New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 5

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 5

డాక్టర్ గారిని అడిగి డిశ్చార్జ్ రాయించుకుని ఇంటికి తీసుకొని వెళ్తారు తాతయ్య గారిని.

 

 

ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. నానమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు ఎవరూ లేరు. 

 

 

వాళ్ల గురించి తర్వాత చెప్తా  ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రా పో ఎప్పుడు తిన్నావు ఏమో ఏదో ఒకటి చేస్తాను తినడానికి. తాతయ్య గౌడ తిని మెడిసిన్ వేసుకోవాలి కదా. 

 

 

సరే నానమ్మ వెళ్తున్నాం లే. 

 

తాతయ్య గారిని కూడా రూమ్ లోకి తీసుకెళ్లి ఫ్రెష్ చేయించి హాల్లో కూర్చోబెడతారు అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు కూడా ఫ్రెష్ అయ్యి లైట్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు

 

 

చిన్నోడు కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు. ముగ్గురు తిన్న తర్వాత తాతగారికి మెడిసిన్ ఇస్తారు.

 

 

తాతగారు మెడిసిన్ వేసుకొని ఇప్పటికి మీరు పడుకోండి ఏది ఉన్నా రేపొద్దున మాట్లాడుకుందాం చిన్నోడా నేను నీతో మాట్లాడాలి రేపొద్దున మాట్లాడతాను ఇప్పటికైతే రెస్ట్ తీసుకో నువ్వు వచ్చి దగ్గర నుంచి రెస్ట్లెస్ గా కనిపిస్తున్నావు. 

 

అందుకే ఏదన్నా రేపొద్దున మాట్లాడుకుందాం. నా మనసులో ఉన్న మాట కచ్చితంగా నీకే చెప్తాను చిన్నోడా. ఇప్పటివరకు ఎవరికీ అది చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పే సమయం వచ్చింది. అందుకే నీకే చెప్తాను. నాకున్న ఒక బాధ్యత నీకే అప్పగిస్తాను చిన్నోడా. దాన్ని మాత్రం నువ్వు కచ్చితంగా నెరవేర్చాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అది కేవలం నీ వల్లే అవుతుంది కూడా. ఇప్పటికీ ఆ విషయం గురించి ఆలోచించొద్దు వెళ్లి ప్రశాంతంగా నిద్రపో రేపొద్దున నేనే నీకు చెప్తాను అని ఆయన రూమ్ లోకి వెళ్తారు రెస్ట్ తీసుకోవడానికి. 

ఏంటి నానమ్మ తాత ఏంటి ఏదో బాధ్యత అంటున్నాడు ,మనసులో మాట అంటున్నాడు నీకు ఏమైనా తెలుసా దాని గురించి. 

 

లేదు చిన్నోడా నాకేమీ తెలియదు. నిజంగా తెలియదా నానమ్మ లేకపోతే నా దగ్గర ఏమైనా దాస్తున్నావా నువ్వు. 

 

నీ దగ్గర దాయాల్సినంత అవసరం ఏముంది చిన్నోడా నిజంగా నాకు తెలియదు నాకు తెలిస్తే నీకు చెప్తాను కదా ఈ ఒక్క నైట్ ఆగు రేపొద్దున మీ తాతయ్య చెప్తాను అంటున్నాడు కదా. 

 

 

సరే నానమ్మ నువ్వు కూడా వెళ్లి రెస్ట్ తీసుకో నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. 

 

చిన్నోడు రూమ్ లోకి వెళ్లి కిరణ్ కి ఫోన్ చేసి ఆఫీస్ విషయాలన్నీ కనుక్కొని, వాళ్ళ తాతయ్య తనతో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ పడుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు.

 

ఉదయం లేచే సరికి లేట్ అవుతుంది, అప్పటికి వాళ్ళ తాతయ్య తిని టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు.

 

 

విషయం గురించి తర్వాత వేసుకోవచ్చు లే అని వాళ్ళ తాతయ్య ని కదిలించడు. 

