నా చెలి -1 – 2
మార్నింగ్ నుండి అలిసిపోయి గాఢ నిద్రలో ఉన్న ధాత్రి కీ వాళ్ళ అత్తయ్య డోర్ కొట్టింది వినిపించదు……
దేవి గారు కోపం గా ధాత్రి రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడుకుని ఉన్న తనని లాగి కింద పడేసి చెంప మీద గట్టిగా కొడతారు…….
ధాత్రి భయపడుతూ లేచి నుంచుని ఏడుస్తూ ఉంటుంది……
” నువ్వెందుకే ఏడుస్తున్నావ్ నిన్ను భరిస్తున్నందుకు రోజు నేను ఏడవాలి, పని పాట ఏమీ లేకుండా చక్కగా నిద్రపోతున్నావా ఎన్నిసార్లు డోర్ కొట్టాలి, కొట్టి కొట్టి అదే పోతుందిలే అని చెప్పి ఇలా పడుకున్నావు కదా “అని సీరియస్ గా అంటారు……
” అది కాదు అత్తయ్య మార్నింగ్ తొందరగా లేచాను కదా నిద్ర వచ్చేసింది మెలుకువ రాలేదు క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను ఈ ఒక్కసారి క్షమించండి “అని ఏడుస్తూ అంటుంది…….
” మార్నింగ్ తొందరగా లేస్తే రోజంతా పడుకోమని ఎవరు చెప్పారు నీకు, ఇలా కాదు ఇప్పుడు వదిలేస్తే నువ్వు తర్వాత కూడా ఇలానే చేస్తావ్ “అని ధాత్రి నీ భరాభరా కిచెన్ లోకి లాక్కొని వెళ్తారు….
ధాత్రి భయపడుతూ ” అత్తయ్య ఈ ఒక్కసారికి వదిలేయండి ఇంకెప్పుడూ చేయను ప్లీజ్ “అని అంటున్న దేవి గారు వినిపించుకోకుండా స్టవ్ మీద అట్లకాడ పెట్టి ధాత్రి అరచేతిలో పెట్టేస్తారు……
దేవి గారి చేతిలో నుండి తన చేతిని తీసుకుని ఏడుస్తూ అక్కడే కూర్చుండి పోతుంది ధాత్రి……
“ఏయ్ ఇంకెప్పుడు ఇలా చేయకుండా ఇదే నీకు పనిష్మెంట్ కాదని ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే ఈసారి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది “అని రూమ్ లోకి వెళ్తూ ” అలానే మూలనా కూర్చుని ఏడుస్తూ ఉండకుండా నేను ఫ్రెష్ అయి వస్తాను లంచ్ పెట్టు “అని రూమ్ లోకి వెళ్తారు……
ధాత్రి ఏడుస్తూ లేట్ చేస్తే మళ్లీ ఇంకేం చేస్తుందో అని కిచెన్ నుండి బయటికి వచ్చి టేబుల్ దగ్గర నుంచుని ఉంటుంది……
దేవి గారు ఫ్రెష్ అయ్యి “తొందరగా పెట్టు “అని హడావిడి చేస్తూ ఉంటారు…..
ధాత్రి కాలిన చేతితో పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే “ఏయ్ అంత ఇష్టం లేకుండా పెడుతున్నావ్ నీ డబ్బులతో చేసిన వంటా ఏంటి నాకు ముష్టి వేయడానికి అవతలకి పో, నా ఇంట్లో ఉంటూ నా మీద పెత్తనం చేయాలనీ చూస్తే ఊరుకోను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు “అని ధాత్రి నీ వెనక్కి తోస్తారు…..
ధాత్రి బాధపడుతూ పక్కన నిలబడి ఉంటుంది……
ధాత్రి వైపు చూసి “ఆలా నా ముందు నుంచుని నా తిండికి దిష్టి పెడుతున్నావా వెళ్ళు ఇక్కడ నుంచి నేను తినేసిన తర్వాత పిలుస్తాను ప్లేట్ తీయడానికి ఇప్పుడు అయితే నా ముందు నుంచి వెళ్ళిపో “అని అరుస్తారు…….
“అలాగే అత్తయ్య “అని లోపలికి వెళ్తున్న ధాత్రి నీ చూసి “వెళ్ళిపో అంటే లోపలికి వెళ్లి పడుకుందాం అని అనుకోకు ఇంకోసారి నువ్వు పడుకోవడం చూశానో నీకు ఉంటుంది ఆ పక్కన ఉండు “అని అంటారు……
ధాత్రి చేతిని చూసుకుంటూ నొప్పిని భరిస్తూ మౌనంగా మనసులోనే ఏడుస్తూ ఉంటుంది……
ఒక అరగంట తర్వాత తినడం పూర్తి చేసి ” ప్లేట్ తీయ్ “అని హాండ్స్ వాష్ చేసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతారు……
ధాత్రి ప్లేట్ తీసుకుని కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ కడుగుతుంటే అరచేతిలో ఉన్న గాయం వల్ల అది ఇంకా మంట పుట్టి నొప్పి నీ భరిస్తూ ప్లేట్ కడిగి హాల్ లోకి వస్తుంది.టిఫిన్ కూడా సరిగ్గా చేయనందువల్ల ఆకలి వేస్తున్న పట్టించుకోకుండా బార్నల్ కోసం వెతుకుతూ ఉంటుంది…….
