New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వివాహం -1 – 5

వివాహం -1 – 5

బయటికి వచ్చిన ధరణి షాక్ గా చూస్తూ ఉంటుంది……… 

 

 

        ” వదిన అన్నయ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని నన్ను వెళ్లమని చెప్పాడు ”  అంటాడు ఆకాష్…. 

 

 

           “హో ! అలాగా , సరే లోపలికి రా ఆకాష్ ” అని లోపలికి తీసుకు వెళుతుంది…… 

 

 

      “కాని మనసంతా దిగులుగా అయిపోయింది ధరణి కి అభి రాలేదు అని బయటికి నవ్వుతూ ఉంది” పాపం ధరణి…..

 

 

          భోజనాలు అయిన తర్వాత, “ఆకాష్ నువ్వు వెళ్లి ఆ గది లో రెస్ట్ తీసుకో, ఒక 4 కి బయలు దేరి వెళ్దాం సరేనా” అని అంటుంది ధరణి…… 

 

 

             అబ్బా,” థాంక్ యూ సో మచ్ వదిన డ్రైవింగ్ చేసి చేసి చేతులు నొప్పి పెడుతున్నాయి, కాసేపు పడుకోకపోతే అస్సలు కుదరదు ” అని లోపలికి వెళ్లి పడుకుంటాడు ఆకాష్…….. 

 

 

                ధరణి, సుజాత భోజనాలు చేస్తూ ఉంటారు.ధరణి తో వాళ్ళ అమ్మ , “ఏంటి ధరణి ముఖం అలా ఉంది, అల్లుడు గారు రాలేదని ఫీల్ అయ్యావ ” అని అడుగుతారు…… 

 

 

              అదేం లేదు అమ్మ ” ఆయన కి మీటింగ్ ఉందని చెప్పిన, నేను ఎందుకు ఫీల్ అవుతాను నేనేం అవ్వలేదు “అని అంటుంది ధరణి…… 

 

 

               సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయలుదేరుతారు ఆకాష్, ధరణి……. 

 

 

              ” వదిన నీకు డ్రైవింగ్ వచ్చా ”  

 

 

       ” లేదు ఆకాష్ నాకు డ్రైవింగ్ రాదు, ఎప్పుడు నేర్చుకోవాలి అని అనుకోలేదు ” అని అంటుంది ధరణి……. 

 

 

        ” అదేంటి వదిన ఇప్పుడు ఎంత మంది నేర్చు కుంటున్నారు, ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది కదా, మన ఇంటి దగ్గర స్కూటీ ఉంది కదా అన్నయ ని నేర్పుమని అడుగు ఈ సారి సరేనా “అని అంటాడు ఆకాష్…….. 

 

 

         మనసులో “మీ అన్నయ కి నాతో మాట్లాడే టైం కూడా ఉండదు, ఇంక స్కూటీ ఏం నేర్పిస్తారు అనుకొని” సరే ఆకాష్ అంటుంది……. 

 

 

            సరదాగా మాట్లాడుకుంటూ గంటలో ఇంటికి చేరుకుంటారు…… 

 

 

          ధరణి రామ్మ అంటూ ” నువ్వు లేకపోతే అప్పుడే ఈ ఇంట్లో సందడి లేదు, ఆగు అలసిపోయి వచ్చారు, కాఫీ తీసికొని వస్తాను ” అని లేవబోతుంటే……. 

 

 

       అయ్యో ” అత్తయ్య నాకు కాఫీ ఏం వద్దు మీరు కూర్చోండి ” అని అంటుంది…… 

 

 

    ”  అయిన మేము ఏమైన నడుచుకుంటూ వచ్చామ ఏంటి అలిసి పోవడానికి ,నాకు ఇవ్వాలి కాఫీ ఇంకా “అంటూ కార్ పార్క్ చేసి వస్తున్న ఆకాష్ కౌంటర్ వేస్తాడు……. 

 

 

         రేయ్ ” ఆకాష్ నీకు మాటలు ఎక్కువగా వస్తున్నాయి లే, ముందు వెళ్లి మీ అన్నయ ఏదో వర్క్ ఇచ్చాడు అంట కదా అది ఫినిష్ చేయామని చెప్పాడు, పో వెళ్లి ఆ పని చూడు ” అని అంటారు…….. 

