46
“బయటకు వెళ్ళనిస్తానులే కాకపోతే మనకి అప్పుడే ఈ ఫస్ట్ నైట్ లాంటిది హనీమూన్ లాంటివి వద్దు. నాకు నువ్వు కావాలి నా పక్కన నువ్వు ఉండాలి అని నీ మెడలో తాళి కట్టాను అందుకని లైఫ్ లో ప్రతిదీ తొందరపడదు. అమ్మానాన్న నానమ్మ అందరూ మన పెళ్లిని యాక్సెప్ట్ చేసిన తరువాత నేను అడుగు ముందుకు వేస్తాను. అప్పటివరకు ఇదిగో ఇలాంటి చిలిపి అల్లరి పనులు కాదు నిన్ను కొరుక్కు తినేస్తే పనులు కొంచెం కొంచెం జరుగుతూనే ఉంటాయిలే” అని కన్ను కొట్టి అన్నాడు రౌద్ర.
ఆ మాటలకి సిగ్గు పడిపోతూ “అబ్బా రౌద్రా ప్లీజ్ కాసేపు ఈ మాటలన్నీ ఆపు, ఇక్కడ అత్తయ్య వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది అమ్మ వాళ్ళ దగ్గర కూడా వెళ్లి విషయం చెబుదాం, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని నాకు భయంగా ఉంది” అని రౌద్ర గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేసింది శౌర్య.
సరే అయితే నువ్వు రెడీ అవ్వు. మీ ఇంటికి వెళ్దాం అని రౌద్ర చెప్పటంతో థాంక్యూ అని అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి పైకి లేచి నిలబడింది శౌర్య.
అతడు నవ్వుతూ పైకి లేచి ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని నడుం మీద రెండు చేతులు వేసి తన తలను ఆమె తలకు ఆడిచ్చి మరి ఇక్కడ కొత్త కదా నీకు ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అడిగాడు..
హెల్ప్ ఏ విషయంలో అని కళ్ళు చిన్నవి చేసే అమాయకంగా అడిగింది శౌర్య.