♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 4
హలో నాని చెప్పు ఏం చేస్తున్నారు. వాట్ ఎప్పుడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను నువ్వు కంగారు పడకు తాతయ్యకి ఏం కాదు. కిరణ్ కిరణ్ త్వరగా ఇండియాకి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చెయ్.
ఎందుకు సార్ ఏమైంది ఎందుకు అంత హడావిడిగా ఉన్నారు.
తాతకి హార్ట్ ఎటాక్ వచ్చిందంట నానమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. త్వరగా ఇండియా కి వెళ్ళాలి ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి టికెట్ తీసుకో,లేదంటే మన చాపర్ కి పర్మిషన్స్ తీసుకో.
సరే సార్ ఇప్పుడే చెక్ చేస్తాను నేను ఫైవ్ మినిట్స్ లో ఏ సంగతి మీకు చెప్తాను.
ఓకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడు.
సార్ ఒక గంటలో ఉంది సార్ ఫ్లైట్ మరి బుక్ చేయమంటే బుక్ చేస్తాను మనం ఇక్కడి నుంచి వెళ్లడానికి మినిమం 50 మినిట్స్ పడుతుంది.
ఓకే అది బుక్ చెయ్ ,నువ్వు నాతో పాటుగా ఎయిర్ పోర్ట్ వరకు రా. వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నీకు అప్పగించి వెళ్తాను. ముసలి ఒక 10 డేస్ లో నేను మళ్ళీ రిటర్న్ అవుతాను ఈ లోపు వర్క్ మొత్తం నువ్వే దగ్గర ఉండి హ్యాండిల్ చెయ్. ఫుల్ రైట్స్ నీకు ఇస్తున్నాను. ప్రాజెక్ట్స్ సబ్మిట్ కి పది రోజులు టైం ఉంది. మాక్సిమం ఈలోపే వచ్చేస్తాను. లేదంటే అది కూడా నువ్వే హ్యాండిల్ చెయ్. వర్క్ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెట్ చేయొద్దు.
అలాగే సార్ ఇక్కడ అన్ని నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను . మీరు ఇక్కడ ఆఫీసు విషయంలో ఎటువంటి టెన్షన్ పడొద్దు .అక్కడ తాతయ్యని నానమ్మ ని జాగ్రత్తగా చూసుకోండి నాకు ఏదైనా డౌట్ ఉంటే నేను మీకు కాల్ చేస్తాను.
నీ మీద నమ్మకం ఉండబట్టే ఇంత పెద్ద బాధ్యతను నీకు అప్పగించి నేను వెళ్తున్నాను, అని ఏమేమి చేయాలి అని మొత్తం కిరణ్ కి ఎక్స్ప్లైన్ చేస్తారు వాళ్ళ సార్.
వాళ్లు మాటల్లో ఉండగా నే ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతారు వెంటనే చెకింగ్ అయ్యి ఫ్లైట్ ఎక్కి కళ్ళు మూసుకొని తన సీటుకి జాకిలబడి కూర్చుంటారు.
కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇండియాలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. బెంగళూరులో టాప్ మోస్ట్ హాస్పిటల్ కి చేరుకుంటాడు.
తను వచ్చేసరికి సెక్యూరిటీ తన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు , రాగానే నేరుగా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్తారు.
మనవడిని చూడగానే నాయనమ్మ చిన్నోడ చూడరా తాతయ్యకు ఇలా అయింది అని బోరున విలపిస్తుంది.
నానమ్మ నువ్వేం కంగారు పడకు తాతయ్య ఏం కాదు నేను ఇప్పుడే డాక్టర్స్ తో మాట్లాడి వస్తాను నువ్వు టెన్షన్ పడొద్దు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి డాక్టర్స్ ని కలవడానికి వెళ్తాడు చిన్నోడు.
డాక్టర్ ఎలా ఉంది మా తాతయ్య కండిషన్. ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారా లేదంటే యూఎస్, యూకే తీసుకెళ్లమంటారా.
నథింగ్ టు వర్రీ సార్ ,మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు. వెంటనే రెస్పాండ్ అయి హాస్పిటల్ కి తీసుకువచ్చారు కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. కాకపోతే తను ఏదో విషయంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు సార్, తన వయసుకు అంత స్ట్రెస్ మంచిది కాదు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ,ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకూడదు. పీస్ ఫుల్ గా ఉండాలి సార్. ఎటువంటి ఆలోచనలు టెన్షన్లు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలి సార్.
మెడిసిన్ కంటిన్యూషన్ గా వాడాలి. యోగా మెడిటేషన్ వంటివి చేయాలి.
మీరు నిజమే చెప్తున్నార డాక్టర్ గారు లేదంటే నేను అమెరికా కానీ లండన్ కానీ తీసుకెళ్తాను ట్రీట్మెంట్ కోసం.