 

 

            ” పని రాక్షసుడు అనుకుంటూ తన గదిలోకి వెళ్లి పోతాడు “

 

 

           “ధరణి వెళ్లి నువ్వు కూడా రెస్ట్ తీసుకో ” అని అంటే “పర్లేదు అత్తయ్య కాసేపు కూర్చుని వెళ్తాను , నాకేం అలసటగా లేదు” అని ఇద్దరు కాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు…… 

 

 

               సరే “అత్తయ్య నేను వెళ్లి స్నానం చేసి వచ్చి, వంట ప్రిపేర్ చేస్తాను” అని అంటుంది…. 

 

 

            ధరణి “ఈరోజు నేను చేస్తాను లే నువ్వు రెడి  అయి రా , నాకు హెల్ప్ చేద్దువు గాని సరే నా” అని చెప్పి తనని వెళ్లి స్నానం చేసి రమ్మని చెపుతారు…….. 

 

 

          ” కొంచెం సేపు తరువాత ఇద్దరు కలిసి వంట పూర్తి చేసి కాసేపు హల్ లో టివి చూస్తూ ఉంటారు అత్త, కోడలు”……… 

 

 

              సరిగ్గా ఎనిమిది అవుతుంది. ” ధరణి అభి రావడానికి ఇంకా సమయం అయ్యేటట్లు ఉంది, మీ మావయ్య గారిని,ఆకాష్ కి భోజనము పెట్టేద్దాము, వెళ్లి వాళ్ళ ని పిలుద్దాం “అని  అంటారు…… 

 

 

               ” ఆకాష్ , భోజనానికి రా చాలా టైం అవుతుంది “అని పిలుస్తుంది,హ “వదిన 5 మినిట్స్ వస్తున్న అని చెప్తాడు”అని అంటాడు ఆకాష్…….. 

 

 

                 అలాగే “అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది, వాళ్ల మావయ్య గారికి భోజనం వడ్డిస్తారు “.ఆయన భోజనం చేస్తూ ” అభి కి ఒక సారి ఫోన్ చేయాకపోయావామ్మ ” అని ధరణి ని అడుగుతారు……… 

 

 

            అంటే అది “మావయ్య గారు ఆయన కు ఫోన్ అంటూ ఉంటే లోపలికి వస్తున్న అభి ని చూసి ” ఆయన వచ్చేసారు మావయ్య అని అంటుంది…… 

 

 

            అభి “ఈరోజు ఇంత లేట్ అయింది, సరే వెళ్లి ఫ్రెష్ అయి రా భోజనం చేద్దాం” అని అంటారు అభి వాళ్ళ నాన్న గారు……. 

 

 

             ” హ ఒకే డాడ్  ” అని లోపలికి వెళ్తాడు….. 

 

 

     అభి, ఆకాష్ ఇద్దరు భోజనం చేయడానికి వస్తారు…….. 

 

 

             ధరణి వడ్డిస్తుంది, ఒక సారి వద్దు అని అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసాడు కాబట్టి సైలెంట్ గా ఏమి అనకుండా భోజనం ముగించారు….. 

 

 

                అందరి భోజనాలు అయిన తర్వాత ధరణి గదిలోకి వెళ్లి పోయింది, బయట గార్డెన్ లో కాసేపు తండ్రి కొడుకులు వాకింగ్ చేస్తూ బిజినెస్ గురించి మాట్లాడుకుని లోపలికి వచ్చారు……. 

 

 

             ధరణి గదిలో కాళ్లు కాలిన పిల్లి లాగ చుట్టు తిరుగుతూ ఉంటుంది, ” ఆయన గదిలోకి వచ్చాక నేను అడుగుతాను , ఎందుకు రాలేదు అని ” అడుగుతా అని అనుకుంటూ ఉంది……. 

