పరవశం – 22
వర్క్ చేసుకుంటున్న విక్రమ్‌కి ఎందుకో ఒక డిఫరెంట్‌గా మనసు అలజడిగా అనిపిస్తూ ఉంటే, వర్క్ చేయలేక ‘ఏమైంది?’ అని అనుకుంటూ ఉంటాడు..
అలా అనుకుంటూ ఉండగానే విక్రమ్ కళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూస్తాయి.. అప్పుడే రాజీతో మాట్లాడుతూ లోపలికి వస్తున్న మేఘని చూడగానే షాక్ అవుతాడు..
ఒక్క క్షణం ‘మేఘ మోడలింగ్ చేస్తోందా?’ అని డౌట్ వస్తుంది.. కానీ అంతలోనే పక్కనే ఉన్న రాజీ వైపు చూసి అర్థం చేసుకుంటాడు..
ఫ్రెండ్‌తో వచ్చింది అని.. వెంటనే రిసెప్షన్‌కి కాల్ చేసి రాజీ డిటైల్స్ తీసుకుంటాడు..
మేఘ, రాజీ ఇద్దరూ ఆడిషన్ రూమ్ వైపు వెళ్ళడం చూసి కావాలని మేఘని వెళ్ళకుండా ఆపేస్తాడు..