నా చెలి -1 – 1
“ఒసేయ్ ధాత్రి ఎక్కడ చచ్చావే మహారాణి లాగా పొద్దు పోయే వరకు నిద్ర పోతూనే ఉంటావా “అని పూర్తిగా తెల్లవారక ముందే తిట్లు మొదలు పెడతారు ధాత్రి వాళ్ళ అత్తయ్య దేవి గారు……
“హ వస్తున్న అత్తయ్య “అని గదిలో నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది ధాత్రి…….
ధాత్రి నీ చూడగానే ఇంకా కోపం పెరిగి ” పొద్దున్నే పనులు చేయాలని తెలీదా గదిలో ఉండి ముస్తాబవుతున్నావా “అని సీరియస్ అవుతారు…..
ధాత్రి భయపడుతూ ” అది కాదు అత్తయ్య ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అందుకే తెల్లవారుజామున గుడికి వెళ్లి వచ్చాను “అని సమాధానం చెప్తుంది….
“ఆహా అవునా పొద్దున్నే గుడికి వెళ్లి నా జాతకం మారిపోవాలి ఈ దెయ్యం లాంటి అత్తయ్య నుండి దూరంగా వెళ్ళిపోవాలి నాకు తొందరగా పెళ్లి అయిపోవాలి అని పిచ్చిపిచ్చి కోరికలు కోరి వచ్చి ఉంటావు అంతేనా “…
” అలాంటిది ఏమీ కాదు అత్తయ్య “అని అంటున్న ధాత్రి ముందు చెయ్ పెట్టి ” ఇంక చాలు ఆపు నీ సోది వినటానికి నాకు టైం లేదు వెళ్లి ముందు టిఫిన్ ప్రిపేర్ చెయ్, అడగడం ఆలస్యం సోది చెప్పడానికి రెడీగా ఉంటావు వెళ్ళు ఇక్కడ నుండి “అని అంటారు……
ధాత్రి తల ఊపి కిచెన్ లోకి వెళ్తూ ఉండగా దేవి గారు చిటిక వేసి ” ముందు కాఫీ పట్రా ఆ తర్వాత టిఫిన్ ప్రిపేర్ చెయ్ “అని రూమ్ లోకి వెళ్లి పోతారు…..
ధాత్రి బాధపడుతూ కిచెన్ లోకి వెళ్లి ముందుగా కాఫీ పెట్టి వాళ్ళ అత్తయ్య గది వైపు వెళ్లి డోర్ కొడుతుంది……
దేవి గారు వాష్ రూమ్ లో ఉంటే కిషోర్ గారు ( ధాత్రి కీ సొంత మేనమామ, దేవి గారి హస్బెండ్ )డోర్ ఓపెన్ చేసి ధాత్రి నీ చూసి “ఏరా ధాత్రి ఇప్పుడే అనుకుంటున్న నువ్వు ఇంకా నాకు కనిపించలేదు అని అంతలో నువ్వే వచ్చావ్,నీ చేతి కాఫీ తాగక పొతే నాకు రోజే గడవదు తల్లి “అని అంటూ ధాత్రి తల నిమిరి కాఫీ తీసుకుంటారు…….
ధాత్రి హ్యాపీ అవుతూ “నేను వెళ్లి టిఫిన్ చేస్తా మావయ్య “అని అంటుంది……
“హ వెళ్ళు తల్లి “అని అంటూ ఉండగానే దేవి గారు బయటికి వస్తూ “కాఫీ ఇచ్చావ్ కదా ఇంకా అక్కడ ఏంచేస్తున్నావ్ పో తొందరగా టిఫిన్ చెయ్ నాకు లేట్ అవుతుంది “అని కోపం గా అంటారు……
“హ వెళ్తున్న అత్తయ్య “అని అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్తున్న ధాత్రి నీ చూసి “నువ్వు ఎప్పుడు ధాత్రి నీ ఏమీ అనకుండా ఉండలేవు కదా ఎందుకు ఎప్పుడు చూసినా తనని బాధ పెడుతూ ఉంటావు మారవా నువ్వు “అని అంటారు కిషోర్ గారు……
కిషోర్ గారి వైపు చూసి మళ్ళీ మిర్రర్ లో మొఖం పెట్టేసిన దేవి గారిని చూసి కోపం, చిరాకు వచ్చి కప్ పక్కన పెట్టి విసుగ్గా వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతారు…
కిషోర్ గారు వెళ్ళిపోయినా తర్వాత “నేను మారను ఇలానే ఉంటా “అని అనుకుని తన కూతురు నందిని దగ్గరికి వెళ్తారు……