 

 

               అభి డోర్ ఒపెన్ చేసి లోపలికి వస్తూ ,ధరణి అటు ఇటు తిరగడం చూసి” ఏంటి ఈ అమ్మాయి ఇలా రూమ్ అంతా తిరుగుతూ ఉంది, అయిన మన కెందుకు లే గాని ” అని వచ్చి బెడ్ పై లాప్టాప్ వేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు…….. 

 

 

           ఏవండి!! అని పిలిస్తే ఇదేంటి పలకరు అనుకుంటూ ( కొంచెం గట్టిగా పిలువు పాప నీ మాట గొంతు లోనే ఆగిపోయింది ) మళ్లీ వెంటనే ఏవండి అని ఈసారి గట్టిగానే పిలుస్తుంది……. 

 

 

          ఒక సిరియస్ లుక్ ఇచ్చి, మళ్లీ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు…… 

 

 

              కొంచెం భయపడి మళ్లీ తేరుకుని ” ఏవండి , మీతో కొంచెం మాట్లాడాలి ” అని వణికే గొంతుతో చెబుతుంది………. 

 

 

                  తల పైకి ఎత్తకుండానే “ఏంటి ” అని గంభీరమైన స్వరంతో అంటాడు……. 

 

 

            కొంచెం ధైర్యము తెచ్చుకొని “మీరు నన్ను తీసుకు రావడానికి ఎందుకు రాలేదండి ” అని అడుగుతుంది……. 

 

 

                ఒక్క సారి గా అభి కి కోపం పెరిగిపోతుంది, ” నేను నీకు సర్వెంట్ లాగా కనపడుతున్నాన లేక నువ్వు ఎక్కడికి వెళ్లిన నిన్ను తీసుకువస్తాను అని అగ్రిమెంట్ ఏమైన రాసాన ” అని సిరియస్ గా అంటాడు…….. 

 

 

               కళ్ల వెంట నీళ్లు ఉబికి వస్తాయి……. 

 

 

     హేయ్”ముందు నువ్వు ఆ ఏడుపు ఆపు, నాకు చెడ్డ చిరాకు, అయిన నేను రాకపోతే నువ్వు ఏమైన అక్కడే ఉండి పోయావ లేదు కదా, నన్ను ప్రశ్నించకు ఎందుకు రాలేదు అని అర్ధమైందా ” అని లాపి క్లోస్ చేసి పడు కుంటాడు…….. 

 

 

      ధరణి ఏడుస్తూ సోఫా లో కూర్చుని “ఈయన ఎందుకు అంత సిరియస్ గా మాట్లాడుతున్నారు, నేను ఏమని అడిగాను ఎందుకు రాలేదు అని అడిగాను అంతే కదా, వచ్చిన తరువాత నుంచి నాతో సరిగా మాట్లాడలేదు, నేను ఏమైన తప్పు చేసాన”  అని ఏడుస్తూ సోఫా లో కూర్చునే ఉంటుంది, ఎప్పటికో అలా కూర్చునే నిద్ర పోతుంది ధరణి….. 

 

 

            తెల్ల వారింది… 

 

 

      తెల్లవారుజామున నిద్ర పోవడం వల్ల మెలుకువ రాలేదు ధరణి కి, యధావిధిగా ఉదయాన్నే లేచాడు అభి…… 

 

 

           జిమ్ ఏరియాకు వెళ్తూ సోఫా లో నిద్ర పోతున్న ధరణి ని చూసి పట్టించుకోకుండా గదిలోకి వెళ్లి పోతాడు……. 

 

 

           ఒకసారి గా ఉలికిపడి లేస్తుంది, గడియారం చూస్తే తను లేచే టైం దాటి పోవడంతో గబగబా ఫ్రెష్ అయి వస్తుంది…….. 

 

 

           రాత్రి జరిగింది మరిచిపోయి ” ఆయన కోసం బట్టలు తీసి వెళ్తే ఆయన రెడి అయిపోతారు కదా ఆ తర్వాత నేను అత్తయ్య దగ్గర కు వెళ్లి హెల్ప్ చేయచ్చు “అనుకొని బట్టలు తీసి బయట పెట్టి కిందకి వస్తుంది……… 

 

 

             కొంచెం సేపు తరువాత అభి స్నానం కూడా చేసి వచ్చేస్తాడు, ఎంత సేపటికి లెమన్ వాటర్ తీసికొని రాలేదు ఎవరు కూడా, ” ఇదేంటి అమ్మ ఇంక తీసుకు రాలేదు ” అనుకుంటూ బెడ్ మీద బట్టలు చూస్తాడు, అంతే కోపం తారాస్థాయికి వెళ్లి పోతుంది మన అభి బాబు కి …….. 

