పరవశం – 24
రాజీ కోసం బయటకి వచ్చిన విజ్జుకి, రాజీ బయట ఆటో ఎక్కడం చూసి ఫాస్ట్ గా అక్కడికి వస్తాడు..
కానీ అప్పటికే ఆటో వెళ్ళిపోవటంతో విజ్జు వెంటనే తన కార్ తీసుకుని ఆటో వెనకాల ఫాలో అవుతాడు..
ఆటో ఎక్కిన రాజీ మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది..
వెంటనే విజ్జు తనకి కిస్ చేసిన సీన్ కళ్ళ ముందు కదులుతుంది.. వెంటనే కళ్ళు తెరిచి కళ్ళల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకుని బయటకి చూస్తూ ఉంటుంది..
కొంత దూరం వచ్చిన తరువాత ఆటో ఒక్కసారిగా ఆగిపోవటంతో “ఏమైంది?” అని అడుగుతుంది..