పరవశం – 25
మేఘ అలా ఏడుస్తూ ఉంటే విక్రమ్‌కి చాలా బాధగా అనిపిస్తుంది.. ఎలా తనని ఓదార్చాలో, “నేను ఎక్కడికీ వెళ్ళను” అని ఎలా చెప్పాలో తెలియక..
వెంటనే మేఘ ఫేస్‌ని రెండు చేతుల్లోకి తీసుకుని పెదవులపై ముద్దు పెడతాడు..
అప్పటివరకు ఏడుస్తూ ఉన్న మేఘ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. వెంటనే తన కళ్ళు తెరిచి చూస్తుంది..
అంత దగ్గరగా ఉన్న విక్రమ్‌ని చూసి ఇప్పటి వరకు జరిగింది అంతా అబద్ధం కాదు, నిజం అని తెలిసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది..
వెంటనే తను కూడా విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి, విక్రమ్ పెట్టే ముద్దుకి సహకారం అందిస్తుంది..