 

 

ఏంటి నాని ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు ఎవరు కనిపించట్లేదు. తాతకి హార్ట్ ఎటాక్ వచ్చిన కూడా ఇంట్లో ఎవరూ లేరా ,లేదంటే నువ్వు వాళ్ళకి చెప్పలేదా.

 

 

మీ తాతయ్య నీకే ఫోన్ చేసి చెప్పమన్నాడు చిన్నోడా అందుకే నేను నీకే చెప్పాను. ఇంక ఇంట్లో వాళ్లు అంటావా అసలు ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు ఎప్పుడు వస్తున్నారు తెలియట్లేదు ఇంక నేను వాళ్లకి ఏమని చెప్పాలి. 

 

అదేంటి నాని అలా అంటావు. నీకు తెలియకపోవడమేంటి నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా మరి వాళ్ళ వెళ్లేటప్పుడు నీకు చెప్పలేదా లేదా నువ్వు అడగ లేదా.

 

 

ఇంట్లో పరిస్థితులు చాలా వరకు తారు మారయ్యాయి చిన్నోడా ఈ మధ్య తాతయ్య కొంచెం నలతగా ఉంటుంది అని నేను తాతయ్య దగ్గర ఎక్కువగా ఉంటున్నాను. ఇంట్లో విషయాలు పట్టించుకోవడం లేదు.

 

వయసు రిత్యా ఆరోగ్యమే బాగోలేదు అని నేను అనుకున్నాను కానీ ఇలా తాతయ్య మనసులో ఏదో  ఉంచుకొని బాధపడుతున్నాడు నేను అనుకోలేదు చిన్నోడ.

 

 

అదేంటి నాని అట్లా అంటావు పోయినసారి నేను వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా.

నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చిన్నోడ. ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం వచ్చావు అది కూడా ఒక పది రోజులు ఉన్నావు, వర్క్ ఉందని వెంటనే వెళ్లిపోయావు. అంతకు ముందు నువ్వు వేరే దేశం వెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీకు అసలు గుర్తుందా.అప్పుడు కూడా నేను ఏడ్చి గోల చేస్తే వచ్చావు గాని లేకపోతే వచ్చే వాడివ  నువ్వు అసలు.

 

 

నువ్వు ఇక్కడికి రావాలంటే ఒకటి నేను ఏడవను అన్నా ఏడవాలి రెండు మీ తాతయ్య గారు ఆరోగ్యం బాగోలేకుండా ఉండాలి. అప్పుడు నీకు మేము గుర్తొస్తాము నువ్వు అప్పుడు వస్తావు మా కోసం.

 

అబ్బా నాని అలా అనకు అక్కడే చదువుకొని అక్కడే బిజినెస్ చేస్తున్నా కాబట్టి ఇక్కడికి రావడానికి కుదరట్లేదు నాకు. ఇప్పుడు వచ్చాను కదా ఇప్పుడు తాతయ్య బాధ ఏంటో తీర్చే వెళ్తాను ఇక్కడి నుంచి.

 

అదిగో మళ్లీ వెళ్తాను అంటున్నావు కానీ ఇక్కడే ఉంటాను అని అనట్లేదు కదా నువ్వు. ఈ వయసులో మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా మా మనవాళ్ళ పెళ్లిళ్లు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి అని. 

 

 

నాని నీకు అన్నీ తెలుసు నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడతావ్ ఏంటి. 

 

కోపం వద్దు చిన్నోడా జరిగిపోయింది జరిగిపోయింది దాన్ని మనం మార్చలేము. నీకు ఎంత బాధ ఉందో మాకు కూడా అంతే బాధగా ఉంది. అలా అని జీవితం అక్కడ ఆపలేం కదా మనం. అందుకే 

ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసుకొని మా కళ్ళ ఎదురుగానే ఉండి మీ పిల్లల్ని మా చేతిలో పెట్టండి. వాళ్ళని చూసుకుంటూ మా వృద్ధాప్యం గడుపుతాము. 

