New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వివాహం -1 – 4

వివాహం -1 – 4

ధరణి ఆలోచనలతో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉండి తెల్ల వారక ముందే నిద్ర లేచి స్నానముచేసి కిందకి వస్తుంది……. 

 

 

           తెల్లవారుతూ ఉంటుంది……. 

 

 

     ధరణి బయటికి వచ్చి, పూజ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని పూజ చేసి సోఫా లో కూర్చుని ఉంటుంది…… 

 

 

ఇంతలో జానకి గారు వస్తారు….. 

 

 

      ధరణి ఏంటమ్మ ఇక్కడ ఉన్నావు , పూజ కూడా చేసేసావు అప్పుడే, ఏమైంది ధరణి ముఖం డల్ గా ఉంది అని అడుగుతారు…. 

 

 

         ఏం లేదు అత్తయ్య సరిగా నిద్ర పట్టలేదు, అందుకే తొందరగా నిద్ర లేచాను అని చెపుతుంది……. 

 

 

         సరే అయితే నేను వెళ్లి సాన్నం చేసి వస్తా, టిఫిన్ తయారు చేద్దాం సరేనా అని అంటారు…….. 

 

 

        అత్తయ్య నేను చేస్తాను, మీరు వెళ్లి రండి అని కిచెన్ లోకి వెళుతుంది ధరణి……… 

 

 

        ధరణి పాలు కాచి అందరికి కాఫీ రెడి చేస్తుంది…. 

 

 

          ధరణి పాలు కాచి మావయ్య గారికి కాఫీ ఇవ్వమ్మ అని అంటూ లోపలికి వచ్చి, ఓ ఆల్రెడీ పెట్టేసావ అని మావయ్య గారికి ఇవ్వు అని చెప్తారు….. 

 

 

      అలాగే అత్తయ్య మీరు కూడా తీసుకోండి అని ఆకాష్ కూడా ఇచ్చి వస్తాను అని అంటుంది…….. 

 

 

      ధరణి ఆకాష్ కాఫీ తాగడు,అభి కి వాడికి లెమన్ వాటర్ ఇవ్వాలి అని చెపుతారు….. 

 

 

            నేను మావయ్య గారికి ఇచ్చి వాళ్ళ కి లెమన్ వాటర్ తీసుకు వెళ్తాను అత్తయ్య అని చెపుతుంది…….. 

 

 

            మావయ్య గారు కాఫీ అని ఇస్తుంది……. 

 

 

          గుడ్ మార్నింగ్ ధరణి అని అంటారు…….

 

 

              గుడ్ మార్నింగ్ మావయ్య గారు అని కాఫీ ఇచ్చి కిచెన్ లోకి వెళుతుంది ధరణి……

 

 

                 రాజారావు గారు బయటికి వచ్చి సోఫా లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటారు……. 

 

 

        ధరణి లోపలికి వచ్చి లెమన్ వాటర్ రెడి చేస్తుంది….. 

 

 

        ధరణి ఆకాష్ కి నేను తీసుకు వెళ్తాను, నువ్వు అభి కి ఇవ్వు, వాడి వర్క్ అవుట్ అయ్యే టైం అవుతుంది వెళ్లు అని చెప్పి ఆకాష్ దగ్గరకు వెళతారు………. 

 

 

             ఇప్పుడు ఈయన ఏ మూడ్ లో ఉన్నారో ఏంటో అనుకుంటూ వాళ్ళ గదిలోకి వెళుతుంది ధరణి…….. 

 

 

                 అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వస్తాడు అభి…….. 

 

 

       ఏవండి లెమన్ వాటర్ అని ఇస్తుంది…… 

 

 

        అమ్మ లేదా అని బేస్ వాయిస్ తో అడుగుతాడు అభి బాబు…… 

 

 

           అత్తయ్య గారు ఆకాష్ కి ఇవ్వడానికి వెళ్లారు అండి అని లెమన్ వాటర్ ఇస్తుంటే చేతులు వణుకు తాయి పాపం ధరణి కి……… 

 

 

          లెమన్ వాటర్ తీసుకుంటాడు తప్పక, తీసికొని తాగి ఇచ్చేస్తాడు గ్లాస్, టవల్ తీసికొని బాత్రూం లోకి వెళ్లి పోతాడు అభి……. 

 

 

             కిచెన్ లోకి వచ్చి , టిఫిన్ రెడి చేస్తున్న జానకి గారికి హెల్ప్ చేస్తుంటుంది ధరణి…… 

 

 

           అయ్యో అత్తయ్య ఆయన బట్టలు తీసి రాలేదు, తీసి వస్తాను అని చెప్పి రూమ్ కి వెళుతుంది …….. 