దేవి గారు వెళ్లి చూసేసరికి దుప్పటి నిండుగా కప్పుకుని ఫుల్ స్లీప్ లో ఉన్న నందిని నీ చూసి “బంగారం లేరా చాలా టైం అవుతుంది కాలేజీ కీ లేట్ అవుతుంది కావాలంటే ఇంటికీ వచ్చిన తర్వాత చక్కగా నిద్రపో నిన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు అయితే లేమ్మా “అని కూతురు నీ గారాబం చేస్తూ లేపుతూ ఉంటారు……
“ప్చ్ మమ్మీ ఏంటి నువ్వు పడుకోనివ్వవా నన్ను, ఈరోజు కాలేజీ కీ వేళ్ళను పడుకోనివ్వు ” అని మళ్ళీ దుప్పటి ముసుగు వేస్తూ ఉంటుంది……
“ఏ ఎందుకు వెళ్ళావ్ వెళ్ళు లే ముందు ” అని బలవంతంగా లేపుతారు……
తల్లి వైపు కోపం గా చూస్తూ డ్రెస్ తీసుకోని వాష్ రూమ్ వైపు వెళ్తూ “వదిన నీ స్ట్రాంగ్ కాఫీ పెట్టమని చెప్పాలి, ఈ అమ్మ ఉందే ప్రశాంతం గా నిద్ర కూడా పోనివ్వదు “అని అనుకుంటూ వెళ్తుంది…..
నందిని వాష్ రూమ్ వైపు వెళ్ళగానే బయటికి వచ్చి కిచెన్ లో ఉన్న ధాత్రి నీ చూస్తూ ” ఇంకా ఎంతసేపు, టిఫిన్ రెడీ చేయడానికి ఇంత సేపా? ఎంతమందికి వండుతున్నావ్ “అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అంటారు……
“హ వస్తున్న అత్తయ్య అయిపొయింది “అని కంగారు గా కిచెన్ నుండి బయటికి వచ్చి తను రెడీ చేసిన పెసరట్టు ఉప్మా నీ సర్వ్ చేస్తూ ఉంటుంది……
“అత్తయ్య!! మావయ్య నీ నందు నీ పిలవనా “అని భయం గానే అడుగుతుంది……
” వాళ్లు రెడీ అయితే బయటకు వస్తారు కదా లేదంటే నువ్వు పిలిస్తే గాని బయటకు రాము అని ఏమైనా చెప్పారా నోరుమూసుకుని చట్నీ వేయ్ “అని అంటారు…….
“హ సరే అత్తయ్య “అని చట్నీ వేస్తుంటే పొరపాటున చేతి మీద పడుతుంది…..
దేవి గారికి కోపం వచ్చి “కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు ఆ మాత్రం తెలీడం లేదా ఏదోకటి చేసి ఎందుకు విసుగు తెప్పిస్తావ్ “అని అంటారు…..
“సా… సారి అత్తయ్య చూసుకోలేదు ఇంకెప్పుడు ఇలా చేయను “……
ధాత్రి వైపు సీరియస్ గా చూసి ఫోన్ చూసుకుంటూ పెసరట్టు తినడంలో బిజీ గా ఉంటారు……
కిషోర్ గారు, నందిని ఒకసారే బయటికి వస్తారు….
“గుడ్ మార్నింగ్ డాడ్ “అని అంటుంది నందు……
“గుడ్ మార్నింగ్ బేబీ “అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు……
వేడి వేడి పెసరట్టు చూడగానే “ఆహా ఈరోజు పెసరట్ట ధాత్రి నేను ఈరోజు ఇదే ఎక్సపెక్ట్ చేశా తల్లి నువ్వు అదే ప్రిపేర్ చేసావ్ “అని అంటారు…..
ధాత్రి నవ్వుతూ టిఫిన్ వడ్డీస్తూ “నందు నీకోసం పల్లీ చట్నీ చేశాను తిను “అని అంటుంది…..
“థాంక్స్ వదిన “అని నవ్వుతూ అంటున్న నందు నీ చూసి ధాత్రి నవ్వితే “తొందరగా తిను నిన్ను డ్రాప్ చేసి నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి కిట్టి పార్టీ ఉంది మీరు ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నాకు కుదరదు “అని అంటారు……
“మామ్ నువ్వు వెళ్ళిపో నన్ను డాడ్ డ్రాప్ చేస్తారు “అని అంటుంది…..
“అది ఎదో ముందే చెప్పొచ్చు కదా ఇంతసేపు టైం వేస్ట్ “అని హ్యాండ్ వాష్ చేసుకుని బ్యాగ్ తగిలించుకుని కిషోర్ గారి వైపు చూసి బయటికి వెళ్ళిపోతారు…….
“ఈవిడ ఇంకా మారదు “అని నందు, కిషోర్ గారు ఒకరినొకరు చూసుకుంటారు….
దేవి గారు బయటికి వెళ్ళగానే “వదిన అమ్మ వెళ్ళిపోయింది కదా రా మాతో పాటు కూర్చుని తిను “అని అంటుంది నందు……….
“పర్లేదు నందు నేను తర్వాత తింటా “…..
“కూర్చో తల్లి మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుందో లేదో “అని బలవంతం గా కూర్చో పెడతారు కిషోర్ గారు…….
కిషోర్ గారి నీ చూసి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ, నాన్న గుర్తు వచ్చి మౌనం గా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది ధాత్రి………
“అయ్యో వదిన ఏమైంది “అని అంటుంది నందు…..
“ఏంలేదు నందు నువ్వు తిను “….
ధాత్రి కన్నీళ్లు చూసి “నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చి భాద పెడుతున్న కదా తల్లి నిన్ను మన ఊరిలోనే వదిలేసి ఉంటే ప్రశాంతం గా ఉండేదానివి “అని బాధగా అంటారు కిషోర్ గారు……
“అయ్యో మావయ్య అలా అంటున్నారు ఏంటి నేను ఏమి బాధ గా లేను, ఒక్కసారే అమ్మ వాళ్ళు గుర్తు వచ్చారు అంతే, మీరు అందరు ఉండగా నేను ఊర్లో ఉండి ఎమ్ చేస్తా నాకు ఇక్కడే నచ్చింది మీరు తినండి “అని నవ్వుతూ అంటుంది……..
ధాత్రి తల నిమిరి “ఎంత బాధ కలిగిన చిరు నవ్వు సమాధానం కదరా నీకు, నీకు అన్ని నా చెల్లి పోలికలే ఎంత బాధ వచ్చిన మౌనం గా ఉంటుంది నువ్వు కూడా అంతే”అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని “మీ అత్త నీ మంచితనం ఎప్పుడు తెలుసుకుంటుందో నీకు ఈ బాధల నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో “అని అనుకుంటారు……
నందు కూడా టిఫిన్ తినేసాక ఇద్దరు ఇంటి నుండి స్టార్ట్ అవుతూ ” మీ అత్తయ్య తొందరగానే వస్తుంది అనుకుంటున్నా ఒకవేళ రాకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి డోర్స్ అన్ని లాక్ చేసుకుని లోపల ఉండు “అని అంటారు…..
“సరే మావయ్య జాగ్రత్త గా వెళ్ళండి, నందు బాయ్ “అని చెప్తుంది……
ధాత్రి నీ చూసి నవ్వుతూ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు……
కిషోర్ గారు బయటికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ డైనింగ్ టేబుల్ శుభ్రంగా తుడిచి గదిలోకి వెళ్లి గోడకి తగిలించి ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న ఫోటో చూసి కన్నీళ్లు తుడుచుకొని “నన్ను చూసి బాధ పడుతున్నారా అమ్మ నేను బాగానే ఉన్నాను అత్తయ్య కోపం ఎంతసేపు, మావయ్య ప్రేమ ఎప్పుడు ఇలానే ఉంటుంది నా మీద “అని లంచ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది…….
ధాత్రి లంచ్ కూడా ప్రిపేర్ చేసి కాసేపు పడుకుందాం అని రూమ్ లోకి వెళుతుంది…….
సుమారు రెండు గంటలు అవుతూ ఉండగా ఇంటికి వస్తారు దేవి గారు.ఎంతసేపు డోర్ కొట్టిన తలుపు తీయకపోయేసరికి కోపం వచ్చి “ఇది ఏమి చేస్తుంది ఎవరు లేరు అని చక్కగా నిద్ర పోతూ ఉంటుంది లోపలికి వెళ్ళాక ఉంటుంది దీనికి “అని తన దగ్గర ఉన్న స్పేర్ కీ తో లాక్ తీసి లోపలికి వస్తారు దేవి గారు……
మార్నింగ్ నుండి అలిసిపోయి గాఢ నిద్రలో ఉన్న ధాత్రి కీ వాళ్ళ అత్తయ్య డోర్ కొట్టింది వినిపించదు……
దేవి గారు కోపం గా ధాత్రి రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడుకుని ఉన్న తనని లాగి కింద పడేసి చెంప మీద గట్టిగా కొడతారు…….
ఇంకా ఉంది…..
Swipe left/right or tap the sides to turn pages