నా చెలి -1 – 3
“అలా ఎందుకు అంటాను ఎందుకంటే నేను చచ్చిపోయిన మీకు అనవసరం కాబట్టి అలా చేయను అది నా ఇంట్లో దొంగతనం చేసింది అందుకే అక్కడికి పంపిస్తున్నారు అని చెప్తాను “……
“దేవి గారి మాటలకూ అసహ్యం వేసి “ఛీ!! నువ్వు ఎంతకైనా తెగిస్తావ్ బంగారం లాంటి పిల్ల మీద దొంగతనం మోపి ఇబ్బంది పెడదామని చూస్తున్నవ్ నువ్వు ఎప్పటికీ మారవు తొందర్లోనే నీ బడాయి మొత్తం తగ్గిపోతుంది అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు “అని అంటారు…..
” నేను ఏడ్చే రకం కాదు ఏడిపించే రకం ఇంకొకసారి దాన్ని ఇక్కడి నుండి అక్కడికి పంపిస్తా అంటే చెప్పాను కదా అదే చేసి చూపిస్తా అందరూ నా మాట నమ్మేస్తారు ఎందుకంటే నా మాటకి అంత విలువ ఉంటుంది కాబట్టి “……
” నువ్వు ఇంకా మారావ్ నీతో మాటలు అనవసరం కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో నీకు ధాత్రి ఉసురు కచ్చితంగా తగులుతుంది అప్పుడు బాగా అనుభవిస్తావ్ “అని బయటికి వెళ్ళిపోతారు……
దేవి గారు నవ్వుకుని “అది చూద్దాం “అని ఫోన్ పట్టుకొని బెడ్ మీద కూర్చుని రీల్స్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు…..
ధాత్రి చేతికి ఉన్న గాయాన్ని లెక్కచేయకుండా వంట చేయడంలో బిజీ అయిపోతుంది…
నందు ఫ్రెష్ అయి కిచెన్ లోకి వచ్చి ” వదిన నేను చెప్పాను కదా ఈరోజు వంట నేను చేస్తానని చేతికి దెబ్బ ఉన్న సరే లెక్క చేయకుండా అలా చేసేస్తున్నవ్ అది ఇంకా పెద్దది అయిపోతుంది “అని అంటుంది…
” ఏం పర్వాలేదు నందు నువ్వు ఇప్పుడే కదా కాలేజ్ నుండి వచ్చు మళ్ళీ వంట చేయడం ఎందుకు అయినా అంత పెద్ద దెబ్బ ఏమి కాదు తొందరగానే తగ్గిపోతుంది నువ్వు కూర్చో “……
” చెప్తే వినవు ఏంటి వదిన కనీసం కూరగాయలు అన్న కట్ చేస్తాను ఇటు ఇవ్వు “అని ధాత్రి చేతిలో నుండి చాక్ తీసుకుంటుంది…..
దేవి గారు మళ్ళీ వచ్చి ఎక్కడ తిడతారో అని భయం భయంగానే చూస్తూ డోర్ వైపే చూస్తూ ఉంటుంది ధాత్రి……
” వదిన నువ్వు కంగారు పడకు అమ్మ ఇప్పుడు అప్పుడే బయటకు రాదు ఫోన్ పట్టుకుని కూర్చుంది డిన్నర్ టైం కి పిలిస్తే బయటకు వస్తుంది నువ్వు అదంతా వదిలేసి ఫ్రీ గా ఉండు “అని అంటుంది…..
ధాత్రి నవ్వి వంట పూర్తి చేసిన తర్వాత “నందు అత్తయ్య వాళ్ళని పిలుస్తావా భోజనం వండిస్తాను “అని అంటుంది…..
“హ సరే “అని నందు వెళ్లి దేవి గారిని పిలుస్తూ “డాడ్ ఎక్కడ మామ్ “అని అంటుంది…..
“నాకేం తెలుసు మీ డాడ్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పి వెళ్తే తెలుస్తుంది “అని అంటూ ఉండగానే కిషోర్ గారు లోపలికి రావడం చూసి నందు ఎదురు వెళ్తూ “డాడ్ ఎక్కడికి వెళ్లారు “అని అడుగుతుంది……
” ఇంట్లో ప్రశాంతంగా లేదని బయట ఉంటుందని వెళ్లాను రా కాసేపు వాక్ చేసి వచ్చాను అంతే పదా డిన్నర్ చేద్దాం “అని అంటారు……
దేవి గారు కోపం గా చూస్తూ “అవును లే ఇంట్లో ప్రశాంతం ఎక్కడ ఉంటుంది ఇలాంటి మనుషులు చుట్టూ ఉంటే “అని ధాత్రి చూస్తూ అంటారు……
కిషోర్ గారు సీరియస్ గా చూసి “ధాత్రి తొందరగా పెట్టు తల్లి తినేసి వెళ్లి పడుకోవాలి చాలా చిరాగ్గా ఉంది “అని అంటారు…..
