వాళ్ల మాటలు వింటూనే గాయత్రి ఆశ్చర్యంగా చూస్తూ ముందు రోజు అతను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది…
ఎప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని వేరే ధ్యాస లేకుండా ఉండే నన్ను నీ వైపు తిప్పుకున్నావ్ అన్న ఆర్యన్ మాటలు గుర్తు రావడంతో ఓహో స్పోర్ట్స్ అంటే అర్థం ఇదే అన్నమాట అనుకుంది….
ఏం ఆలోచిస్తున్నావ్ అక్క అని వాళ్ళిద్దరూ అడగడంతో ఏమీ లేదులే గాని అరగంట అన్నారు….ఇప్పటికి వన్ అవర్ అయింది… మీ అమ్మ వచ్చిందంటే పిల్లల్ని చదువుకోమని చెప్పాలి కానీ నువ్వు కూడా టీవీ చూడమని చెప్తావ్ ఏంటి గాయత్రి అని నన్ను తిడుతుంది… ముందు మీరు వెళ్ళండి అంది…
పో అక్క… ఎవరు మమ్మల్ని మ్యాచ్ సరిగా చూడనివ్వడం లేదని పిల్లలిద్దరూ తిట్టుకుంటూ వెళ్లిపోవడంతో వాళ్ళని చూసి నవ్వుతూ సుబ్బలక్ష్మి అక్కడికి వచ్చి వంట పూర్తయింది కాఫీ పెట్టి ఇవ్వనా అంది….
ఇప్పుడేం వద్దులే పెద్దమ్మ…. ఎక్కడికి వెళ్ళింది?
ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంటే వెళ్ళింది… నిన్ను రమ్మంటే రానన్నావంట కదా!!!