హే త్రిషిక ఏంటి ఈరోజు లేట్ అయింది.
ఏమి లేదు లాస్య చిన్ని మొన్న ఒక స్కూల్ లో ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంది.అక్కడికి వెళ్లి తన బదులు నేను చెప్తాను అని చెప్పడానికి వెళ్ళా.
అదేంటే నువ్వు వేరే వర్క్ చేస్తున్నావు కదా అని అంటుంది రమ్య.
అవును రమ్య నిన్నటి వరకు చేశాను ఈ రోజు నుంచి చేసే పనిలేదు.
అదేంటే అలా అంటావు.
ఏం లేదు అది వేరే వాళ్ళకి అమ్మేశారు,వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఉన్నారు అంట.అందుకే నేను వేరేది చూసుకోవాలి అనుకున్న. ఈ లోపు చిన్ని చూసుకుంది. సరే లే అని అది నేనే చేద్దాం అని ఫిక్స్ అయ్యా.