సార్ ఇప్పుడు మన దేశాల్లో కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది సార్ అక్కడ దాక వెళ్లాల్సిన అవసరం లేదు నిజంగా మీ తాతయ్య గారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే టెన్షన్లు పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటే చాలు.
మరి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ గారు.
కొన్ని టెస్ట్ లు రిపోర్టులు రావాలి సార్ అది వచ్చాక డిశ్చార్జ్ చేస్తాను.
ఇప్పుడు వెళ్లి మాట్లాడొచ్చా నేను మా తాతయ్య గారి తో.
హా వెళ్ళండి సార్ కానీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ సేపు మాట్లాడించవద్దు. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది.
ఆ సార్ ఇంకొక విషయం మీ నానమ్మ గారు హాస్పిటల్ కి వచ్చిన దగ్గరనుంచి కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు కొంచెం ఆవిడని చూసుకోండి మళ్ళీ ఆవిడకి నీరసం వస్తుంది వస్తుంది.
ఓకే థాంక్యూ డాక్టర్.
ఇట్స్ ఓకే సార్.
నానమ్మ ఒకసారి నాతో ఇలా రా
ఎక్కడికి చిన్నోడా? డాక్టర్ గారు ఏమన్నారు మీ తాతయ్య కి ఇబ్బంది ఏమీ లేదు కదా ఇంటికి వెళ్ళిపోవచ్చుగా మనం ఎప్పుడు వెళ్దాం.
హా నానమ్మ వెళ్దాం తాతయ్యకి ఎటువంటి ఇబ్బంది లేదు అంట నువ్వు ముందు టిఫిన్ తిందువు రా. హాస్పిటల్ కి వచ్చిన దగ్గరనుంచి కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు అంట కదా నువ్వు. డాక్టర్ గారు చెప్పారు, నువ్వు ఫస్ట్ ఏదైనా తిను తర్వాత మనం ఇద్దరం తాతయ్య దగ్గరికి వెళ్దాం.
తాతయ్యని చూడొచ్చని చెప్పారా డాక్టర్ గారు .హా నానమ్మ మాట్లాడొచ్చు అని కూడా చెప్పారు కానీ ఒక ఐదు నిమిషాలు మాత్రమే.
కానీ నాకు ఇప్పుడేం తినాలని లేదు చిన్నోడా తాతయ్యని చూసినదాకా నా మనసు మనసులో ఉండదు.
నానమ్మ నువ్వు తింటే నిన్ను తాతయ్య దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్తాను ,లేదంటే ఇంక నీ ఇష్టం నేను ఒక్కడినే వెళ్లి మాట్లాడు వస్తాను.
లేదు చిన్నోడా తింటాను, నేను కూడా తాతయ్య దగ్గరకు వస్తా.
సరే మరి త్వరగా తిను అని చెప్పి వాళ్ళ నానమ్మ కి టిఫిన్ ఆర్డర్ చేసి తను కాఫీ ఆర్డర్ పెట్టుకుంటాడు. వాళ్ల నానమ్మ కి టిఫిన్ తినిపించి తను కాఫీ తాగి వాళ్ళ తాతయ్య ని చూడ్డానికి ఐ సి యు కి వెళ్తాడు.
వీళ్ళు వెళ్లేసరికి అప్పుడే చిన్నగా కళ్ళు తెరుస్తున్నారు తాతయ్య గారు.
వాళ్ల తాతయ్య చేయి పట్టుకొని ఎందుకు తాతయ్య ఏమైంది ఏ విషయం గురించి అంత టెన్షన్ పడుతున్నావ్ నువ్వు.
ఏంటండీ మీరు ఏదైనా విషయం దాచారా దాని గురించే మీరు ఆలోచించి టెన్షన్ పడుతున్నార. అలా టెన్షన్ పడే మీ పరిస్థితి ఇక్కడ దాక తెచ్చుకున్నారు. ఏదన్నా చిన్నోడికి చెప్పండి చిన్నోడు సమస్యని పరిష్కరిస్తాడు మీరు మాత్రం దాని గురించి ఆలోచించి ఈ విధంగా ఇబ్బంది పడొద్దు. నాకు తెలియకుండా మీరు అంతగా ఇబ్బంది పడే విషయం ఏముందండీ.
నానమ్మ నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు ఏదైనా ఉంటే తాతయ్య చెప్తాడు కదా మనకి ,ఇప్పుడు నువ్వు ఆయనని ఇబ్బంది పెట్టొద్దు, అయినా ఇప్పుడు నేను వచ్చాను కదా నువ్వు ఇంటికి వెళ్ళు రిపోర్ట్స్ వచ్చాక డిశ్చార్జ్ చేస్తా అన్నారు నేను తాతయ్యని తీసుకొని ఇంటికి వస్తాను.
