♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 3
కానీ పొద్దుపొద్దున్నే అంటే ఆ బయట టీ కాఫీ నా వల్ల కాదు తల్లి.
ఇదుగో అన్నయ్య నువ్వు కాఫీ తాగు అని శరత్ గారికి కాఫీ ఇచ్చి, ఇదిగో చిన్ని అత్తయ్య కి ఇడ్లీ, టీ
ఇచ్చి, సంపత్ కి, నందిని కి, టిఫిన్ లంచ్ ఇక్కడే అని చెప్పి రా అని చిన్ని కి చెప్తారు.
సరే అని చిన్ని అవి తీసుకుని శరత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది
ఎందుకు రా ఇడ్లీ నేను బయట తెచ్చేవాడిని కదా,నీకు ఎందుకు శ్రమ.
ఇందులో శ్రమ ఏముంది మావయ్య, ఈ రోజు ఇంట్లో టిఫిన్ ఇడ్లీ.
సరే టిఫిన్ ఇడ్లీ అని అన్నావు, మరి లంచ్ కూడా మీ అత్తయ్య కి జ్వరం వచ్చింది అని తెలిసి ముందే అందరికి చేశారా అని కళ్ళు ఎగరేసి అడుగుతారు.
అబ్బా మావయ్య నువ్వు లాజిక్లు మాట్లాడకు అని అంటుంది అమ్ము.
నువ్వే చెప్పాలి అమ్మ లాజిక్స్ గురించి అప్పుడు నువ్వు అది ఇచ్చావు,అందుకే ఇప్పుడు నేను ఇది ఇస్తున్నాను అని అన్ని బదులుకు బదులు ఇస్తావు.
ఇదిగో మావయ్య పొద్దున్నే నువ్వు మా అక్క తో గొడవ పడడానికి వచ్చావా.
అంత మాట అన్నావు ఏంటి రా నాని నువ్వు.
మరి లేక పోతే నువ్వు అనేమాటలు అలానే ఉన్నాయి.
రే నాని ఎందుకు మావయ్య తో అలా మాట్లాడుతావు తప్పు కదా.ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా జట్టు మొత్తం నూనె కారిపోతుంది.
అబ్బో అన్నయ్య మీద ఒక్క మాట కూడా పడనివ్వని చెల్లి. అవును రా నా చెల్లి నన్ను ఒక మాట కూడా పడనివ్వదు అయితే ఏంటి ఇప్పుడు.
నీకు అలా సాగుతుంది లే కానీ మామ అని అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు నాని.
వాడి మాటలు నువ్వు ఏమి పట్టించుకో పట్టి వద్దు అన్నయ్య.
చా చా నేను ఎందుకు పట్టించుకుంటాను వాడు ఏంటో నాకు తెలియదా.
సరే అన్నయ్య నువ్వు కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రా. టిఫిన్ ఇక్కడే తిందువు.అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే.
అమ్ము నువ్వు రా నాకు వంట గదిలో వంటకు సహాయం చేయడానికి.
సరే మామయ్య నువ్వు త్వరగా రా నేను ఈ లోపు హెల్ప్ చేస్తాను.
ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో మాధురి ఇటువంటి బంగారం లాంటి పిల్లలు పుట్టారు అని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
శరత్ గారి ఇంటికెళ్లేసరికి చిన్ని సంపత్ నందిని ముగ్గురు కొట్టుకుంటున్నారు. అరే ఏమైంది రా ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు. శరత్ వాళ్ళ ఆవిడ కమల నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంది.
ఏంటి కమల ఏమైంది ఎందుకు వీలు గొడవ పడుతున్నారు.
ఏమీ లేదండి నందిని చిన్ని ఇద్దరు కలిసి సంపత్ మీద నీళ్లు పోశారు నిద్ర లేవకపోతే. అందుకే వాడు వీళ్లిద్దరమ్మట పడుతున్నాడు కొట్టడానికి.
సిగ్గు లేదారా సంపత్ ఆడపిల్లల మీద చేయి చేసుకోవడానికి.
సిగ్గు వాళ్ళ కూడా లేదు నాన్న , నేను నిద్రపోతుంటే వచ్చి నా మొహం మీద నీళ్లు పోసి లేపారు.
మరి దున్నపోతు లాగా ఇప్పటిదాకా ఎవరైనా నిద్రపోతారా. నీకంటే చిన్నోడు నాని చూడు బయట వర్క్ చేసుకొని వచ్చాడు.
నువ్వు మాత్రం దున్నపోతులా నిద్ర పోతున్నావు.అబ్బా నాన్న మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు.