 

 

       కబోర్డ్ ఒపెన్ చేసి అభి డ్రస్ తీసి బయట పెట్టి వస్తుంది కిందకి…… 

 

 

         స్నానం చేసి బెడ్ మీద ఉన్న బట్టలను చూస్తాడు …. 

 

 

          కోపంతో నేను తనకి బట్టలు తీయామని చెప్పానా, ఏంటి భార్య హక్కు చూపిస్తుందా అది జరగని పని అనుకొని వేరొక డ్రస్ తీసికొని రెడి అయి కిందకి వస్తాడు….. 

 

 

            టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ, వస్తున్న  అభి ని చూస్తుంది ధరణి……. 

 

 

            అదేంటి నేను డ్రస్ తీసి పెట్టాను కదా, చూసుకోలేదా లేదంటే నచ్చలేదా, లేదు చూసి ఉండరు లేదంటే వేసుకునే వారు కదా అని అనుకొని మిగిలినవి తేవడానికి లోపలికి వెళుతుంది …………..

 

 

                పదా ధరణి టిఫిన్ పెడదాము , మళ్లీ టైం అయిపోయింది అని తినకుండా వెళ్లి పోతాడు అభి అని అంటుంది……….. 

 

 

          అలాగే అత్తయ్య అని ఆవిడ వెనకే వస్తుంది ధరణి….. 

 

 

         ఏవండి రండి టిఫిన్ చేద్దురు గాని అభి, ఆకాష్ రండి అని పిలుస్తారు……… 

 

 

            అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుని ఉంటారు…… 

 

 

          ధరణి పెట్టు అభి కి అని జానకి గారు అంటారు…… 

 

 

          అలాగే అత్తయ్య అని పెడుతుంటే, అమ్మ నువ్వు పెడుతున్నావు కదా ఆల్రెడీ, మళ్లీ తను ఎందుకు అని అంటాడు……. 

 

 

           సరే ధరణి నువ్వు వెళ్లి లంచ్ బాక్స్ లు తీసుకు రా, ఈలోపు నేను పెడతాను అని అంటారు జానకి గారు……. 

 

 

              కిచెన్ లోకి వెళ్లి లంచ్ బాక్స్ లు తెస్తుంది ధరణి………. 

 

 

           అభి ప్లేట్ లో ఒక ఇడ్లీ వేయబోతుంటే వెంటనే అభి చేయి అడ్డు పెట్టి వద్దు అని అంటాడు……. 

 

 

             అందరూ షాక్ గా చూస్తారు ధరణి తో పాటుగా…….

 

 

       అప్పుడు అభి , అంటే డాడ్ టైం అవుతుంది కదా ఈరోజు మీటింగ్ ఉంది వెళ్లి పోవాలి అని కవర్ చేస్తాడు….. 

 

 

         (అభి గురించి వాళ్ళ అమ్మ కి ,ఆకాష్ కి,తెలుసు కానీ తను మారతాను అని చెప్పడంతో వాళ్ళు అభి మాటలను నమ్మారు ,కాని మనోజ్ కి తెలుసు కదా…..) 

 

 

         అమ్మ వాళ్ళ కి డౌట్ రాకుండ చూడాలి, లేదంటే

మళ్లీ మెుదలు పెడతారు అనుకొని, సరే అమ్మ నేను వెళ్తాను అని అంటాడు అభి…… 

 

 

              ధరణి లంచ్ బాక్స్ ఇవ్వు అభి కి అని చెప్తారు జానకి గారు……. 

 

 

         హ, అలాగే అత్తయ్య అని అంటూ భయం గానే అభి దగ్గరకు వచ్చి లంచ్ బాక్స్ ను ముందు పెట్టి, ఇప్పుడు ఏమని అంటారో అని కంగారు పడుతూ ఉంటుంది……. 

 

 

           అందరూ ఉండడంతో సైలెంట్ గా బాక్స్ తీసికొని థాంక్స్ అని చెప్పి బయటికి వెళ్లి పోతాడు అభి…… 

 

 

        అతను వెళ్లిన వైపు చూస్తూ, ఈయన నాతో మాట్లాడటానికి కుదరడం లేదా, లేక పోతే నేనంటే ఇష్టం లేదా అని అనుకుంటుంది ధరణి…… 

 

 

           తన ఆలోచనకు బ్రేక్ ఇస్తూ, జానకి గారు పిలుస్తారు…… 

 

 

        ధరణి అక్కడే ఉండి పోయావు ఏంటి రామ్మ అని పిలుస్తారు…… 

 

 

       వస్తున్న అత్తయ్య….. 