 

 

         అప్పుడే లెమన్ వాటర్ తీసికొని కర్మ కాలిపోయి  గది లోకి వస్తుంది పాపం ధరణి. ” ఏవండి లెమన్ వాటర్ తీసుకోండి, కొంచెం లేట్ అయింది ” అని ఇస్తుంది……. 

 

 

          చేతిలోకి తీసికొని దెబ్బ కి గ్లాస్ విసిరి కొడతాడు, ఆ సంఘటనకు కంగారు పడి తెల్ల బోయి చూస్తుంది ధరణి……… 

 

 

          ధరణి మీదకి వస్తూ ” నేను నీకు చెప్పానా , నాకు సేవలు చేయమని ” అని కోపంగా అంటాడు….. 

 

 

       ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది….. 

 

 

     నేను” ఇక్కడ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నీ చెవికి ఎక్కడం లేదా, మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే నేను ఏమని అర్థం చేసుకోవాలి, మాట్లాడు ” అని గట్టిగా అంటాడు…….. 

 

 

           “మీరు లెమన్ వాటర్ తాగుతారు కదా అని తీసుకు వచ్చాను అండి ” అని ఒక్కో మాట కలిపి చెపుతుంది……. 

 

 

       “నేను నిన్ను తీసుకు రమ్మని చెప్పలేదు, అలాగే నా బట్టలు తీయామని చెప్పలేదు, నా పనులు నేను చేసుకోగలను ఒకే ” అని అంటాడు…… 

 

 

        అదేంటి అండి ” మీ పనులు చేయడం నా బాధ్యత అండి, నేను మీ భార్య ని ” అని ఏడుస్తూ చెపుతుంది ధరణి……… 

 

 

     ”  నేను నిన్ను భార్య గా అంగీకరించను , అది ఎప్పటికి జరగదు, నా విషయములో ఇంకోసారి తలదూర్చితే మర్యాద ఉండదు నీకు ” అని కోపంగా అనేసి వేరే డ్రస్ తీసికొని డ్రసింగ్ రూమ్ వైపు వెళ్లి పోతాడు……. 

 

 

        అభి వెళ్లిన వైపే కన్నీళ్లతో చూస్తూ పగిలిన గాజు ముక్కలను తీస్తుంది బాధగా, నిజానికి తన గుండె కూడా ముక్కలు గా అయిపోయింది ధరణి కి, గాజు ముక్కలను తీస్తుంటే చేతికి గుచ్చుకొని బ్లెడ్ వస్తున్న పట్టించుకోకుండా గదిలో నుండి బయటికి వస్తుంది……….

 

 

             చేతి నిండా బ్లెడ్ తో వస్తున్న ధరణి ని చూసి కంగారు గా జానకి గారు ” ధరణి ఏంటమ్మ చేతికి రక్తం, ఏమైంది” అని కంగారు పడతారు…….. 

 

 

        బాధని గుండె లోనే దాచుకొని ” అది అత్తయ్య చేయి జారి గ్లాస్ పగిలిపోయింది,గాజు ముక్కలను తీస్తుంటే చేతికి గాయం అయింది “అంతే చిన్న దెబ్బే అత్తయ్య కంగారు పడకండి …….. 

