ఆద్య, రాగిణి, విద్య ముగ్గురూ జయంతి హాస్పిటల్‌కి చేరుకుంటారు. ఇరవై రెండేళ్ల క్రితం జరిగిన రెండు హత్యల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనే పట్టుదలతో ఆద్య లోపలికి అడుగుపెడుతుంది.
ఆమె అక్కడి సిబ్బందిని కలిసి అడుగుతుంది.
ఆద్య:
ఇరవై రెండేళ్ల క్రితం ఇక్కడ రెండు హత్యలు జరిగాయి కదా! ప్రతాప్ వర్మ గారు, నందిని వర్మ గార్ల హత్యలకు సంబంధించిన వివరాలు కావాలి. ముఖ్యంగా వాళ్ల మృతదేహాలకు సంబంధించిన రికార్డులు చూడాలి.
ఆ మాటలు విన్న అక్కడి ఒక వ్యక్తి ఒక్కసారిగా ఆద్య వైపు చూస్తాడు. అతని ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. వెంటనే ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు.
కొంతదూరం వెళ్లిన తర్వాత తన ఫోన్ తీసి ఒక వ్యక్తికి కాల్ చేస్తాడు.