 

 

        ఏంటి వదిన దేని గురించి అలా ఆలోచిస్తున్నావు, అన్నయ గురించా అని అంటాడు ఆకాష్…… 

 

 

          అబ్బే అదేం లేదు ఆకాష్ అని పైకి చెపుతుంది……. 

 

 

              ధరణి ఆకాష్ అలాగే అంటాడు, నువ్వేం అనుకోకు అని అంటారు జానకి గారు….. 

 

 

        అయ్యో, అదేంటి అత్తయ్య నేను ఏమి అనుకోను , అయిన మరిది గారు సరదాగా అంటే నేను ఏమి అనుకోను …… 

 

 

      అమ్మ నేను వదిన ఎప్పుడో ఫ్రెండ్స్ అయిపోయాము, సరే సరే నేను వెళ్తాను, మళ్లీ మా సార్  నా మీద అరుస్తాడు అంటూ లంచ్ బాక్స్ తీసికొని బయలుదేరి వెళ్లి పోతాడు ఆకాష్……… 

 

 

             అత్తయ్య ఆకాష్ జాబ్ చేస్తున్నాడు కదా మళ్లీ సార్ అంటున్నాడు ఏంటి అని అడుగుతుంది ధరణి…….. 

 

 

        ఆకాష్ మన ఆఫీసు లోనే వర్క్ చేస్తున్నాడు కాని వాడికి వర్క్ మీద పూర్తిగా అవగాహన రావాలని, అభి వర్క్ గురించి నేర్పిస్తున్నాడు , అందుకే అలా అంటున్నాడు….. 

 

 

          అభి  చాలా కేరింగ్ గా ఉంటాడు ధరణి, మీ మావయ్య గారికి కొంచెం హెల్త్ అప్ సెట్ అవడంతో ఆఫీసు కి రావద్దని చెప్పి, ఇంట్లో నే ఉండమని చెప్పాడు……. 

 

 

           మెుదట్లో  అభి కి ఏమైన డౌట్స్ వస్తే మీ మావయ్య గారు క్లియర్ చేసేవారు, ఇప్పుడు అభి నే అంతా చూసుకుంటున్నాడు……… 

 

 

            వినోద్ కి కూడా తనే హెల్ప్ చేసి, తను సొంతం గా ఆఫీస్ పెట్టుకునేలా చేసాడు అభి అని చెపుతారు జానకి గారు….. 

 

 

         అందరితోను మంచి గానే ఉన్నారు, మరి నాతో మాత్రం ఎందుకు అలా ఉంటున్నారు అని మళ్లీ ఆలోచన లో పడుతుంది ధరణి……. 

 

 

         ధరణి రా టిఫిన్ చేద్దాం అని ఇద్దరు టిఫిన్ చేసి, కాసేపు కూర్చుని, అప్పుడే ధరణి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తారు…… 

 

 

    ధరణి నువ్వు ఫోన్ మాట్లాడి రా నేను మావయ్య గారికి టాబ్లెట్స్ ఇచ్చి వస్తాను అని లోపలికి వెళ్లి పోతారు జానకి గారు……… 

 

 

       అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది ధరణి……… 

 

 

         అంతా బాగానే ఉన్నాము ధరణి ,అక్కడ అంతా బాగానే ఉందా అని అడుగుతుంది ధరణి వాళ్ళ అమ్మ……… 

 

 

          హ, అంతా బాగానే ఉంది అమ్మ….. 

 

 

         ఒక రెండు రోజులు నువ్వు అల్లుడు గారు రండి ధరణి అని అంటారు…. 

 

 

            అమ్మ ఆయన నిన్నటి నుండే ఆఫీస్ కి వెళ్తున్నారు, మళ్లీ లీవ్ అంటే ఒప్పుకోరు కదమ్మ……..

 

 

           నువ్వు రా ధరణి అల్లుడు గారు, నిన్ను తీసుకు వెళతానికి వచ్చి ఒక రెండు రోజులు ఉంటారు సరేనా, వదిన కి ఇవ్వు ఫోన్ నేను చెప్తాను అంటారు……… 

 

 

    అలాగే అమ్మ ఇస్తాను అత్తయ్య కి, అని వెళుతుంది ధరణి…. 

 

 

      అత్తయ్య, అమ్మ మాట్లాడతారు అంట అని ఫోన్ ఇస్తుంది….. 

 

 

          జానకి గారికి విషయం చెప్తారు, అలాగే వదిన సాయంత్రం పంపిస్తాను, రెండు రోజుల్లో పంపించేయాలి నా కోడలు ని సరేనా వదిన గారు అని చెప్తారు జానకి……. 