 

 

         ” ఏంటి ఇంత రక్తం పోతుంటే, చిన్న గాయం అంటావేంటి, రేయ్ ఆకాష్ ఫస్ట్ ఏడ్ బాక్స్ తీసుకురా” అని ధరణి ని సోఫా లో కూర్చోపెడతారు…… 

 

 

          ఆకాష్ “ఏమైంది అమ్మ అనుకుంటూ  బయటికి వచ్చి, చేతికి గాయం చూసి, అయ్యో వదిన ఏమైంది ఇంత రక్తం “అని బాక్స్ వాళ్ళ అమ్మ చేతికి ఇస్తాడు…… 

 

 

             జరిగింది తెలుసుకుని ” ఏంటి వదిన అంత పరధ్యానం గా ఎలా ఉన్నావు , దేని గురించైనా ఆలోచిస్తూ ఉన్నావ “అని అడుగుతాడు……. 

 

 

            ధరణి అన్నిటికి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటుంది…… 

 

 

           రెడి అయి బయటికి వచ్చిన అభి కనీసం తన వైపు కూడా చూడకుండ ” అమ్మ, నేను ఆఫీస్ కి వెళ్తున్న అని వెళ్లి పోతుంటే ” 

 

 

           అభి ” చూడు ధరణి కి ఎంత గాయం అయిందో” అని అంటున్న పట్టించుకోకుండా బయటికి వెళ్లి పోతాడు…….. 

 

 

          ధరణి ” నువ్వు తప్పుగా అనుకోకు, వాడికి అర్జెంట్ వర్క్ ఉంది అనుకుంటా ” అని అంటారు…. 

 

 

         నేను ఏమి బాధ పడలేదు లే అత్తయ్య అని అంటూ మనసులో ” బాధ పడటానికి ఏమి లేదు అత్తయ్య, మీ అబ్బాయి మనసులో మాట బయటికి వచ్చేసింది కదా ” అనుకొని బాధ పడుతుంది……. 

 

 

        అత్తయ్య “కొంచెం కళ్లు తిరుగుతున్నాయి , నేను కాసేపు పడుకుంటాను ” అని అడుగుతుంది…. 

 

 

      అయ్యో అలాగే ” నేను తీసుకు వెళ్తాను, అంటే పర్వ లేదు నేను వెళ్తాను “అని గదిలోకి వెళ్లి పోతుంది……. 

 

 

           డోర్ లాక్ చేసుకుని వచ్చి సోఫా లో కూర్చుని ఏడుస్తూ కూర్చుని ఉంటుంది……. 

 

 

           మనసంతా దిగులుగా అయిపోయింది, నిన్ను భార్య గా అంగీకరించను అనే పదం తను తట్టు కోలేకపోతుంది……. 

 

 

           కోపంగా ఆఫీస్ కి వెళ్లి అందరి మీద కోపం చూపిస్తూ ఉంటాడు…… 

 

 

      “రేయ్, నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు రాగానే అందరి మీద అలా విరుచుకు పడుతున్నావు ” అని అంటాడు మనోజ్…… 

 

 

        ” నాకేం ప్రాబ్లం లేదు, అంతా ఆ అమ్మాయి వల్లే తను ఎందుకు నా డ్రస్ తీసి పెట్టాలి, ఇంకా అసలు నా పనులు ఎందుకు చేస్తుంది ” అని అరుస్తాడు……. 

 

 

        “ఎందుకంటే తను నీ భార్య కాబట్టి, తన మీద అరిచే ముందు కొంచెం ఆలోచించడం నేర్చుకో” అని కోపంగా వెళ్లి పోతాడు మనోజ్…….. 

 

 

        ఇంట్లో ధరణి  ఏడుస్తూ ఉండిపోయింది,ప్రతి సారి తనకి ఆ మాట గుర్తుకు వచ్చి ఇంకా బాధ పడుతుంది………….. 

 

 

     ” ఆయన కు నేనంటే ఇష్టం లేదా, ఇష్టం లేక పోతే నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నారు “ఇలా అనేక ప్రశ్నలు తన బాధను ఇంకా రెట్టింపు చేస్తున్నాయి……. 

 

 

       ఆయన ఎందుకు అలా మాట్లాడారు అని అనుకుంటూ ఆ రోజంతా భోజనం కూడా చేయకుండ వాళ్ళ  గదిలోనే ఉండి పోతుంది… 

 

 

 

కథ కొనసాగుతుంది…… 

 

 

 

         స్టోరి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలపగలరు…… 

 

 

                     Thank you … 

 

*****