అతను ఏం మాట్లాడకుండా తన చేయి పట్టుకొని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే “నా చెయ్యి వదులుతారా?” అని అడగడంతో “వదులుతానులే గాని త్రీ మంత్స్ లో ఇంత చేంజ్ ఏంటి?” అని అడగడంతో తనని తాను చూసుకొని “ఏమైంది?” అని అడగడంతో “అప్పుడు భయం భయంగా ఎవరో ఏదో చేస్తారు అన్నట్టుగా ఉండే దానివి… ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చి మీ అక్క లాగా మాట్లాడుతున్నావ్” అన్నాడు….
“సిటీలో వాతావరణానికి అలవాటు పడ్డానని” స్కూటీ స్టాండ్ గాని విరిగిపోయిన హెడ్లైట్ గాని పగిలిపోయిందా అని చూసుకుంటూ ఉంటే హ్యాండిల్ అటూ ఇటూ కదలనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె బలం అతని ముందు సరిపోకపోయేసరికి “చూడండి మీరు ఆరోజు షాపింగ్ కాంప్లెక్స్ లో నాతో ప్రవర్తించిన విధానం అసలు ఏమీ బాగాలేదు…. మళ్లీ ఇప్పుడు కూడా ఏదోలాగా ప్రవర్తిస్తున్నారు” అంది…
“పోనీలే నీకు కూడా కాస్త తెలివి ఉందని అర్థమైందని” అంటూ కాస్త రెండు అడుగులు ముందుకు వేసి “నా ప్రవర్తనలో వచ్చిన తేడా నీ పట్ల ఎలాంటి భావం ఉందనే ఫీలింగ్ కలిగిస్తోంది నీకు” అనగానే కళ్ళు టప టపా కొడుతూ “మీ మనసులో ఏదో ఉద్దేశం ఉంది” అనగానే “పర్ఫెక్ట్… ఎస్ ఐ వాంట్ యు” అనగానే దెబ్బకి కళ్ళు పెద్దవి చేసి “వాట్” అని కీచు గొంతుతో అరిచింది…..
అతను మాత్రం పెద్దగా రియాక్షన్ ఇవ్వకుండా “నువ్వు కరెక్ట్ గానే విన్నావ్… ఎప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు నాకు…. నువ్వొచ్చి ఆ ధ్యాస నీ మీదకు వచ్చేలా చేసావు కాబట్టి దానికి బాధ్యత తీసుకోవాల్సింది కూడా నువ్వే…. ఐ వాంట్ యు అండ్ యు హవె టు బి మైన్” అనగానే “నువ్వు కావాలనుకుంటే నేను నిన్ను ప్రేమించాలా?” అంది….
“ప్రేమించకు పెళ్లి చేసుకో” అని అతను ఆటిట్యూడ్ గా చెప్పడంతో “మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు” అంటున్న ఆమె బుగ్గలు నొక్కి పట్టి “నేను అనుకుంటే రోడ్డు మీద ముద్దు పెట్టగలను… ఎందుకులే ఏడుస్తావ్.. నీ అంతగా నువ్వొచ్చి ముద్దు పెడితే కిక్కు వేరుగా ఉంటుందని ఆగుతున్నాను… ఇకపైన నువ్వు ఓకే చెప్పే వరకు నా టార్చర్ నీకు తప్పదు బేబీ” అని ఆమె నడుం చుట్టూ చేయవేసి దగ్గరికి లాక్కొని ఆమె బ్యాక్ మీద ఒక దెబ్బ వేయడంతో కీచుగా అరిచింది….
ఆరు అడుగుల ఎత్తుతో దృఢమైన శరీరంతో చూపు తిప్పుకోలేనంత హ్యాండ్సమ్ గా ఉంటాడు ఆర్యన్…. కానీ ప్రేమ పెళ్లి లాంటి వాటి మీద ఎలాంటి ఆలోచన లేని గాయత్రి కి అదేమీ కనిపించడం లేదు….