 

నాని నేను వేరే దేశం ఎందుకు వెళ్లాను నీకు తెలుసు మళ్ళీ నువ్వు పెళ్లి పిల్లలు అని మాట్లాడతావు ఏంటి. 

 

అదేంటి చిన్నోడా మాకు ఉండదా మీకు పెళ్లి చేయాలనే మీ పిల్లల్ని మేము ఎత్తుకొని ఆడించాలి అని ఎప్పుడో ఏదో జరిగిపోయింది ఇంకా అదే పట్టుకొని ఉంటే ఎట్లా. ఏది జరిగినా మన మంచిదే జరిగింది అని అనుకోవాలి అంతేకానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. 

 

 

నాని ప్లీజ్ ఇంకా ఆపు. నాకు అందుకే ఇండియా రావాలంటే ఇష్టం ఉండదు వచ్చిన దగ్గరనుంచి నువ్వు ఇలానే ఏదో ఒకటి అంటూనే ఉంటావు. నేను తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను లేచాడేమో చూస్తా .

 

చిన్నోడు రూమ్ లోకి వెళ్ళేసరికి తాతయ్య అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుని ఉంటాడు. 

మీ నానమ్మను కూడా పిలువు చిన్నోడా మీ ఇద్దరితో మాట్లాడాలి. 

 

 

నాని రా తాతయ్య లేచాడు నిన్ను కూడా పిలుస్తున్నాడు మనిద్దరితోనే మాట్లాడాలి అంట. 

 

 

మనిద్దరితో మాట్లాడేది ఏమి ఉంది చిన్నోడా. 

 

ఏమో వెళ్తే తెలుస్తుంది కదా ముందు పద? వెళ్దాం ఏదైనా పని ఉంటే పనివాళ్ళకు చెప్పు వాళ్లే చేస్తారు. 

 

 

వంట వంట ఒకటే లేరా నేను చేసేది మిగిలిన పని అంత పని వాళ్ళదేలే చేసేది. అని మాట్లాడుకుంటూ ఇద్దరు రూమ్ లోకి వెళ్తారు. 

 

 

ఆ తలుపులు మూసివేయండి అని చెప్తారు తాతయ్య గారు.

 

మీ ఇద్దరి కాచి కూర్చుండి మీతో మాట్లాడాలి అని అంటారు తాతయ్య. సరే అని అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటారు ఇద్దరు. 

 

ఇప్పుడు నేను చెప్పేది కేవలం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. నాలుగో వ్యక్తికి తెలియకూడదు.

 

సరే మేము ఎవరికి చెప్పము అని అంటారు చిన్నోడు అండ్ అమ్మమ్మ.

 

 

వాళ్ళ తో ఒక గంట పాటు మాట్లాడి వాళ్ల కంట్లో నీళ్లు తెప్పిస్తారు తాతయ్య గారు. 

 

 

చూడు చిన్నోడా నాకు ఈమధ్య తెలిసింది దీని గురించి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మన ఇంట్లోనే మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అందరూ మనవాళ్లే అని మనం అనుకున్నాం కానీ మన వెనుక జరిగేది మనకు తెలియట్లేదు కాబట్టి నువ్వు తెలుసుకో మన వెనక ఏం జరుగుతుంది అనేది.

నేను చేసిన అతిపెద్ద తప్పు అందరూ మనవాళ్లే అనుకోని తెచ్చి ఇంట్లో పెట్టడమే కానీ చివరికి వాళ్లే నాకు ఈ విధంగా అన్యాయం చేస్తారని నేను అనుకోలేదు. 

 

 

ఏంటండీ మీరు అనేది నిజమా ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మీరు. 

 

 

నేను పడే బాధ సరిపోదు నిన్ను కూడా బాధ పెట్టమంటావా. నాకు కూడా అనుకోకుండానే తెలిసింది ఆ నిజం.

