-47
పూజిత శౌర్య చెంప మీద ఒక్కటి పీకి “మేము నీకు ఏం తక్కువ చేశామే ఇలా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చావు. ఏ నువ్వు మా దగ్గరకు వచ్చి అమ్మ నేను ప్రేమిస్తున్నాను నాకు పెళ్లి చేయండి అని చెబితే మేము పెళ్లి చేయమా..? మీ ప్రేమకి పెళ్లికి మేము ఏమైనా అడ్డుపడతాము అనుకుంటున్నారా, మేం ఇంకా బ్రతికే ఉన్న చచ్చిపోయాను అనుకుంటున్నావా..?” అని ఆపకుండా శౌర్య చెంప మీద కొడుతూనే అన్నది.
ఫస్ట్ రౌద్ర శౌర్యనే తన పేరెంట్స్ ని ఒప్పిస్తుంది తన మధ్యలో రావటం కరెక్ట్ కాదు తను ఇన్వాల్వ్ అయితే గొడవ పెద్దది అవుతుంది అని అనుకొని సైలెంట్ గా ఉన్నాడు.
కానీ పూజిత శౌర్యని కొడుతుంటే ఫస్ట్ కోపం వచ్చింది పిడికిలి బిగించాడు కళ్ళు మూసుకున్నాడు కానీ మధ్యలోకి వెళ్ళలేదు. పూజిత కొట్టడం ఆపకపోవడంతో శౌర్య దగ్గరకు వచ్చి ఆమెను తన వెనక నిలిచాబెట్టి పూజిత వైపు కోపంగా చూస్తూ “తను నా భార్య నా భార్యని కొట్టే రైట్ మీకు లేదు” అనే సీరియస్ గా చెప్పాడు.
అంత దగ్గరగా వచ్చి రౌద్ర అంత కోపంగా చెప్పటంతో పూజిత కూడా భయపడి తన భర్త చేతిని పట్టుకుంది.
“మాకు పెళ్లయింది అనే విషయం మీకు చెప్పటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, అంతేకానీ మీరు నా భార్యని కొడుతుంటే నేను చూస్తూ ఉండడానికి రాలేదు. నిజానికి తనకే తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోయింది” అంటూ వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది అనేది చెప్పి,
” ఇంకొకసారి నా భార్య మీద మీ చెయ్యి పడితే చెయ్యి విరిచేస్తాను నాకు రిలేషన్స్ తో పెద్ద సంబంధం లేదు. నా పక్కన నా భార్య ఉండాలి సంతోషంగా కనిపించాలి అంతే” అని నిప్పులు కట్టే కళ్ళతో కోపంగా పూజిత భరద్వాజ్ ఇద్దరు వైపు చూస్తూ చెప్పాడు.