు అనేది అర్థం కాలేదు కానీ.. దగ్గరకొచ్చి చూస్తే ఆంటీ పోలికలు నీలో కనిపించాయి.. అప్పుడు అర్థమైంది ఆంటీ కొడుకువి అని.. నేను ఇన్నాళ్ళు ప్రేమించిన వాడివి అని! నిన్ను అలాంటి పరిస్థితిలో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.. ఒకలాంటి షాక్‌లోకి వెళ్ళిపోయాను..
నువ్వు ‘సేవ్ మీ..’ అని చెప్పావు కదా! వెంటనే తేరుకుని నీ వైపు చూశాను.. అప్పుడు నీకు కాలు దగ్గర బాగా బ్లడ్ కారటం చూసి చాలా భయమేసింది.. వెంటనే నా స్కార్ఫ్ తీసి నీ కాలికి కట్టి నీ వైపు చూశాను..