 

 

         అలాగే వదిన, అల్లుడు గారిని రమ్మని చెప్పండి తీసుకు వెళ్ళడానికి రమ్మని చెపుతారు,ఇప్పుడు ఈయన వస్తారు అని అంటారు……….. 

 

 

     అలాగే వదిన ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టి, ధరణి తో ఇలా అంటారు…… 

 

 

       ధరణి నువ్వు రెడి గా ఉండు మీ నాన్న వస్తారు తీసికొని వెళ్లడానికి సరేనా అని అంటారు…….. 

 

 

          సరే అత్తయ్య అని మళ్లీ ఆయనకు చెప్పి అని నసుగుతూ ఉంటుంది ధరణి…… 

 

 

            జానకి గారు నవ్వుతూ ఫోన్ చేసి చెప్పు అభి కి అని లోపలికి వెళ్లి పోతారు…….. 

 

 

           ధరణి ఫోన్ తీసికొని తన గదిలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుని ఆనందంగా అభి కి ఫోన్ చేస్తుంది…… 

 

 

         చివరి రింగ్ కి ఫోన్ లిఫ్ చేస్తాడు……… 

 

 

    హలో, హు ఇస్ థిస్ అని అంటాడు అభి…. 

 

 

        తను మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉంటుంది ధరణి, అభి కి చిరాకు వచ్చి ఫోన్ చేసి మాట్లాడే కామన్ సెన్స్ కూడా లేదా ఎవరు చెప్పండి అని సీరియస్ టోన్ తో అడిగే సరికి కంగారు వస్తుంది ధరణి పాపకి…….. 

 

 

          ఏవండి నేను అండి అని ఒక్కొక్క మాట చెపుతుంది ధరణి…….. 

 

 

           ఈ పిల్లకి పని పాట ఏమి ఉండదు అనుకుంట అనుకొని, నేను కొంచెం బీసిగా ఉన్న తర్వాత మాట్లాడతా అని టక్కున పెట్టేస్తాడు……… 

 

 

            తను తిరిగి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసరికి కొంచెం డల్ అవుతుంది……. 

 

 

          ఎప్పటి లానే పోనీలే బీసీ గా ఉన్నారు కదా అని అనుకొని సైలెంట్ అవుతుంది ధరణి….. 

 

 

           కొంచెం సేపటికి హల్ లోకి వచ్చి కూర్చుని ఉంటుంది…… 

 

 

         ధరణి చేసావ ఫోన్ అభి కి చెప్పావ ఏమని అన్నాడు అని అడుగుతారు…… 

 

 

         అత్తయ్య చేసాను, ఆయన బీసి గా ఉన్నారు అంట  , నేను విషయం చెప్పలేదు అత్తయ్య అని అంటుంది……. 

 

 

            హో అవునా, వాడు వర్క్ లో ఉంటే అంతే ధరణి భోజనము కూడా చేయడు, నేను చెప్తాను లే, నువ్వు వెళ్లిన తరువాత ఫోన్ చేసి మాట్లాడు సరేనా అని అంటారు……… 

 

 

             అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్లి బట్టలు సర్దుతూ ఉంటుంది ధరణి…….. 

 

 

      తన ఆలోచనలు అభి చుట్టునే తిరుగుతూ ఉంటుంది, ఆలోచన కు బ్రేక్ ఇస్తూ జానకి గారు పిలుస్తారు….. 

 

 

     ధరణి మీ నాన్న గారు వచ్చారు అని చెపుతారు జానకి…… 

 

 

         హ వస్తున్న అత్తయ్య అని తన ఆలోచన లను పక్కన పెట్టి కిందకి వస్తుంది ధరణి……. 

 

 

          నాన్న ని చూస్తూ, అమ్మ ని కూడా తీసుకు రావాల్సింది నాన్న అని అంటుంది…… 

 

 

        జానకి గారు నువ్వు ఎలాగు అక్కడికే వెళ్లుతున్నావు కదా మళ్లీ రెండు ప్రయాణాలు ఎందుకు ధరణి అని నవ్వు తారు…….. 

 

 

        ధరణి కూడా నవ్వుతూ మనసులో అవును కదా, నేనేంటి ఇలా అడుగుతున్న అని అనుకుంటుంది……. 

 

 

       రా దేవేంద్ర భోజనం చేస్తూ మాట్లాడు కోవచ్చు, పదా వెళ్దాం అని రాజారావు గారు పిలుస్తారు……. 

 

 

        ఇద్దరికి భోజనాలు వడ్డిస్తారు……. 