“సరే మావయ్య “అని ముగ్గురికి పెడుతూ ఉంటుంది……
“నువ్వు కూడా కూర్చో మళ్ళీ వేరేగా ఎందుకు “అని అంటున్న కిషోర్ గారిని చూసి “అది కూర్చోదు “అని అనుకుంటూ ఉంటారు…..
దేవి గారి వైపు చూసి “ధాత్రి నువ్వు కూర్చో “అని బలవంతం గా కూర్చోపెట్టి ప్లేట్ లో ఫుడ్ పెడతారు…..
“మేము తిన్న తర్వాత మిగిలిన మెతుకులు నువ్వు తినాలి మాతో కూర్చునే అర్హత నీకు లేదు “అని ఒకసారి దేవి గారు అన్న మాటలు గుర్తు వచ్చి భయం గా తినకుండా చూస్తూ ఉంటుంది ధాత్రి….
ధాత్రి అలా తినకుండా ఉండడం చూసి “వదిన నువ్వు తింటేనే నేను తింటా లేదంటే తినను “అని అంటుంది నందు……
నందు నీ చూసి “అయ్యో వద్దు నందు నేను తింటాను నువ్వు తిను “అని అంటుంది…..
దేవి గారు నందు నీ కోపంగా చూసి ” ఇది ఎప్పటినుండి రోజు రోజుకి ఇంట్లో వేషాలు బాగా ఎక్కువ అవుతున్నాయి చూస్తూనే ఉన్నాను. నీ తిక్క తొందరగానే కుదిరిస్తా జాగ్రత్త గా ఉండు “అని హాండ్స్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు…..
” ఎందుకు నందు నువ్వు ఇలా చేసి అత్తయ్యతో తిట్లు తింటావు నేను తర్వాత తింటాను కదా “….
” పర్లేదులే వదిన అమ్మ నన్ను ఏమీ అనదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఏదో నువ్వు ఉన్నావని అలా అన్నది అంతే నువ్వు వదిలేసి భోజనం చేయి మధ్యాహ్నం కూడా తినుండవు నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది “…..
” లేదు నేను తిన్నాను నందు “అని అంటున్న ధాత్రి నీ చూసి ” సరే తల్లి తిన్నాను అంటున్నావు కదా ఇప్పుడు కూడా తిను మాకోసం “అని అంటారు కిషోర్ గారు…..
భోజనాలు కంప్లీట్ అయ్యాక ధాత్రి కిచెన్ సర్దుతూ ఉంటే కిషోర్ గారు, నందు హాల్లోనే ఉంటారు…..
దేవి గారు బయటికి వచ్చి “ఏయ్ నువ్వు ఇంకా పడుకోలేదా రేపు కాలేజ్ కి వెళ్ళాలి గుర్తుందా నేను వచ్చే వరకు లేవకుండా ఉన్నావు అంటే ఈసారి నార్మల్ గా లేపను “అని అంటూ కిషోర్ గారిని చూసి ” రేపు నా కొడుకు వస్తున్నాడు మార్నింగ్ ఎయిర్పోర్ట్ కీ వెళ్లి తీసుకు రండి “అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు……
దేవి గారు లోపలికి వెళ్ళగానే ” డాడ్ రేపు అన్నయ్య వస్తున్నాడు అంట చాలా రోజుల తర్వాత అన్నయ్యని చూస్తాం ఎలా ఉన్నాడో ఏంటో నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది తొందరగా తెల్లారి పోతే బాగుండు నేను కూడా వస్తాను మీతో పాటు ఎయిర్పోర్ట్ కి, చదువు కోసం మనందరినీ వదిలి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాడు “అని ఆనందం గా అంటుంది…..
“సరే సరే ఇప్పుడైతే వెళ్లి పడుకో మళ్లీ మీ మామ్ వచ్చిందంటే మళ్ళీ గొడవ చేస్తుంది “…..
“హ సరే ఒక్క నిమిషం “అని కిచెన్ దగ్గరికి వెళ్లి ప్లేట్స్ పక్కన పెడుతున్న ధాత్రి నీ చూసి “వదిన “అని పిలుస్తుంది……
“హ చెప్పు నందు ఏమైనా కావాలా “…..
” నాకేం వద్దు కానీ రేపు మా అన్నయ్య అదే నీ బావ విధ్వర్ రామ్ గారు వస్తున్నారు అంట “అని ధాత్రి ఫేస్ చూస్తూ చెప్తుంది……
తన బావ వస్తున్నాడు అనగానే చాలా సంతోషం వచ్చేసి “అవునా ఎప్పుడు “అని హ్యాపీనెస్ నీ బయట పెట్టకుండా నార్మల్ గా అడుగుతుంది……
“రేపు మార్నింగ్ “……
“హో అవునా నందు సరే పడుకో రేపు మళ్ళీ కాలేజీ కి లేట్ అవుతుంది “…..