లేదు చిన్నోడా వెళ్తే తాత తో పాటే వెళ్దాం ఇద్దరం, లేదంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. మీ తాతయ్య లేకుండా నేను ఒక్కదాని ఇంటికి వెళ్ళను.
సరే అయితే నువ్వు తాతయ్యని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ గా కూర్చో. లేదంటే బయటకు వెళ్ళు నాన్నమ్మ తాతయ్య తో నేను మాట్లాడి వస్తాను.
సమస్య ఏంటో నాకు చెప్పు తాతయ్య నేను తీర్చగదైతే కచ్చితంగా తీరుస్తాను.
చెప్తాను చిన్నోడా కానీ ఇప్పుడు కాదు మనం ఇంటికెళ్లాక చెప్తాను. అప్పటివరకు నన్ను మీరిద్దరూ విషయం ఏంటి అని అడగవద్దు.
సరే తాతయ్య నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం ఎటువంటి టెన్షన్లు పెట్టుకోవద్దు నీ మనవడిని నేను ఉన్నాను ఆ సమస్య ఏంటో నాకు చెప్పు నేను పరిష్కరించేదైతే కచ్చితంగా చేస్తాను.
ఈ సమస్యను కేవలం నువ్వు మాత్రమే పరిష్కరించగలవు చిన్నోడా. నీకు నేను అన్ని విషయాలు చెప్తాను కానీ ఇక్కడ కాదు మన ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం దీని గురించి అప్పటివరకు మీరిద్దరూ దాని గురించి నన్ను అడగవద్దు.
సరే తాతయ్య అయితే నువ్వు చెప్పింది దాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. డాక్టర్స్ రిపోర్ట్స్ వచ్చాక ఇంటికి పంపిస్తాను అన్నారు రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో కనుక్కుంటాను.
హమ్ అని ఆయన కళ్ళు మూసుకొని పడుకుంటాడు
జాగ్రత్త అండి మనకి మన మనవడు ఉన్నాడు మనల్ని చూసుకోవడానికి మీరు ఏ విషయం గురించి ఇంతగా ఆలోచించనవసరం లేదు అని చెప్పి నానమ్మ గారు కూడా బయటికి వెళ్తారు.
నానమ్మ మనకు తెలియని సమస్య ఏముంది తాతయ్యకి అయినా మీరు ఒక్కరే ఉన్నారు ఏంటి హాస్పిటల్లో ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు. అన్ని విషయాలు ఇంటికెళ్లాక మాట్లాడుకుందాము చిన్నోడా ఇప్పటికైతే రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో కనుక్కొని రా అని చెప్పి మనవడిని డాక్టర్ రూమ్ దగ్గరికి పంపిస్తుంది నాన్నమ్మ.
కిరణ్ కి ఫోన్ చేసి తన ఇండియా చేరుకున్నట్లు చెప్పి అక్కడ ఏమేమి పనులు చేయాలో చెప్పి తాత ఆరోగ్యం గురించి కూడా కిరణ్ కి చెప్పి ఎక్కువ రోజులు ఉండేటట్టు ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉండాల్సి వస్తది అని కిరణ్ కి చెప్తాడు.
ఓకే సార్ మీరు తాతయ్య గారి ఆరోగ్యం కుదుటపడ్డాకే రండి ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను.
నీ మీద నమ్మకంతోనే కిరణ్ నేను ఉన్న ఫలంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నా ఇంట్లో వాళ్ళ తర్వాత అంతగా నేను నమ్మే వ్యక్తివి నువ్వే.
అందుకే అంత ధైర్యంగా బాధ్యతలు అన్నీ నీకు అప్పగించి నేను వచ్చేసాను ఇక్కడికి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నువ్వు చెప్తూ ఉండు. సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచి వర్క్ చేస్తాను నేను కూడా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సమస్యని పరిష్కరించి నేను వస్తాను అక్కడికి అప్పటివరకు కొంచెం బాధ్యతగా ఆఫీస్ చూసుకో.
చెప్పానుగా సార్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు.
రిపోర్ట్ ఎప్పుడు వస్తాయి డాక్టర్ గారు.
ఇంకొక గంటలో వస్తాయండి మాక్సిమం ఈవినింగ్ డిశ్చార్జ్ రాస్తాను లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ రాస్తాను.
ఓకే డాక్టర్. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు కదా మా తాతయ్య గారికి.
చెప్పా కదా అండి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయనకి ఎటువంటి ఆలోచనలు లేకపోతే ఆయన ఆరోగ్యం బాగుంటది.
సరే డాక్టర్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను మా
తాతయ్య గారిని.
కామెంట్స్, రేటింగ్ ఇచ్చి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్న.♥️
ఇంకా ఉంది.
ప్లీస్ ఇగ్నోర్ మిస్టేక్స్.
ప్లీస్ ఫాలో మీ ♥️.
Swipe left/right or tap the sides to turn pages