 

మరి ఇప్పుడు ఏం చేద్దాం అండి. ఈ సమస్యకు పరిష్కారం దొరికేది ఎప్పుడు. మనం అందరం సంతోషంగా ఉండేది ఎప్పుడు. 

 

 

 

ఆ రెండు జరగాలంటే చిన్నోడు ఇక్కడే ఉండాలి. ఏంటి చిన్నోడా ఉంటావా ఇక్కడే చెప్పింది చేస్తావా. సమస్యకు పరిష్కారం చూపిస్తావా. 

 

 

తాతయ్య ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు కానీ ఒకటే నా జీవితంలో జరగదు జరగలేదు అని అనుకునేది ఇప్పుడు జరుగుతుంది జరిగేలా చేసుకుంటాను నేనే. నువ్వు ఇంక దాని గురించి ఆలోచించొద్దు అన్నీ నేను చూసుకుంటా నీ కోరిక నెరవేరుస్తా.

 

చిన్నోడా రేపు ఆఫీసు బాధ్యతలని నీకు అప్పగిస్తాను నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నిన్ను ఆపే వాళ్ళు కానీ అడిగేవాళ్లు ఎవరూ లేరు. ఎవరన్నా ఏదన్నా అన్న నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యి నీకు నేను అబ్జెక్షన్ పెట్టను.ఇన్ని రోజులు మన ముగ్గురి బాధకి నువ్వు ప్రతి కారం తీర్చుకోవాలి. మనం పడ్డ బాధకి వాళ్లు నాలుగింతలు బాధపడాలి.

 

 

మన  ముగ్గురి బాధకి మన ఇంట్లో వాళ్ళు ఎంతవరకి కారణమో కూడా తెలుసుకో నువ్వు.

 

అది ఎవరైనా సరే మనకెంత దగ్గర వారైనా సరే వాళ్ల అంత నువ్వు చూడాల్సిందే. నా ఈ కోరికను తీరుస్తావని అనుకుంటున్నాను. 

 

 

నీ కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేర్చకుంటా  తాతయ్య. నాకు ఎప్పటికీ దొరకదు అని అనుకున్నది  ఇప్పుడు దొరుకుతుంది. అది నేను ఎందుకు కాదంటాను చెప్పు.

 

నానమ్మ ఇందాక పెళ్లి పిల్లలు అని అన్నావు కదా, రెడీ అయిపో నా పిల్లల ముక్కలు, మూతులు క్లీన్ చెయ్యడానికి అని అంటాడు చిన్నోడు హుషారుగా అక్కడి వాతావరణం తేలిక చెయ్యడానికి.

 

ఏంటండీ ఇంత బాధని మీ మనసులోనే పెట్టుకొని నలిగిపోతున్నారా.

నానమ్మ జరిగింది వదిలేయి ఇంక నువ్వు తాతయ్య నీ ఈ విషయం అడిగి ఇబ్బంది పెట్టొద్దు.

 

గడిచిన గతాన్ని వదిలేసి జరగబోయేది చూడు నువ్వు. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయి. 

 

తాతయ్య నువ్వు రెస్ట్ తీసుకో నేను నా ఆఫీసు విషయాలన్నీ చూసుకోమని కిరణ్ కి ఫోన్ చేసి చెప్తాను .

 

 

నానమ్మ నువ్వు వెళ్లి లంచ్ సంగతి చూడు. 

 

హాయ్ ఆల్. 

రేపటి ఎపిసోడ్లో అందరి పేర్లు రివిల్ చేస్తాను. 

మీకు కుదిరితే హీరో హీరోయిన్ పేర్లు సజెస్ట్ చేయండి నాకు.

 

 

కామెంట్స్, రేటింగ్ ఇచ్చి సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్న.❤️

 

ఇంకా ఉంది.

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.

ప్లీజ్ ఫాలో మీ.🫰🏻🫰🏻🫰🏻♥️♥️♥️