” నువ్వు ఎంతో హ్యాపీ అవుతావని నేను వచ్చి నీకు ఈ న్యూస్ చెప్తే నువ్వేంటి వదిన అవునా అంటావు నువ్వు నాకు అర్థం కావు “అని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది……
ధాత్రి హ్యాపీ గా ” రేపు బావ వస్తున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది నందు కానీ నేను ఆ ఆనందాన్ని బయట పెట్టను ఎందుకంటే నేను ఏమైనా అనుకుంటే అది జరగదు అందుకే అనుకోను “అని మొత్తం సర్ది బయటికి వస్తూ ఉంటుంది……
కిషోర్ గారు కూడా రూమ్ లోకి వెళ్తూ ” గుడ్ నైట్ తల్లి”అని నవ్వి ధాత్రి నుదిటి మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోతారు…..
ధాత్రి రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకుని తన బావ చిన్నప్పుడు “దూత…..దూత ” అని పిలవడం గుర్తు వచ్చి నవ్వుకుని ” నేను బావ కీ అసలు గుర్తు ఉన్నానో లేదో చిన్నప్పుడు బాగానే మాట్లాడేవాడు తర్వాత తర్వాత కొంచెం మాట్లాడేవాడు ఇప్పుడు అసలు గుర్తు లేనేమో, బావ పెద్దవాడు అయినా తర్వాత ఒక్కసారి చూసా అది కూడా ఊర్లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చూడనే లేదు రేపు చూస్తా నా బావ నీ “అని నవ్వుకుంటూ ఉంటుంది……
ధాత్రి అలా నవ్వుకుంటూ ఉండగానే రూమ్ లోకి వస్తారు దేవి గారు…..
దేవి గారిని చూడగానే లేచి నుంచుని “అత్తయ్య ఏమైనా కావాలా “అని అంటుంది…..
” రేపు నా కొడుకు వస్తున్నాడు “…..
“హ అత్తయ్య నందు చెప్పింది “……
“చెప్తుంది ఎందుకు చెప్పదు “అని అంటూ ” రేపు నా కొడుకు వస్తున్నాడని నీకు ముందే తెలుసు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను, నా కొడుకు ముందు పదే పదే తిరుగుతూ ఉండకూడదు నువ్వు అలా తిరిగి వాడిని బుట్టలో వేసుకుందామని అనుకుంటున్నావేమో నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేసిన ఊరుకునేది లేదు. నువ్వు నా కొడుకుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిన్నప్పుడు నాతో బాగానే ఉన్నాడు ఇప్పుడు కూడా ఉంటాడు అని వాడితో చట్టపట్టాలు వేసుకొని తిరుగుదామని అనుకుంటే మాత్రం పాతేస్తా, వాడికి మాయమాటలు చెప్పి లవ్ లో పడేసి నా ఆస్తి మొత్తం కొట్టేద్దామని ఏమైనా ప్లాన్స్ వేసావో నా సంగతి నీకు తెలుసు కదా ఊరుకోను “అని సీరియస్ గా అంటారు……
” అయ్యో అత్తయ్య నేను ఎందుకు అలా చేస్తాను నా గురించి మీకు తెలియదా “అని ఏడుస్తూ అంటుంది……
” ఇలా మాటికి ముందు ఏడ్చి చిరాకు తెప్పించకు, నా కొడుక్కి చాలా పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి నువ్వు వాడి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా నీ లిమిట్స్ నువ్వు ఉండు అర్థమైందా “…..
” నేను ఇలా నీ దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు అన్ని మీ మావయ్యకు గాని తెలిసిందో మరుక్షణం నువ్వు ఇంటి బయట ఉంటావు నేను అన్నంత పని చేస్తాను వదిలేదే లేదు జాగ్రత్త “అని ధాత్రి రూమ్ నుండి బయటకు వచ్చేస్తారు……
దేవి గారు బయటికి వెళ్ళగానే ధాత్రి ఏడుస్తూ ” నా గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నారు అత్తయ్య నేనెందుకు బావ విషయంలో అలా ప్రవర్తిస్తాను మీరు చెప్పినట్టే నేను బావకి దూరంగానే ఉంటాను. నా హద్దులు నాకు తెలుసు అత్తయ్య మీరు ఏమీ కంగారు పడకండి. మీరు కోరుకున్నట్టే బావకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి నేను మీకు అడ్డు రాను రానే రాను “అని అనుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది…..
ఇంకా ఉంది……
Swipe left/right or tap the sides to turn pages