అంతేరా మంచి చెప్తే చెవికి ఎక్కదు మీకు.
అమ్మ నేను ఫ్రెష్ అయి వస్తాను ఇంక నేను నాన్నతో క్లాస్ పీకించుకోలేను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు సంపత్.
ఏంటి కమలా జ్వరం తగ్గిందా.
హా పర్వాలేదండి ఇప్పుడే టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకున్నాను.
సరే అత్తయ్య నేను ఇంకా ఇంటికి వెళ్తున్నాను, నందినీ నువ్వు కూడా త్వరగా వచ్చేసేయ్. నీకు సంపత్ కి మామయ్యకి ముగ్గురికి అక్కడే టిఫిన్ మధ్యాహ్నం భోజనం.
సరే చిన్ని నేను ఇల్లు క్లీన్ చేసేసి ఫ్రెష్ అయి వస్తాను.
అమ్మ నువ్వు లోపలకి వెళ్ళి రెస్ట్ తీసుకో, డాడీ మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసి తను కూడా ఫ్రెష్ అవుతుంది.
అమ్మ నేను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాకు కాలేజ్ టైం అవుతుంది అక్కడ టిఫిన్ చేసి అట్నుంచి అటే కాలేజీకి వెళ్ళిపోతాను.
సరేనమ్మా జాగ్రత్త అయితే, మరి అన్నయ్య ఏడి.
వాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు అక్కడికి.
సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి.
ఆ సరే అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది నందిని.
ఏంటి నందిని ఇంత లేట్ అయింది కాలేజీ టైం అవుతుంది కదా. ఇంట్లో పని చేసే వచ్చేసరికి లేట్ అయింది అత్తయ్య.
సరే రా ముందు టిఫిన్ తిని బాక్స్ సర్దుకో కాలేజీకి టైం అవుతుంది నీకోసం చిన్ని కూడా ఎదురు చూస్తుంది. సరే అని హడావిడిగా టిఫిన్ తినేసి బాక్సులు సర్దుకొని కాలేజీకి వెళ్లి పోతారు వాళ్ళు ఇద్దరు నందిని స్కూటీ మీద. సంపత్, నాని ఒక బండి మీద వెళ్తారు. అమ్ము ఒక్కటి తన స్కూటీ మీద వెళ్తుంది.
కమలా గారు శరత్ గారు ఇద్దరూ మాధురి గారి ఇంటికి వస్తారు.
ఏంటి వదిన జ్వరం తగ్గిందా ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో అని అడుగుతారు మాధురి గారు
పర్వాలేదు మాధురి బానే ఉంది ఇప్పుడు.
టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకున్నావా మరి.
హా చిన్ని తిని టాబ్లెట్స్ వేసుకున్న దాకా వదిలిపెట్టలేదు నన్ను.
సరే నువ్వు ఇక్కడ కూర్చో నేను అన్నయ్యకి టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి కమల గారిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు.
రా అన్నయ్య టిఫిన్ పెడతాను.
ఆ వస్తున్నాను అమ్మ నాకు సైట్ దగ్గరికి వెళ్లే పని ఉంది త్వరగా తినేసి వెళ్తాను.
హా సరే మధ్యాహ్నం భోజనానికి కూడా ఇక్కడికే రండి వదిన ఇక్కడే ఉంటుంది.
పిల్లలు కూడా సాయంత్రం కదా వచ్చేది.
ఇక్కడ అయితే నేను ఉంటాను కదా. జ్వరం తగ్గకపోతే హాస్పటల్ కి తీసుకెళ్తాను.
సరే రా ఒకవేళ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళేటట్లయితే నాకు ఫోన్ చెయ్ నేను కూడా వస్తాను.
సరే అన్నయ్య ముందు నువ్వు టిఫిన్ తిని నీ వర్క్ చూసుకో, అవసరమైతే నేను ఫోన్ చేస్తాను.
సరే అని టిఫిన్ తిని కాఫీ తాగి శరత్ గారు కమలా గారికి మాధురి గారికి చెప్పేసి బయటికి వెళ్లిపోతారు.
నువ్వు కూడా తిను ఎంతసేపు ఇట్లా తినకుండా ఉంటావు, అందరూ వెళ్లిపోయారు కదా ఇంక నువ్వు కూడా తిను.
హా వదిన తింటున్నాను అని చెప్పి టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు కూడా చేస్తారు మాధురి గారు.
కామెంట్స్ రేటింగ్ ఇచ్చి. సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్న.♥️
ఇంకా ఉంది.
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
ప్లీజ్ ఫాలో మీ.
Swipe left/right or tap the sides to turn pages