 

 

   భోజనాలు ముగిసాక కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గది లోకి వెళతారు రాజారావు గారు, దేవేంద్ర గారు…… 

 

 

       ధరణి నువ్వు కూడా తినేసేయ్, మళ్లీ బయలుదేరాలి కదా అని అంటుంది…… 

 

 

         ఒక గంటలో వెళ్లి పోతాం కదా మీరు కూడా తినేయండి అని తనకి కూడా వడ్డించడంతో ఇద్దరు భోజనాలు చేస్తారు……. 

 

 

             కొంతసేపు తరువాత, అత్తయ్య వెళ్లోస్తాను ఆకాష్ కి చెప్పండి అని మావయ్య గారు వెళ్లోస్తాను అని కారులో ఇంటికి బయలుదేరి వెళ్తారు……… 

 

 

            కారులో ఉన్న సమయంలో కూడా తన మనసు అభి ఫోన్ చేస్తార లేదా అనే ఆలోచిస్తూ ఉంటుంది……. 

 

 

                  ధరణి ఏంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు, ఏమైంది అని వాళ్ళ నాన్న అడుగుతారు…….. 

 

 

             అదేం లేదు నాన్న నిద్ర వస్తుంది కొంచెం అంతే అని చెప్తుంది……. 

 

 

         కాసేపు పడుకో పోని అని అన్న వద్దు నాన్న ఇంటికి వెళ్లాక పడుకుంటాను అని చెపుతుంది ధరణి……. 

 

 

             ఇంటికి చేరుకుంటారు…… 

 

 

సుజాత గారితో కాసేపు మాట్లాడి, అమ్మ నేను స్నానము చేసి పడుకుంటాను, కొంచెం అలసటగా ఉంది అని అంటుంది ధరణి….. 

 

 

      అదేంటి ధరణి భోజనం చేయాలి కదా అని అంటారు….. 

 

 

           నాకు ఆకలిగా లేదు అమ్మ అని లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి అలసటతో నిద్ర లోకి జారుకుంటుంది…….

 

 

               మార్నింగ్ తొందరగా లేచి అలా గార్డెన్ లోకి వెళ్లి, కాసేపు ప్రకృతి ని ఆస్వాదిస్తూ ఉంటుంది ధరణి…….. 

 

 

                ధరణి అంటూ వస్తారు సుజాత గారు, ఏంటి ఇక్కడ కూర్చుని ఉన్నావు అని అడుగుతారు…. 

 

 

                ఇక్కడ కూర్చుని చాలా రోజులు అయింది కదమ్మ, అందుకే కాసేపు ఉందామని వచ్చా, సరే అమ్మ నేను వెళ్లి స్నానము చేసి వస్తాను అని లోపలికి వెళ్తుంది……. 

 

 

             టిఫిన్ ముగిసాక అత్తయ్య తో మాట్లాడి వస్తాను అని రూమ్ లోకి వచ్చి ఫోన్ చేస్తుంది ధరణి……. 

 

 

                కాసేపు మాట్లాడి, ఆయన ఫోన్ కలవడం లేదు అత్తయ్య అని అంటుంది…… 

 

 

         ఆ!! ధరణి అభి ఏదో మీటింగ్ ఉందని బెంగళూరు వెళ్ళాడు, రెండు రోజుల్లో వస్తాడు అని చెప్తారు……. 

 

 

            హో అవునా సరే అత్తయ్య ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ……….. 

 

 

          అభి కి ఫోన్ చేస్తుంది, ఆన్సర్ చేయాడు , మెసేజ్ చేస్తుంది చూసి కూడా రిప్లై ఇవ్వడు, వాళ్ళ అత్తయ్య చెప్పిన ఎందుకో ఫోన్ ఆన్సర్ చేస్తాడు అని చేసిన ప్రయోజనం లేకుండా పోయింది…… 

 

 

            రెండు రోజులు రెండు యుగాలుగా గడిచాయి……. 

 

 

             ఒక రోజు జానకి గారు ఫోన్ చేసి, ధరణి అభి వస్తున్నాడు, నువ్వు రెడి అయి ఉండు భోజనాలు చేసాక ఇంటికి తిరిగి వచ్చేయండి అని చెప్తారు…… 

 

 

              ధరణి ఆనందం పట్టలేక వాళ్ళ అమ్మ తో చాలా వంటలు చేపిస్తుంది……. 

 

 

                 కారు సౌండ్ విని, అమ్మ ఆయన వచ్చి నట్టు ఉన్నారు అని బయటికి వచ్చి షాక్ గా చూస్తూ ఉంటుంది ధరణి………. 

 

 

 

                           ఇంకా ఉంది……