దేవి గారికి హాల్ లో సౌండ్ కీ చిరాగ్గా బయటికి వచ్చి ” ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నవ్ ప్రశాంతంగా పడుకోనివ్వవా “అని అరుస్తారు……
” అది కాదు అత్తయ్య బార్నల్ కోసం చూస్తున్నా “అని భయం గా సమాధానం చెప్తుంది……
” ఇప్పుడు అది రాసుకోకపోతే చచ్చిపోతావా నాకు మళ్ళీ సౌండ్ వినిపించిందో నేనేం చేస్తానో నాకే తెలియదు ” అని ధాత్రికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్లి డోర్ గట్టిగా వేస్తారు……
ధాత్రి కీ చెయ్ నొప్పిగా ఉన్న సోఫా లో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటుంది…….
దేవి గారు ఒక్కసారే డోర్ ఓపెన్ చేసి ” ఇలా నట్టింట్లో కూర్చుని ఏడ్చి ఏం చేద్దామని ఇప్పుడు ఎవడు పోయాడని అలా ఏడుస్తూ కూర్చున్నావ్, మీ మామయ్య వచ్చేవరకు ఇలా ఏడుస్తూనే ఉందామని అనుకుంటున్నావా నీతో నేను పడలేక పోతున్న ఈ దరిద్రం నాకు దాపురించింది ఛ!!ఎప్పుడు పోతుందో ఏంటో “అని అంటారు……
ధాత్రి అలానే ఏడుస్తూ ఉండడం తో “ఏయ్ నీ రూమ్ లోకి పో ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఇలానే ఏడుస్తూ ఉంటే ఇంకో చేతి మీద మాత్రమే కాదు ఒళ్ళంతా వాతలు పెడతాను “అని అంటారు…..
ధాత్రి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సాయంత్రం వరకు అసలు బయటికి రాకుండా రూమ్ లోనే ఉండిపోతుంది…….
కిషోర్ గారు, నందు ఇద్దరు ఇంటికీ వచ్చేస్తారు.ఇంటికి రాగానే ఎదురు వచ్చి మంచినీళ్లు ఇచ్చే దాత్రి ఈరోజు కనబడకపోయేసరికి ఎదో జరిగింది అని అనిపిస్తున్న సైలెంట్ గా సోఫా లో కూర్చుంటారు…….
కిషోర్ గారు ఎదురు చూసి ఇంకా రాకపోయేసరికి “తల్లి ధాత్రి ఎక్కడ ఉన్నావ్ మంచి నీళ్లు కావాలి రా “అని అంటారు……
రూమ్ లో కూర్చుని ఏడుస్తున్న ధాత్రి కీ వాళ్ళ మావయ్య మాట వినిపించగానే పరుగున బయటికి వచ్చి “సారీ మావయ్య టైం చూసుకోలేదు ఇప్పుడే తీసుకు వస్తా “అని చేతి కీ ఉన్న గాయాన్ని లెక్కచేయకుండా కిచెన్ వైపు వెళ్తుంది……
ధాత్రి ఫేస్ చూసి “డాడ్ వదిన ఫేస్ చూసారా ఎలా ఉందో, మామ్ వచ్చేసిందా ఏమైనా అని ఉంటుంది అందుకే పాపం వదిన బాధపడుతూ రూమ్ లోనే ఉండిపోయింది “అని అంటుంది నందు……
” ఎప్పుడు మనం వచ్చే ముందే మన ముందుండే ధాత్రి ఈరోజు లేదంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేమా మీ మామ్ ఎప్పుడు ఏదోకటి అనకుండా ఉండదు పాపం ఆ పిచ్చి తల్లి కాబట్టి ఓపిగ్గా భరిస్తుంది “అని ధాత్రి బయటికి రావడం చూసి మాటలు ఆపేస్తారు…..
ధాత్రి చేతిని కవర్ చేసుకుంటూ ఎడమ చేతితో వాటర్ అందిస్తూ ఉంటుంది…….
ధాత్రి చేతి నీ కవర్ చేసుకోవడం చూసి బాటిల్ తీసుకుంటూ “ఏంట్రా ఎప్పుడు లేనిది ఆ చేతితో వాటర్ ఇస్తున్నావ్ ఈ చెయ్ దాచుకుంటున్నావ్ ఏమైంది “అని అంటారు…..
“అవును వదిన ఏమైంది నీ ఫేస్ కూడా డల్ గా ఉంది “అని అంటుంది నందు……
“నాకేం అవుతుంది నందు పడుకున్నాను కదా అందుకే ఆలా ఉంది “అని నవ్వుతుంది…..
“ధాత్రి ముందు చెయ్ చూపించు “అని అంటారు కిషోర్ గారు….
