New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 10

వేచానయ్య నీకోసం 🤍 – 10

గాయత్రి కావ్య ఇద్దరు ఇంటికి రావడంతో ఇద్దరినీ ఫ్రెష్ అవ్వమని చెప్పి బూస్ట్ కలిపి ఇవ్వడంతో ఇద్దరూ తాగుతూ టీవీ ముందు కూర్చున్నారు… కావ్య ఇష్టం వచ్చినట్టుగా చానల్స్ మారుస్తూ ఉంటే గాయత్రి ఏదో ఆలోచిస్తూ ఉంది….

 

“ఇదిగో పాలు తాగాక ఈ ఫ్రూట్స్ కూడా తినండి” అని కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడంతో “సరే మమ్మీ” అని కావ్య చెప్పింది కానీ గాయత్రి ఏదో ఆలోచిస్తూ ఉండడంతో “గాయత్రి ఏమైందని?” అడగడంతో ఒకసారిగా ఉలిక్కిపడి “ఏమీ లేదు పెద్దమ్మ” అని చెప్పింది….

 

“అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఏమీ లేదంటావేంటి… నాకు చెప్పడం ఇష్టం లేదా?” అనగానే “అయ్యో అలా ఏమీ లేదు పెద్దమ్మ” అనగానే “మరి విషయం ఏంటో చెప్పు” అంది….

 

గాయత్రి మౌనంగా ఉండడంతో కావ్య కూడా తలతిప్పి చూస్తే “అమ్మమ్మ తాతయ్య గుర్తొస్తున్నారని” చెప్పడంతో కావ్య వాళ్ళ అమ్మా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడంతో గాయత్రి మౌనంగా ఉండిపోయింది….

 

“నేను నిన్ను బాగా చూసుకోవడం లేదా?” అని వాళ్ళ పెద్దమ్మ అనునయంగా అడిగేసరికి “అయ్యో అలాంటిదేమీ లేదు పెద్దమ్మ.. నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు గాని చిన్నప్పటినుంచి అమ్మమ్మ తాతయ్యకి దగ్గరగా ఉండడంవల్ల ఏదో వెలితిగా ఉందని” కళ్ళలో నీళ్లు పెట్టుకోవడంతో “చూడు నువ్వు ఇలా ఏడిస్తే నేను నిన్ను ఏదో బలవంతంగా తీసుకొచ్చి బాధపెడుతున్నట్టుగా నాకు బాధగా ఉంటుంది గాయత్రి” అంది….

 

“అలాంటిదేమీ లేదు పెద్దమ్మ…. అమ్మలాగే చూసుకుంటున్నావు కానీ ఎంతైనా అలవాటు అలవాటే కదా” అంటూ ఉంటే “కొన్ని రోజులు ఉన్నావంటే నీకు అలవాటు పడిపోతుంది…. కావాలంటే ప్రతి రెండు నెలలకి ఒకసారి అమ్మమ్మ తాతయ్యని ఇక్కడికి రమ్మని చెప్తాను… అప్పటికి మావయ్య వాళ్ళు వచ్చి అమ్మమ్మని తాతయ్యని వాళ్ళ దగ్గర ఉండమని చెప్తున్నారు కానీ ఆ ఊరు వదిలేసి రావడానికి అమ్మమ్మ తాతయ్యకి ఇష్టం లేదు… అదే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు రోజు కాలేజీకి వెళ్లి వచ్చేటప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్లి రావచ్చు” అంది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue