ఇద్దరు ఒకేసారి నేలకి ఒరుగుతున్న క్షణం అక్కడికి వచ్చిన వసుమతి గారి కాళ్ళ మీదకి పడ్డాడు అలోక్.
కళ్ళు బిగించి కాళ్ళను వెనక్కి తీసుకుంటు తూలబోతున్న భార్యను రెండు చేతులతో బిగించి పట్టుకొని.. కొడుకులు ఇద్దరి మీద మండిపడ్డారు జై కాంత్.
అటు పక్కగా ఉన్న విరాజ్ ఆవేశంగా అలోక్ కాలర్ బిగించి తల్లి పాదాల నుంచి దూరంగా లాగి పడేస్తే.. బ్యాక్ బౌన్స్ అయిన అలోక్ అంతే వేగంగా విరాజ్ వెన్ను మీద షూ కాలితో మార్కు వదిలాడు.