“ఏంలేదు మావయ్య వంట చేస్తుంటే చిన్నగా కాలింది అంతే “అని అంటుంది……
“కాలిందా ఏది చూడని “అని ధాత్రి నీ సోఫా లో కూర్చోపెట్టి చెయ్ చూస్తారు……
“మావయ్య పెద్ద గాయం కాదు వదిలేయండి నేను వంట చేసి వస్తా “అని అంటున్న వినిపించుకోకుండా ధాత్రి అరచేయ్ చూసి “వంట చేస్తుంటే అరచేతిలో ఎలా కాలుతుంది ధాత్రి “అని అంటారు……
“అది మావయ్య పొరపాటున వేడి గిన్నె పట్టేసుకున్నాను అంతే “……
ధాత్రి అబద్దం చెప్తుంది అని అర్ధం అయ్యి “నందు ఆ టేబుల్ మీద బార్నల్ ఉంది తీసుకురా “అని అంటారు……
“మావయ్య ఎమ్ కాలేదు చిన్న గాయమే “అని అంటున్న ధాత్రి నీ చూసి “ఎందుకు తల్లి అబద్దం చెప్తున్నావ్ నేను ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా ఇది మీ అత్తయ్య పని అని నాకు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నావ్ అంత పరాయివాడిని అయిపోయాను కదా, ఇవ్వన్ని చూస్తున్న ఎమ్ చేయలేని ఈ మావయ్య నీ క్షమించు తల్లి “అని బాధగా అంటారు……
“మావయ్య ఏంటి మీరు అత్తయ్య వల్ల కాదు నేనే చూసుకోలేదు “……
“సరే నమ్ముతున్న “అని సైలెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు…..
“వదిన ఈ చేతితో నువ్వు వంట ఎలా చేస్తావ్ ఈరోజు నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో “అని అంటూ ఉండగానే దేవి గారు బయటికి వచ్చి “ఎమ్ జరుగుతుంది ఇక్కడ “అని అరుస్తారు……
దేవి గారిని చూడగానే ధాత్రి సోఫా లో నుండి లేచి “నేను వంట చేస్తాను “అని అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది…….
కిషోర్ గారు దేవి గారిని కోపం గా చూస్తూ రూమ్ లోకి వెళ్ళిపోతారు……
నందు కూడా లోపలికి వెళ్తుంటే “ఏంటి రాగానే మొదలు పెట్టారు వచ్చిన వెంటనే ఫ్రెష్ అవ్వాలి అని తెలీదా “అని వెనుకే వెళ్తూ అంటారు…..
నందు చిరాగ్గా చూసి “నాకు తెలుసు “అని మొఖం మీదే డోర్ వేసేస్తుంది…….
దేవి గారికి కోపం వచ్చి “దీనికి బాగా ఎక్కువ అయింది తగ్గిస్తా “అని అనుకుంటూ రూమ్ లోకి వెళ్తారు……
దేవి గారిని చూసి కిషోర్ గారికి ఇంకా కోపం పెరిగి” నీకు కొంచమైనా బుద్ధుందా ధాత్రి నీ ఎందుకలా హింసిస్తున్నావ్ నీకేం పాపం చేసింది నీ కూతురు లాంటిదే కదా ఆ మాత్రం జాలి లేదా అలా చేస్తున్నావ్ “అని అంటారు…..
” నా కూతురుతో దాన్ని కలపకండి నా కూతురు మహారాణి ఇంకొకసారి ఇలా మాట్లాడితే బాగోదు చెప్తున్నా “…….
” నీకు ధాత్రి తో అంత ప్రాబ్లం ఉంటే తనని ఇక్కడ నుండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అక్కడైనా హ్యాపీగా ఉంటుంది. ఇలా తనని రోజు ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోను “…..
దేవి గారు కంగారు గా ” అలా ఎలా పంపిస్తారు అది ఇక్కడి నుండి వెళ్ళిపోతే పనులు ఎవరు చేస్తారు. ఈరోజు నుండి తనని ఏమీ అనను ఇక్కడే ఉండనివ్వండి అంతేగాని ప్రతిసారి ఇలా పంపించేస్తాను అని బెదిరించకండి “అని అంటారు…
“చూస్తాను నువ్వు ఎలా ఉంటావో “…..
” మీరు అంత ఊహించుకోకండి మీరు దాన్ని ఇక్కడి నుండి పంపించడానికి చూస్తే నేను ఏమి చేయడానికైనా అయినా సిద్ధంగా ఉంటాను అది గుర్తుపెట్టుకోండి మీకు తెలుసు కదా నా గురించి “….
“ఏంచేస్తావ్ నువ్వు మహా అయితే చచ్చిపోతాను అంటావు అంతే కదా “…..
” అలా ఎందుకు అంటాను ఎందుకంటే నేను చచ్చిపోయిన మీకు అనవసరం కాబట్టి అలా చేయను అది నా ఇంట్లో దొంగతనం చేసింది అందుకే అక్కడికి పంపిస్తున్నారు అని చెప్తాను “……
ఇంకా ఉంది……
Swipe left/right or tap the sides to turn pages